21, ఏప్రిల్ 2013, ఆదివారం

ఖండిస్తున్నాం

ఈ మధ్య ప్రతి సెలెబ్రిటీ వాడేస్తున్న పదం ఇది.   నలుగురు కలిసి ఒక స్త్రీ ని దారుణంగా మానభంగం చేసి, రక రకాలుగా హింసకి గురి చేసి చంపేస్తే ...  ఈ రాజకీయ నాయకులు, ఈ చట్టం చేసే పని... ఖండించడం .... ఐదేళ్ళ బాలిక ని జాలి లేకుండా మగాడు మృగాడు లా మారి నలిపేస్తే వీరు చేసే పని ఖండించడం ... విచారం వ్యక్తం చేయడం ... దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ... కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ... విద్యార్థులు కొవ్వుత్తులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించడం , ఒక టెంట్ వేసేసి రెండు రోజులు రిలే నిరాహార దీక్ష చేసేయడం ... ప్రతిపక్షాలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని , అదే తమ ప్రభుత్వమైతే , న్యాయం జరిగేలా చేయగలదు కాబట్టి, ఉన్న ప్రభుత్వాన్ని దించేసి, తమని ఎంనుకోమని, ఇవన్నీ తమ మేనిఫెస్టో లో ఉన్నాయని ప్రకటించడం ....

నాలుగు రోజులు పోతే మళ్ళీ మాములె...

ఎక్కడో జన సమ్మర్థమున్న ప్రాంతాల్లో బాంబులు పేలతాయి ... చిన్న, చితక, ముసలీ ముతక గొప్ప, పేద, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఆడ, మగా, తేడా లేకుండా గుంపుల్లో జనాలు పొతారు... అప్పుడూ అంతే ...  ఖండించడం, ఖండించడం .... ఐదేళ్ళ బాలిక ని జాలి లేకుండా మగాడు మృగాడు లా మారి నలిపేస్తే వీరు చేసే పని ఖండించడం ... విచారం వ్యక్తం చేయడం ... దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ... కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ... విద్యార్థులు కొవ్వుత్తులు పట్టుకుని .... ..... (పైన ఉన్నది కాపీ .... కిందేమో పేస్ట్ చెయడమే ). విచక్షణా రహితంగా మనుషుల ప్రాణాలను బలి తీసుకొన్న వాడిని, ఉరి తీయడానికి సంవత్సరాలు పట్టింది ... కానీ, దానికి ప్రతీకారంగా మరికొంత మంది ప్రాణాలు తీయడానికి వాళ్ళు తీసుకున్న సమయం కేవలం కొన్ని రొజులు...

ఇటువంటి సంఘటనలను కేవలం .... ఖండించడం ... వగైరాల తోనే సరి పెడతారా ...

అయినా ఈ ఖండించడం ఏదో ... ఆ నేరం చేసిన వాడి ... శరీరం లో ఏదో ఒక పార్ట్ ను చెస్తె... మరోసారి ఇటువంటి వార్తలు చదవాల్సిన అవసరం ఉండదు ...

లేదా ఈ మానవ మృగాల్ని ... సారీ ... మృగాలు మరీ మనుషులంత ప్రమాద కరమైనవి కాదు కదా  ... అందుకే ఇటువంటి మగానుభావుల్ని జనాల మధ్య వదిలి పెట్టండి ... ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది ...





 

11, ఏప్రిల్ 2013, గురువారం

బ్లాగ్  మిత్రులకు,
ఉగాది శుభాకాంక్షలు 
 
లాభ నష్టాల మిశ్రమ ఫలితాలతో కొట్టు మిట్టాడు తుండే లోపు గానే, ఆంగ్ల సంవత్సరం దాటేసింది ... పుట్టిన రోజూ దాటేసింది  ఆర్ధిక సంవత్సరం కూడా మారి పోయింది  ఇప్పుడు తెలుగు సంవత్సరాది కూడా.   జీవితంలో మార్పులకూ, మారుతున్న కాలానికి సంబంధం లేకపోయినా, ఇటువంటి ప్రతి సందర్భం లోనూ , యేవో ఆలోచనలు చేసేస్తుంటాం .  యేవో కొత్త నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసేసు కుంటాం .   కానీ మనం మన మటుకు మార్చు కొవాలనెది మారుతుందో లేదో కానీ, కాలం తెచ్చే మార్పులు మాత్రం చచ్చినట్టుగా స్వాగతించ వలసిందే . 
 
అయితే  ఏ కొత్త సందర్భంలో నిర్ణయం తీసుకున్నానో గుర్తు లేదు కాని... తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కొంత శాతం పాటించాను ...  ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కానీ... నా గొప్పేమీ లేదిందులో ... అనేది మాత్రం నిజం గా నిజమ్... ఎందుకంటె కాలం కలసి రావడం కూడా ఉండాలి కదా ... 
 
ఫలితమ్... సేవింగ్స్ ఒక ముప్పై వేలు చేశాను ... (అప్పు చేసి అనుకోండి ) అదే కంటిన్యూ అవాలని కోరుకుంటా నంతే   ఈ సేవింగ్స్ ఎందుకు ఉన్నాయంటే ... ట్రేడింగ్ లో కొనటమే కానీ, అమ్మడం చేయలేదు కాబట్టి 
 
ఇంకా ఒక ప్రయోగం అనుకున్నది జరగాలంటే ఈ డబ్బు చాలదు ... 
 
చూద్దాం ....  అయిన, అవకున్నా ....  ఆశించడంలో  తప్పు లేదు కదా  ... 
 
మురళి