28, జనవరి 2011, శుక్రవారం

కుక్క తోక రౌండ్ గ ఎందుకు ఉంటుంది?

ఈ మధ్యనే మా తేజస్విని మరో కొత్త విషయాన్ని కనిపెట్టింది... మరి ఆ ఇన్వెన్షన్ గురించి తన మాటల్లోనే... (ఇన్వెన్షన్ అనకూడదేమో కదా.. డిస్కవరీ అనాలేమో... అల్ రెడీ ఉన్నది కనిపెడితే డిస్కవరీ అనీ, లేని దాన్ని కనిపెడితే ఇన్వెన్షన్ అని అనాలని ఎప్పుడో చిన్నప్పుడు చదివాను... సరే... ఏదో ఒకటి... టాపిక్ పక్క దారికి పోతుంది... కాబట్టి విషయానికి వచ్చేద్దాం. తన మాటల్లోనే చదివితే బాగుంటుంది... కాని "త" అని ఉన్నచోట "క లేదా గ" అని చదువుకోవలెను... ఎందుకంటె మా పాపకు "క" పలకదని ఇంతకూ ముందే చెప్పను కదా..)
"నాన్నా... ఆ తుత్త (కుక్క) చూడు... తొత ఎలా చుట్టుతుందో... "
"అవునమ్మ... "
"అలా ఎందు తు చుత్తుతుందో తెలుసా?"
"తెలీదమ్మ... ఎందుకలా చుట్టుకుంది?"
"ఎవరైనా లా దేత్తారని ... లాడతుందా చుట్టేసుతుంది..."

అదండీ సంగతి... పొడుగ్గా వదిలేస్తే ఎవరైనా లాగేస్తారని... రౌండ్ గా చుట్టేసుకుందట...
మరి ఇది ఇన్వెన్షన్ అవుతుందా... డిస్కవరీ అవుతుందా?

23, జనవరి 2011, ఆదివారం

కాలితే మంట ఏది?

ఇది తేజు మార్క్ జోక్.
మొన్న ఒక సారి టీ తాగు తుండగా నా పైకి పాప రావడం తో టీ ఒలిగి నా పై పడింది... వేడి గా ఉండటం తో కాలింది... "అబ్బా... " అన్నాను నేను.. "ఏమైంది నాన్న?" పాప ప్రశ్న. "ఏమవుతుంది... టీ ఒలిగి .... ఒళ్ళు కాలింది..." కోపం గా చెప్పాను నేను... "మరి కాలితే... మంట ఏది?" వెంటనే మా పాప ప్రశ్న.... ఒక్క క్షణం ఖంగు తిన్న నాకు... కోపం పటా పంచలై పోయిందని వేరే చెప్పాలా?

22, జనవరి 2011, శనివారం

రెండు వేల పన్నెండు వరకైనా బతక నివ్వరా?

ఆ మధ్య ఒక సినిమా వచ్చింది.. దాని ప్రకారం రెండు వేల పన్నెండు సంవత్సరం లో ప్రపంచం అంత మై పోతుందని చూపడం ముఖ్యాంశం. నీళ్ళే కనబడని కృష్ణ నదికి వరదలు వచ్చి నప్పుడే అర్థమైయ్యింది ప్రకృతి దయా దాక్షిణ్యాల పైనే మన మనుగడ ఆధార పది ఉంటుంది అని.. ఎప్పుడు గట్టిగా ఎండ వస్తుందో తెలియదు... ఎన్ని డిగ్రీ ల మేరకు వాతావరణం తగ్గిపోతుందో తెలియదు. ఇంతకూ మునుపెన్నడూ లేనంత చలి ఈ సారి రావడం, కావలసి నప్పుడు కాకుండా, పండించిన పంట అంతా నాశనం కావడానికా అన్నట్లు వరదలు రావడం... ఇవన్ని ప్రకృతి వైపరీత్యలకి ఉదాహరణలు..
ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలెం ... ఒక వేళ దానికీ ఏదో ఒక మార్గం ఉంది ఉండ వచ్చు. కానీ ఈ మనిషి పైత్యానికి విరుగుడు మాత్రం ఈ ప్రకృతి లోనే లేదు... అనిపిస్తుంది...
ధరలు కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగి పోతున్నా, మనుష్యులు బతక లేక ఆత్మా హత్యలు చేసు కుంటున్నా, సామాన్యుడు ఆత్మా హత్య చేసుకోన దానికి కూడా, ధైర్యం చాలక, శవాల్ల బతుకు ఈడ్చు కుంటూ వస్తున్నా, ఈ సంగతి ప్రజా ప్రతినిదులకూ పట్టదు. ..... దీక్షలు చేసి పదవులు పొందాలనుకొనే వారికీ పట్టదు... ప్రత్యెక రాష్ట్రాలు కావాలనుకొనే వారికీ పట్టదు... వీళ్ళ దగ్గర మూటలు మూటలు డబ్బు మూల్గుతూ ఉంటుంది... అందులోంచి పైసా తీయరు... కానీ అవకాసం వస్తే ప్రజా సేవ చేసేస్తామని కబుర్లు... తినడానికి తిండి లేని వాడికి పౌష్టికాహారం తినమన్నాడట ఒక డాక్టరు.. మన ఆర్ధిక మంత్రులు షేర్ మార్కెట్ మీద చూపించే ఇంట్రెస్ట్ లో పది శాతం వ్యవసాయం లాంటి కడుపు నింపే వ్యవహారాల మీద చూపిస్తే... మరో గ్రీన్ రివల్యుషన్ తప్పక వస్తుంది... షేర్ మార్కెట్, ఐ.టి., విద్య, వ్యాపారం అన్నీ తిండి తింటేనే కదా చేయగలుగుతాం... ఆ తిండి సక్రమంగా తినాలంటే అది పెరిగే మార్గాల కోసం అన్వేషణ చేయాలి... ఎంత ధర పెట్టి కోనేదైన మార్కెట్ లో సరకు ఉంటేనే కదా.. అది కూడా అయిపోతే ఎన్ని మూటలు డబ్బు వున్నా ప్రయోజనం ఏమిటి? అందుకోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తే అందరికీ మంచిది... లేకపోతే తినడానికి తిండి దొరకక రెండువేల పన్నెండు ప్రపంచ ప్రళయం రాకముందే ఎవరూ మిగలరు.

మురళి.
(ఏమిటో సంధి ప్రేలాపనలు... నాకు చివరి దశ వచ్చినట్లుంది...)

13, జనవరి 2011, గురువారం

సంక్రాంతి శుభా కాంక్షలు...


Happy Bhogi... Happy Sankranthi..

4, జనవరి 2011, మంగళవారం