30, జులై 2011, శనివారం

nothing special... just going

యుకో బ్యాంకు డివిడెండ్ వచ్చింది... ఐదు వేల రూపాయల స్టాక్స్ కొంటె ఫస్ట్ క్వార్టర్ కు నూట ఏభై రూపాయలు...  
సౌత్ ఇండియన్ బ్యాంకు డివిడెండ్ కూడా వచ్చింది... ఐదు వందల రూపాయల స్టాక్స్ కొంటె పదహారు రూపాయలు... ఇది కూడా మొదటి త్రైమాసిక కాలానికి...
యుకో బ్యాంకు బాగా డౌన్ లో ఉంది... ఇన్వెస్టర్స్ కు స్టాక్స్ స్టోర్ చేసుకోవడానికి ఇదే అనువైన కాలం...
...
ఈ మధ్య నా బ్లాగ్ లో ఇంగ్లీష్ లో టైపు చేస్తోంటే ఇంగ్లీష్ మాత్రమె వచ్చింది... అందుకే టచ్ లో లేను...
...
బ్లాగ్ మిత్రులకు కాస్త తెరిపి ఇచ్చింది... ఈ కారణం వల్లనే...

...
ఇంకా ... మరోసారి...
బై...

మురళి.







16, జులై 2011, శనివారం

7, జులై 2011, గురువారం

TEJASWINI - PHOTOGRAPH




Hi!

I'm Tejaswini....
Studying UKG....

in

GEETAM FUN SCHOOL

at

Rajamahendri...

How are the photos?

Tell me...


Thanq






2, జులై 2011, శనివారం

సోరియాసిస్ ... చర్మ వ్యాధి ... రెండవ భాగం

ఇది వ్రాసిన రోజు రాత్రి మా మిత్రుడొకడు సాయంత్రం ఆఫీస్ కి రావడంతో నేను వ్రాసిన బృహత్ గ్రంథాన్ని (బ్లాగ్ గ్రంథాన్ని) చూపించాను... అయితే వాడి నుండి కాంప్లిమెంట్ ఆశించిన నా ఆశను నిరాశ చేస్తూ... పక పకా నవ్వుతూ... " ఏమిటి బాబు... సశేషం అన్నావు... నీ ఈ రియల్ సీరియల్ ఎన్ని ఎపిసోడ్ లు.. ఉంటుందేమిటి? "
అనగానే నా మొహం నల్లగా మాడిపోయింది... "ఒరేయ్... యండమూరి వీరేంద్రనాథ్ కు వారసుడు లేదని జనాలు బాధ పడాల్సిన అవసరం ఇంకా అనవసరం రా... " కామెంట్ ను కంటిన్యూ చేస్తూ అన్నాడు... యండమూరి తో పోల్చేసరికి నా మాడిన ముఖం లో అకస్మాత్తుగా తెలియని కాంతి.. "థాంక్స్ రా.. యండమూరి తో పోల్చినందుకు..." అన్నాను.
"మరి నీ సీరియల్ కు పేరేమిటి పెడదాం... '" ఆలోచిస్తూ అన్నాడు... "ఆ... మర్దన అని పెడదాం" ప్రస్నార్ధకంగా చూసిన నాకు సమాధానం ఇచ్చాడు... " కాన్సెర్ గురించి యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవల పేరు ప్రార్థన కదా... ఈ దురద పురాణం కు మనం మర్దన అని పేరు పెడదాం... " అప్పుడర్త మయ్యింది.. వాడు నన్ను పొగడ టం లేదని... యెగతాళి చేస్తున్నాడని... ఈ సారి కోపం తో నా మొహం ఎర్రగా మారింది... "బాబూ... ఊసరవెల్లి లా అన్ని రంగులు మార్చ వద్దు... చూడ లేక పోతున్నా... అయినా నీకు ఏమైనా కిటుకులు తెలిస్తే వెంటనే చెప్పాలి కానీ, ఇలా సీరియల్ ల వ్రాయడా మేమిటి..."
"ఎవరైనా తిట్టి పోయాక ముందే ... దీనికి సంబంధించిన పరిష్కారాలు ఏమైనా ఉంటె రాసేయ్... అంతే కానీ ఈ సోదంతా ఎందుకు?"
....
వాడు అన్నదాంట్లో నిజం ఉందని పించింది... కాసేపు... గోక్కొంటూ ఆలోచిస్తే...
....
అయితే మరుసటి రోజే మా టి.వి. లో ఆయుర్వేదం ప్రోగ్రాం లో ఏల్చూరి గారు వేప నూనె లో గన్నేరు ఆకులను మరగ బెట్టి... ఆ ఆయిల్ వ్రాసుకుంటే దురదలు పోతాయని సెలవిచ్చారు...
....
ఏది ఏమైనా... ముందు దీనికి నాకు తెలిసిన పరిష్కారం రాసేస్తాను... అది చాల సింపుల్...
ఏల్చూరి పరిష్కారం ఏమిటంటే... చండ్ర చెక్క, వేప బెరడు రెండూ నీటిలో ఇరవై నాలుగు గంటలు నాన పెట్టి, ఆ నీళ్ళు త్రాగాలనేది...
అయితే ఈ సోరియా సిస్ రోగ నిరోధక శక్తి తగ్గి పోవడం వల్లనూ, రక్తం మలినం కావడం వల్లనూ, వస్తుంది కాబట్టి .... నేను చేసిన పని, వేప ఆకూ, పచ్చి పసుపు, బాగా మిక్ష్ చేసి, ఒక స్పూన్ ఈ మిశ్రమం, ఒక స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి కాస్త వేడి నీటిలో (అర గ్లాస్ నీళ్ళు) వేసి, లోపలకు తీసుకుంటూ ఉండాలి... ప్రొద్దున కాస్త ధ్యానం చేస్తూ ఉండాలి... తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి... శరీరం పై వీలైతే వేప ఆకు పేస్టు పట్టించి... కాసేపు అయ్యాక స్నానం చేసెయ్యాలి..కాకపోతే క్రమం తప్పకుండ కొద్ది కాలం ఇది పాటిస్తూ ఉండాలి...
......
ఖచ్చితంగా సోరియాసిస్ తగ్గుతుంది దీని వల్ల ... ప్రయత్నించండి...

...........
మురళి.

(నిజానికి రాజమండ్రి లో నా ప్రయత్నాలు, రాద్దామని ఉన్నా, నా మూడ్ మొత్తం మార్చేసాడు.. నా మిత్ర ద్రోహి... కానీ ... ఆలోచిస్తే అనిపించింది వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండక పోలేదు అని... అందుకే మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా... డైరెక్ట్ గా మేటర్ రాసేసా.... తక్కువ ఖర్చుతో ఈ దీర్ఘ వ్యాధి తగ్గించుకొనే ఉపాయం ఇది.. బసవయ్య ఆయుర్వేద వైద్యం లాంటి నెలకు రెండు వేల రూపాయల బడ్జెట్ ... భరించలేని నాలాంటి వాళ్ళ కోసం .... మాత్రమే ఈ ఉపాయం... ఏ అలోపతి, హోమియోపతి ... ల కన్నా బెటర్, బెస్ట్.... ఈ వైద్యం... పాటించి తగ్గితే మరి కొందరికి చెప్పండి... ఉంటాను... బై... మీ మురళి)