29, ఆగస్టు 2014, శుక్రవారం

వినాయక చవితి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు ....

14, ఆగస్టు 2014, గురువారం

బ్లాగ్ మిత్రులకూ ,  స్వదేశంలో మరియూ విదేశాలలో ఉన్న భారత దేశ పౌరులకూ , ఇరు రాష్ట్రాల తెలుగు పౌరులకూ అందరికీ ,

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 


మీ
మురళి .
 

9, ఆగస్టు 2014, శనివారం

తేజస్విని TO ఆంధ్ర బ్యాంకు ...

తేజస్విని వయసు 7 దాటి 8 లోకి రాబోతోంది .... వచ్చే నెల 11 న తన 7 వ పుట్టిన రోజు ... అయితే వయసు పెరుగుతోంది తప్ప సందేహాలు తగ్గడం లేదు ... ఈ మధ్య తన బుక్ పై పేరు రాస్తూ T  Tejaswini అని రాస్తూ T అంటే తుంబలి తేజస్విని అని వివరించాను ... sur నేమ్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు ... మీ అమ్మ పేరు తుంబలి రమాదేవి ... కానీ పెళ్ళికి ముందు రఘుపాత్రుని రమా దేవి ... అని చెబుతూ ... నా పేరు తుంబలి మురళి ... అని వివరించాను ... వెంటనే ప్రశ్న "మరి పెళ్ళికి ముందు నీ ఇంటి పేరు ?"  అల్లు అర్జున్ స్టైల్ లో "దేముడా " అని అనుకోవడం తప్ప నేను ఇంకా ఏమి చేయ గలను ? ( కానీ వివరించాల్సింది వివరించాను ... పితృస్వామ్య వ్యవస్థ లో ఇంటి పేరు తండ్రి దే అని )

శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్షి రూపు కొనడానికి బంగారం షాప్ కి వెళ్ళడం జరిగింది ... అక్కడ నుండి బయటకు వచ్చాక మా పాప మాటలు "చిన్న రింగులు Two thousand చెబుతున్నాడు నాన్న ... అదే బయట టెన్ రుపీస్ కి వచ్చేస్తాయి " రింగుల గురించి తెలుసు కానీ బంగారం గురించి తెలీదు కదా ... ఇంకా ఆ డిఫరెన్స్ గురించి వివరించక తప్పలేదు ఆ సమయం లో కూడా ...  


వెల్త్ మోర్ షేర్ గురు - స్టాక్ మార్కెట్ కు సంబంధించి తెలుగు లో వస్తున్న ఒక మంచి పత్రిక ... అందులో SIP కు సంబంధించి ఒక శీర్షిక లో ఏదో ఒక స్టాక్ లో నెలకు రూ . 10000 /- చొప్పున 10 నుండి 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే లక్షలు ఎలా కోట్లు గా మారతాయో calculate చేసి ఇస్తూ ఉంటారు ... నా పోర్ట్ ఫోలియో లో స్టాక్ "ఆంధ్ర బ్యాంకు " అని చాల సార్లు చెప్పాను ... సరదాగా ఆంధ్ర బ్యాంకు లో సిప్  పధ్ధతి లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో కింద వివరించాను ... సీరియస్ గా గమనించండి ...

ఆంధ్ర బ్యాంకు స్టాక్ స్టార్టింగ్ డేట్ ... ఏప్రిల్ 2001 - ఆగష్టు 2014 వరకు 14 సంవత్సరాలు (161 నెలలు ఆగష్టు వరకూ )
క్రింద statement గమనించండి ... ఏప్రిల్ 2001 నుండి మే 2002 వరకూ నెలకు రూ 10000 చొప్పున రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఆయా నెలల్లో ధరను బట్టి మొత్తం లభించే షేర్ల సంఖ్య 23575. వీటికి గాను లభించి న డివిడెండ్ విలువ Rs. 33005. 00  ఈ అమౌంట్ తో కొన్న షేర్ల సంఖ్య 2833 ; మొత్తం షేర్స్ 33005
ఈ విధంగా ఆగష్టు 2014 వరకూ


Total amount invested             16,10,000.00          
Total No.of shares                   83,115.74  
Value at present rate @75/-   62,33,680.73  
Profit  46,23,680.73  
%age of Profit            287.19  
Average %age per year                20.51        

ఈ రెండు రోజుల్లో 75 కు చేరింది కానీ, అంతకు ముందు 90 వరకూ వేల్యూ ఉంది ... అంటే 74,80,350 విలువ అన్న మాట ...

Month Open Price Monthly Investment No.of Shares
Apr-01 9.5 10000         1,052.00
May-01 8.75 10000         1,142.00
Jun-01 9 10000         1,111.00
Jul-01 7.6 10000         1,315.00
Jul-01 8.9 10000         1,123.00
Aug-01 8.5 10000         1,176.00
Aug-01 8.05 10000         1,242.00
Sep-01 6.5 10000         1,538.00
Sep-01 8.65 10000         1,156.00
Oct-01 8.2 10000         1,219.00
Oct-01 8.05 10000         1,242.00
Nov-01 7.9 10000         1,265.00
Nov-01 8.5 10000         1,176.00
Dec-01 8.3 10000         1,204.00
Dec-01 8.1 10000         1,234.00
Jan-02 8.1 10000         1,234.00
Feb-02 8.6 10000         1,162.00
Mar-02 9.4 10000         1,063.00
Apr-02 9.4 10000         1,063.00
May-02 11.65 10000            858.00
  Div. per share Dividend Amount       23,575.00 Total Shares purchased  
1.4                  33,005.00         2,833.05 Share purchased with dividend amount

                        
                        

 సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ...