11, ఫిబ్రవరి 2017, శనివారం

షేర్ గురు స్టాక్

దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 

... 

2016 - 17 ఆర్ధిక సంవత్సరం ముగింపు కు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది ... ఇంకా ఫిబ్రవరి 11 వ తేదీయే కదా ... అనుకుంటాం ... ఎంతసేపు ?  నడుస్తున్న  పోర్టిఫోలియో లు ముందుకు నడపాలా లేక ముగించేయాలా ?  పెరగడం లేదు కాబట్టి అమ్మేసుకుందాం ... పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా పెరుగుతుందేమో అని అమ్మకుండా ఉందాం ... లేక కొంత లాభాల స్వీకరణ చేసి, మరికొంత కలుపుకుంటూ పోదాం ... ఎలా చేస్తే బాగుంటుంది ... కొత్త స్టాక్స్ ఏమి చేర్చాలి ? పాతవాటిని వేటిని వదిలించుకోవాలి ? ఇలా ప్రశ్నలే ప్రశ్నలు ... 

ఇటువంటి సందర్భంలో మనమే మన పై ఆధారపడాలి ... మరొకరి నిర్ణయం , అభిప్రాయం ... మనకు అనవసరం ... తోచింది చేసేయాలి ... ఫలితం తీయగా ఉంటుందా ... మంచిదే ... లేక చేదుగా ఉంటుందా ? అదీ మంచిదే ... మరోసారి చేదు ఫలితాన్నిచ్చిన ప్రయత్నం చేయం ... అంతే ... సంవత్సరం క్రితం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టాక్స్ ... వేస్ట్ ... ఉంటె నష్టానికైనా అమ్మేయండి ... అన్నారు ... బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టె మ్యూచువల్ ఫండ్స్ జోలికి పోవద్దన్నారు ... మరి ఇప్పుడు ... వాటి జోరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ... కాబట్టి ... స్టాక్ మార్కెట్ లో తక్కువ రిస్క్ తో కూడిన స్టాక్స్ ఏమిటయ్యా అంటే అవి బ్యాంకు స్టాక్స్ ... 

ప్రస్తుతం పెరుగుదల తక్కువగా లేక నష్టాల్లో ట్రేడవుతున్నా ... కొన్ని స్టాక్స్ భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వ వచ్చు ... అందుకని వాటిని దీర్ఘకాలపు మదుపు సాధనాలుగా జమకట్టి ముందుకు సాగుతూ ఉండాలి ... ఎరుపు రంగులో ఉన్న పోర్టుఫోలియో పచ్చ రంగులో కి చేరేవరకూ కొంటూ ఉండటమే ... తగిన ధర రాగానే ... సెంటిమెంట్ ఫీలవకుండా అమ్మేయడమే ... 

షేర్ గురు లాంటి పత్రికలయినా , మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లాంటి వెబ్ సైట్ లైనా , సూచనలు చేస్తారు ... నిర్ణయం మాత్రం మనదే ... 

అన్నట్టు మల్టి బ్యాగర్ సూచించిన స్టాక్స్ నెలాఖరు లోగ పెరిగేటట్లు కనిపించట్లేదు ... కాబట్టి కొన్నవాళ్ళు 3 - 5 % పెరిగితే లాభాల స్వీకరణ చేసేయడం ఉత్తమం ...  లేదూ ... ఇంకా పెరిగేటప్పుడే అమ్ముదాం ... అనుకున్నా పరవాలేదు ...  అవి మంచి షేర్ లే ... ముంచేవి కావు ... 

పంజాబ్ నేషనల్ బ్యాంకు ... షేర్ గురు సిప్ కోసం సూచించిన స్టాక్ ... 10 శాతం దాటి పెరిగింది ... గమనించారా ?  ఆంధ్రా బ్యాంక్ స్టాక్ లో ఇప్పుడిప్పుడే కదలికలు వస్తున్నాయి ... అయితే మోజర్ బేయర్ పరిస్థితి మాత్రం అర్థం కావటం లేదు ...  ఆ కంపెనీ ఏదో రుణ పునవ్యవస్తీకరణ కోసం ప్రయత్నిస్తున్న దని , బాలన్స్ షీట్ లో నష్టాలు పెరిగాయని  వార్తలు వస్తున్నాయి ... సోలార్ రంగం ప్రోత్సాహ కరంగా ఉన్నప్పటికీ ... ఈ షేర్ విలువ ఆశాజనకంగా పెరగక పోవడం కొద్దిగా నిరాశ పరిచే వాస్తవం ... చూడాలి ... 

సరే మరి ... 

7, ఫిబ్రవరి 2017, మంగళవారం

హ్యాపీ సండే

మొన్న ఆదివారం (ఫిబ్రవరి 5) పుష్కర్ ఘాట్ "హ్యాపీ సండే " నాడు, మాజీషియన్ తో స్టేజి మీద "తేజస్విని"
సోమవారం "సాక్షి" తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్ ఫోటో