29, నవంబర్ 2009, ఆదివారం

సర్ ఆర్థర్ కాటన్...

ఈ రోజు నా మటుకు నాకు ఒక గుర్తుంచుకో దగిన రోజు. గల గలా గోదారి పరుగులిడుతూ వృధాగా సముద్రుని చేరుతున్న సమయంలో దాని పరుగులకు మజిలీ ల నేర్పరచి , దారి మళ్ళించి లక్షల ఎకరాల నేలను సస్యశ్యామలం చేసిన, అపర భగీరథుడు కాటన్ దొర, గోదావరి జలాలను ఉపయోగించు కొంటున్న అందరికీ ఆరాధ్య దైవం అనడం అతిశయోక్తి కాదు... అటువంటి మహానుభావుని ముని మనుమడు ఈ రోజు ఇక్కడకు రావడం, మేము సాదర స్వాగతం పలకడం జరిగింది.. గోదావరి జీవితాన్ని సార్థకం చేసిన ఆయన గొప్పవాడు... మన దేశానికి సంబంధించిన మహానుభావులను సైతం మనం సరిగ్గా జ్ఞాపకం చేసుకోం.. అలాంటిది కాటన్ దొరను మాత్రం గుండెల్లో నిలుపుకున్నాం... అన్నం పెట్టిన చెయ్య కదా ... ఎలా మరిచిపోతాం

మురళి.

11, నవంబర్ 2009, బుధవారం

తెలుగులో షేర్ మార్కెట్ పత్రిక...

మొత్తానికి తెలుగులో ఒక షేర్ మార్కెట్ కు సంబంధించి ఒక పత్రిక రావడం ప్రారంభం అయ్యింది... ఇంగ్లీషులో ఎన్నో పత్రికలూ, వెబ్ సైట్ లు ఉన్నా, తెలుగులో కరువనే చెప్పాలి.. తెలుగు దిన పత్రికలలో వారానికి ఒకసారో, రోజుకి ఒక పేజి కో పరిమితమైన షేర్ మార్కెట్ ఇపుడు సంపూర్ణంగా ఒక పత్రిక రూపం లో రావడం ... అందులో విషయం ఉన్నా లేక పోయినా, దానిని ఆధారం చేసుకొని జనాలు సంపాదించినా, పోగొట్టుకొన్నా, దాని ధర వారానికి ఇరవై రూపాయలు అంటే ఎక్కువని పించినా, లేదూ.... రీజనబుల్ అనిపించినా, అది ఎక్కువ కాలం నిలిచేది అయినా, కొంత కాలానికి ఆగి పోయేది అయినా... ప్రస్తుతానికి అవసరం... ఆహ్వానించ తగ్గ అవసరం.. ఎందుకంటె షేర్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే డబ్బు సంపాదించి పెట్టె యంత్రం కాదు... ఉద్యోగ పర్వం లోకి అడుగు పెట్టిన నాటి నుండే పొడుపు అనేది ప్రారంభించడం ఈ కాలం లో తప్పని సరి. ఎందుకంటె ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నంత భద్రత ఎంత జీతం ఇచ్చినా గాని ప్రైవేటు ఉద్యోగాలలో ఉండదని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు నిరూపించాయి... రిటైర్ మెంట్ వయస్సు ఇంతకు ముందు ఏభై ఐదు సంవత్సరాలే... ఇప్పుడు ఐతే జీవితాంతం కష్ట పద వలసిందే... లేదా సంపాదించే సమయం లోనే దాచుకోవాల్సిందే.. అది ఇల్లు, పొలాలు, స్థలాలు, బంగారం, బ్యాంకులు , పోస్ట్ ఆఫీసు లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ లు, .... ఏదో ఒక రూపం.... ఎక్కువ లాభం పొందడానికి అవకాసం ఉన్నా.. షేర్ మార్కెట్ లో రిస్క్ తప్పనిసరి... ఇందులో లక్షలు సంపాదించిన వారికన్నా రోడ్డున పడ్డ వారే ఎక్కువ.... ఇటువంటి పరిస్తితులలో తెలుగులో మన సందేహాలకు సమాధానాలు ఇచ్చే ఒక పత్రిక అవసరం ఉంది... శుభం పలకరా అంటే... అన్నట్టుగా కాకుండా ఆ పత్రిక విజయం సాధించాలని మనసారా కోరుకొంటున్నాను... ఇంతకు పత్రిక పేరు ... వెల్త్ మోర్ షేర్ గురు