27, అక్టోబర్ 2009, మంగళవారం

కార్తీకం

కార్తిక మాసం అంటే గుర్తు వచ్చేది మా ఉరు. నిజానికి ఎవరికైనా పండగ అనగానే గుర్తు వచ్చేది వారి వారి సొంత వూరిలో గడిపిన బాల్యం... ఎందుకంటె పండగలను ఎంజాయ్ చేసేది బాల్యం లోనే. పార్వతీపురం మా వూరు. అక్కడ నుండి ప్రతి కార్తిక మాసం లో సోమవారానికి అడ్డపుసిల వెళుతూ ఉండేవాళ్ళం. కొండ గుహలో శివుని గుడి. ఐతే పిల్లలం ఎప్పుడూ గుడి లోకి వెళ్ళిన పాపానికి పోలేదు... ఎంతసేపూ కొండపైకి ఎక్కడం గురించే ఆలోచన... వన భోజనాలకి ఎక్కువగా ప్రెఫెర్ చేసేది ఆ ఏరియానే. అదే కాకుండా ఒక్కో వారం ఒక్కో ప్లేస్ కు. ఇటు సివిని అనే వూరు... అటు తోటపల్లి. ఇంకా మరి కొన్ని ఏరియాలు.. దీపావళి దాటగానే వచ్చే ది కార్తిక మాసమే కాబట్టి ఆ టపా కాయల సందడి ఈ మాసమంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది... సిటి ల లోకి వచ్చాక వనభోజనాలు వివిధ రూపాలను సంతరించు కోవడం చూస్తె మొదట్లో ఆశ్చర్యం అనిపించినా ఇప్పుడు అలవాటై పోయింది... స్కూల్ పిల్లల , కాలేజి స్టూడెంట్ల , ఉద్యోగస్తుల గ్రూప్ లు సరే.. కాని కమ్మ వనభోజనాలు, వైశ్య వనభోజనాలు, ఇలా కులాల గ్రూప్ ను చూస్తేనే ఆశ్చర్యం... అయినా ఏదో ఒక రూపం లో ఒక మనిషి తో మరో మనిషి సత్సంబంధాలను కలిగి ఉండటంరొటీన్ లైఫ్ కు బిజీ లైఫ్ కు, యాంత్రిక జీవితాలకు కాస్తంత వూరట... అంతే కాకుండా ఈ మాసం లో వాతావరణం బాగుంటుంది కూడా.. ఇటువంటి వాతావరణం ఉన్నపుడు ప్రకృతి లో మమేకమవడం కన్నా ఆనందం ఏముంటుంది? ఈ ఆనందం ఏ పబ్బ్ లలో లభిస్తుంది?

ఇన్ని కబుర్లు చెప్పక కొసమెరుపు ఏమిటో తెలుసా? గోదావరి ప్రక్కనే ఉన్నా , ఇంతవరకూ ఏ ప్రకృతి తో మమేకమాయే కార్యక్రం లోనూ పాలుపంచుకోలేదు... ప్రొద్దున్నే ప్రకృతి పిలుపు నందుకొని రొటీన్ లోకి ప్రవేశించడం తప్ప...

బై,

మురళి.

25, అక్టోబర్ 2009, ఆదివారం

హనుమాన్ తధ బై తేజస్విని...

హనుమ నిద్ర లేచే సరికి బాదా (బాగా అని అర్థం) ఆతలి వేసింది.. (ఆకలి వేసింది).. "అమ్మా.. ఆతలి.. తాయిలం పెట్టు.." అప్పుడు సూరయ్య తనిపించి... పండు అనుకోని.. "ఏది పండు... తినేస్తా... ఆ ! అదిదో... ఎదిరిపోయింది... "అరె... ఎత్తడికి ఎదురు తున్నాడు... అమ్మో సూరయ్య దద్దరికే.." (వాయుదేవుని మాటలని అర్థం చేసుకోవాలి...). "అరోరా.. ఎవరది... ఇటువైపు వస్తున్నాడు..." "పేబు.. తమ వేడితి మాది పోత్తడు.." అరోరా.. రాతాన్ని ఆపు.." "మనమాగినా వాడేదేలా లేడు" "ఏది పండు... " "అహ్హహ్హా... సూరయ్యా! రెచ్చిపోతు... ఈ రాహువు నిన్ను మిందే వేళయింది... నీ వెలుదునుచీతటి చేత్తా... " "పండు పోయి పుచ్చతాయ... డాం...డాం... డాం" (చేతితో హనుమలా రాహువు తలను పట్టుకున్నట్టు... రాహువు పిడికిలి మధ్య నుంచి తప్పించుకున్నట్టు నటించుట జరుగును) "ఇంద్రా.. నన్ను తాపాడు... నేను సురయ్యను మిందదోతే వాడు నన్నే మిందేలా ఉన్నాడు.." "ఎవడు... వాడు.." "అడివీద బయంతడుడు.. వాడు నీతే పెమాదం" "నాతా?" "అహ్హహ్హా... వీడా... ఈ పసిపాపడా... " "ప్రేభూ... వాడు... చిచ్చర పిదుదు" (ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగించుట... హనుమ పది పోవుట... సారి... పడిపోవుట ) "ఆ... ఆ... అమ్మా..." (వాయుదేముని ప్రవేశము).. "ఆ... వాయు పుత్రు ... తరువా.." (అంటే వాయు పుత్రునికి ఊపిరి కరువా.. అని అర్థం ) " ..( కొద్దిగా అర్థం కాని కథ నడిచాక... బ్రహ్మ రావడం.. హనుమను బతికించడం... అన్నీ అయిపోయినట్టే... భావించవలెను...) అప్పుడు.. హనుమ వాళ్ళమ్మ దగ్గరకు పోయి..." అడ డం పద డం... టెన్ టెన్ డం..." (పాట...) ... తధ బాదుందా... "
(ఇది ఎవరికయినా అర్థం కానిచో ... తప్పు నాది కాదు...)
బాయ్...
మురళి.

19, అక్టోబర్ 2009, సోమవారం

రిలయన్స్ మ్యుతువల్ ఫండ్ (నాచురల్ రిసోర్సెస్) రేట్ పెరిగిందోచ్...

మొత్తానికి నేను కొన్న రిలయన్స్ నాచురల్ రిసోర్సెస్ ఫండ్ రేట్ రెండు సంవత్సరాల తరువాత కొన్న ధరకు చేరింది... అప్పుడు యూనిట్ విలువ (పది రూపాయలు) షేర్ మార్కెట్ పడిపోయాక ఐదు రూపాయలకు కూడా తగ్గి పోయింది... ఇప్పటికి కనీసం ఆ పది రూపాయల విలువకు చేరింది... మరో ప్రక్క బ్యాంకు లలో వడ్డీ రేట్ లు తగ్గి పోతున్నాయి... (పోస్ట్ ఆఫీసు కూడా తగ్గాయా?) ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న మార్కెట్ వల్ల ఐదు సంవత్సరాల సమయానికి ఈ రిలయన్స్ ఫండ్ రేట్ కనీసం బ్యాంకు వడ్డీ రేట్ కన్నా ఎక్కువ గా పెరిగితే లాభదాయకం ... లేక పోతే ... మళ్ళీ కూలిపోతే... అంతే సంగతులు... చూద్దాం...

మురళి.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !!!

13, అక్టోబర్ 2009, మంగళవారం

చాల రోజులుగా అనుకుంటూ ఉన్నాను... ఏదో ఒక సినిమా రివ్యూ వ్రాసి నాలో ప్రేక్షకుణ్ణి సంతృప్తి పరచాలని... ఇంట్లో డైరీ లో వ్రాసుకున్నాను ... కాని బ్లాగ్ లో ఇంగ్లీష్ అక్షరాలని కూడా బలుకుకొని తెలుగు లో వ్రాయాలంటే, వ్రాయాలనుకున్నది కాకుండా. వేరేది వ్రాయడమో, లేదా, వ్రాయాలనుకున్నది మరిచి పోవడమో జరుగుతున్నది... కొన్ని బ్లాగ్ లను చూస్తుంటే... అనిపిస్తుంది ... ఎంత బాగా వ్రాస్తున్నారా అని... అలా నేను వ్రాయాలని అనుకుంటూ ఉంటాను... మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది... సినిమా రివ్యూ అని స్టార్ట్ చేసి, ఏదేదో వ్రాస్తున్నాను..

నేను ఈ రోజు "మగధీర" చూశాను... కాని ప్రస్తుతం ఆ పిక్చర్ గురించి వ్రాసే ఉద్దేశ్యం లేదు.. ఆ పిక్చర్ గురించి చెప్పాలంటే మాత్రం ఒకటే చెప్పొచ్చు... ఆ సినిమా లో హీరో, హీరోయిన్, విలన్, కథ, కథనం, అన్నీ వేర్వేరుగా లేవు... అన్నీ ఒకే రూపంలో ఉన్నాయి... ఆ రూపమే ఆ చిత్ర రూపశిల్పి "రాజమౌళి". ఎస్... ఈ సినిమా కి నిజమైన హీరో దర్శకుడే, ... నిజానికి ఏ చిత్రానికైన దర్శకుడే నిర్దేశకుడు... కాని ఈ సినిమా లో మాత్రం అడుగడుగునా దర్శకుని ప్రతిభ కనిపిస్తుంది... దర్శకుడే కనిపిస్తూ ఉంటాడు.. ఏమిటిది... ? ఈ పిక్చర్ గురించి వ్రాయకూడదని కదా అనుకుంది... అయినా వ్రాసేస్తున్నాను... స్థిరత్వం లేదు నాకు... సరే... ఇప్పుడు కాదు కానీ, మరోసారి రివ్యూ వ్రాస్తాను... అదీ నాకు బాగా ఇష్టపడిన సినిమా "కిక్" గురించి...

...మురళి

12, అక్టోబర్ 2009, సోమవారం

టాంత్ లాల ... బై తేజస్విని...

ఇది మొన్న ఆదివారం నాటి సంగతి. ఆ రోజు మా తెజును తీసుకొని పుష్కర్ ఘాట్ కి వెళ్లి, గట్టు వెంబడి పి.వి.ఆర్. పార్క్ వైపు వెళుతున్నాను. అక్కడ వాటర్ ట్యాంక్ లారీలు వరసగా ఉంటాయి. కొన్ని టాంకర్లు ట్రాక్టర్స్ కు అట్టాచ్ చేయబడి ఉంటాయి కదా.. ఐతే అక్కడ ట్రాక్టర్స్ కు అట్టాచ్ కాకుండా కేవలం టాంకర్లు మాత్రమె ఉన్నాయి. మా పాప లారి టాంకర్ లను చూపించి "టాంత్ లాల" అంటుంది.. (వీధిల్లో కుళాయిలు రానప్పుడు వాటర్ టాంకర్లు రావడంజనాలు వాటి వెనక బిందెలు పట్టుకుని పరిగెట్టడం చూసింది లెండి...) ఐతే ట్రాక్టర్ అట్టాచ్ చేయని టాంకర్ లను ఏమనాలో తెలియలేదు... కాని ఆ విషయం నాకు చెప్పాలి... కాసేపు ఆలోచించి చెప్పింది "అత్తడ (అంటే అక్కడ అని అర్థం చేసుకోగలరు) ముతం లేని (మొహం మీద బుల్లి చేతులు పెట్టి చూపిస్తూ) టాంత్ లాల (ముందే చెప్పాను కదా... తనకు "క" పలకదు... అందుకు బదులుగా "త" అంటుంది) ఉంది.." కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు... అర్థం అయ్యాక ఆశ్చర్యం అనిపించింది... మనసులో ఉద్దేశ్యాన్ని బయటకు చెప్పడానికి అదీ మనకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ఆలోచించి, ఇంజన్ లేని వాహనం గురించి చెప్పడానికి తను ఉపయోగించిన ఉదాహరణ... ఇలాంటప్పుడే అనిపిస్తుంది "వీళ్ళు పిల్లలా...పిడుగులా" అని. అందుకే ఐదు సంవత్సరాల వరకూ స్కూల్ వైపుకి వెళ్ళని కాలం పోయి మూడు సంవత్సరాలకే స్కూల్ కి పోయే కాలం వచ్చింది... అంతేనా... సిలబస్ లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు... (వాటితో పాటు ఫీజు లు కూడా)... మళ్ళీ మరోసారి...
మురళి.

6, అక్టోబర్ 2009, మంగళవారం

విలయం...


ఈ నెలాఖరు ఇంకా అర్థ సంవత్సరపు ముగింపు లెక్కల పనిలో కొద్దిగా బిజి గా ఉన్నాను... నిజానికి ఈ వరదల తాకిడికి కకావికాలైన జన జీవనం, ఊళ్ళన్నీ నీళ్ళ పాలైన వైనం.. చూస్తుంటే ఎటువంటి వారికైనా ఉసూరు అనిపించక మానదు.. క్రిష్ణమ్మకూ, తుంగభద్రమ్మకూ ఎందుకంత కోపం వచ్చిందో కాని, ఆ ఆగ్రహాన్ని తట్టుకొనే విషయంలో ఇంత అభివృద్ది సాధించాం, అంత అభివృద్ది సాధించాం, అని చెప్పుకొనే మానవులు ప్రకృతి ముందు మిగిలిన జీవరాశి తో సమానంగా సరిగ్గా చెప్పాలంటే అంతకంటే దారుణంగా నష్ట పోయారు... ఇటువంటి పరిస్తితులలో ప్రకృతి, మనిషి, అంటూ కబుర్లు చెప్పడం ఎందుకంటారా? ఒక వైపు వరదల భీభత్సానికి కోట్లాది విలువైన ఆస్తులు నాశనమైపోతుంటే, ఇదే అదనుగా స్వైర విహారం చేస్తూన్న దోపిడీ దొంగలు, ఒకరి మీద ఒకరు బురద చల్లుకొనే ప్రయత్నాలు, మరో పక్క దొరికిందే తడవుగా దోచుకుందాం అని ధరలు పెంచి లాభ పడదామనుకునే వ్యాపారస్తులు, చందాల రూపం లో వసూలు చేసి, అందులో ఎంతో కొంత బాధితులకిచ్చిమిగిలింది నోక్కేద్దమను కొనే సంకుచిత స్వభావులు, పది రూపాయల ఆహారపు పొట్లాలు కట్టించి, వంద రూపాయల బిల్లులు సృష్టించి శవాల మీద డబ్బులు ఏరుకొనే వారిలా, అంతకంటే దారుణంగా దోచుకుందామని సిద్ధపడే ప్రభుత్వ అధికారులు... ఇంత ప్రళయం వచ్చి మానవ జాతి ఒక పక్క నాశనం అవుతుంటే, మరోప్రక్క దీనినుంచి ఎలా లాభ పడవచ్చో ఆలోచించే, ... మా నవ జాతి... దేవుడా... ఇంకేం చెప్పను?

సరే... నేను మాత్రం చేస్తున్నదేమిటి కాని... ఈ సెప్టెంబర్ జీతంలో ఒక రోజు జీతాన్ని (మా స్టాఫ్ అందరితో పాటు) విరాళంగా ఇస్తున్నా... నయం .... ఈ గోదావరి పొంగిందంటే నేను కూడా పరుగులేత్తాలి... అది ఎప్పుడో ఒకప్పుడు తప్పనిదని తెలుసు... కాని దూరంగా పోలేము కదా...

బాయ్...

మురళి.

1, అక్టోబర్ 2009, గురువారం

మూడో రోజు... రెండో భాగం

పూర్తిగా వ్రాయకుండానే ... కదిలేశాను... గాంధి జయంతి అని మా వాళ్లంతా విగ్రహానికి దండలేస్తున్నాం వచ్చి మీరూ పాల్గొనండి.. అనే మెసేజ్ రావడం వల్ల... మధ్యలో ఆపేశాను... సరే... ఎంతవరకూ వచ్చాను?
ఆ తెల్ల బట్టల నర్సు నా పాపను ... పండులా మంచి రంగులో ఉన్నా నా పాపను... బొమ్మను తీసుకు పోతున్నట్లు తీసుకుపోవడం... మేమంతా వెనుకే పరుగులెత్తడం... లోపల ఒక ట్రే లో వేశారు... మేము దూరం నుండి చూస్తున్నాం.. డాక్టర్ శుభ్రం చేస్తున్నాడు... లోపలికి రమ్మనగానే వెళ్లి చూశాం.. ఆ ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు తెలీదు... కవి, రచయిత లాంటి లక్షణాలు ఏమి లేవు నాలో... ఏడవనైనా ఏడవకుండా.. పక్కనే వ్రేలాడు తున్న బ్లూ కలర్ క్లోత్ ను పరిశీలిస్తూ ... నా బిడ్డ... నర్సింగ్ హోం రూం లోకి తీసుకు రాగానే పరిసరాలను గమనించ సాగింది... పాలిస్తున్న అమ్మ ముఖం తదేకంగా చూస్తోంది.. ఈమేనా నాకు ఫుడ్ పెట్టేది అని ఆలోచిస్తూ చూస్తున్నట్లుగా అనిపించింది.. వినాయకుణ్ణి పూజిస్తే సరిగ్గా వినాయక చవితి సమయం లోనే పుట్టింది... మరి జన్మ నక్షత్రం ప్రకారం త తో పేరు పెట్టాలని "తేజస్విని" అని నిర్ణయించాం... హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇంటిని పరిశీలించడం... పలకరించే మనుషుల్ని మైండ్ లో రికార్డు చేసుకోవడాని కి అన్నట్లు తదేకంగా కళ్ళల్లో కళ్లు పెట్టి చూడటం... ఇక నాకు తనే ప్రపంచం గా మారింది.. కానీ తను పుట్టిన రెండో నెల లోనే రెండు నెలలు ఆఫీసు పని మీద "మిజోరం" పోవలసి వచ్చింది... ఎక్కడ హైదరాబాద్... ఎక్కడ మిజోరం? అప్పుడే డిసైడ్ అయ్యాను నేను... నా పాప తో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే హైదరాబాద్ లో జరగదని... ఎందుకంటె సిటీ బస్ లో రెండేసి గంటలు ప్రయాణం ప్రొద్దున... సాయంత్రం... ఇలా ఎన్ని రోజులు...? అందుకే ఆఫీసు నుండి ఎక్కువ దూరం లేకుండా... ఇల్లు తీసుకోవాలని... హైదరాబాద్ లో అది కుదర లేదు.. అందుకే వదిలేశాను హైదరాబాద్ ను... ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా వినలేదు.. ముఖ్యం గా నా భార్య తల్లి, అక్కలు బావలు, అన్నదమ్ములు అందరూ ఉండే హైదరాబాద్ వదలడానికి నా భార్య ఒప్పుకోక పోయినా పట్టించుకోలేదు... ఉద్యోగ భద్రత గురించి కూడా ఆలోచించలేదు.. ఒకటే ఆలోచన... ఏం... బ్రతకలేనా? హైదరాబాద్ లో తప్ప ఇంక ఎక్కడైనా? చేయలేనా ఏ ఉద్యోగమైనా... అని.. లక్కీగా రాజమండ్రి లో నా తో కాకినాడ లో హోటల్ జయ లో జాబు చేసిన నా ఫ్రెండ్ రాజమండ్రి లో క్రొత్తగా ఓపెన్ అయిన "రివర్ బె" రేసోర్త్స్ లో జాబు ఉంది... అన్నాడు... ఆ ఛాన్స్ ను వదులుకో దలచు కోలేదు.. అందుకే రాజమండ్రి వచ్చేసా... కాని హైదరాబాద్ లో నా భార్య, వారి కుటుంబం వాళ్ల మూర్ఖత్వం వల్ల చేసిన అప్పులు ఉన్నాయ్... లక్షన్నర దాక... అవి తీరాలి... నా పాపకు మంచి భవిష్యత్ ఇవ్వాలి... రెండు సంవత్సారాలు పూర్తి అయ్యాయి పాపకి... తనకి "క" పలకదు... బదులుగా "త" అంటుంది... ఆ ముద్దు మాటలు, అల్లరి చేష్టలు చూస్తుంటే అనిపిస్తుంది... జీవితం లో ఇటువంటి రక రకాల అనుభవాలు... ఆనంద కరమైన క్షణాలు... ఉండబట్టే ఈ మాత్రం జీవించ గలుగుతున్నమ అని... లేక పోతే ఈ జీవితం ఎప్పుడో బోర్ కొట్టేసేది... కదూ... ఏంటో... న సోది తో మీకు బోర్ కొట్టేసి ఉంటాను... ఎంతో వ్రాయాలని... అనుకున్నాను.. ఏదో వ్రాయాలని అనుకున్నాను... ఏదేదో వ్రాశాను... ఈ రోజుకి ఇంతే...
నిజాని కి పాపా ముచ్చట్లు ఆ షార్ప్ నెస్.. ఆ అల్లరి... అన్నీ వ్రాస్తుండటమే పనిగా పెట్టుకోవలనుకున్నాను... కాని ఏదో డైరీ లో పేజీల్లో వ్రాయాల్సిన సోది ఈ బ్లాగ్ లో వ్రాస్తున్నాను... తిట్టుకోకండి... ప్లీజ్...
మురళి.

తేజస్విని ముచ్చట్లు - మూడో రోజు

ఇంతకు ముందే చెప్పను కదా... ఎదురుగా ఉన్న గుడిలో విఘ్నేశ్వరుని విగ్రహం కళ్ళల్లో కళ్లు పెట్టి కోరుకొన్నాను అని... అలా నా మనసుని హిప్నో టైజ్ చేసుకున్నానని.. మరి దేని ఫలితమో తెలీదు... మూడు నెలల లోపే తీపి కబురు ... మనసులో అనుమానాలు... ఆ నెలలో కేవలం మూడు సార్లు (కాలెండరు ప్రకారం అని చెప్పను కదా) కలిశాను ... అయినా ఫలితం... వచ్చింది... సగటు మగాడికి వచ్చిన అనుమానం కూడా నా మనసుకు వచ్చింది అనుకోండి... తరువాత ... తరువాత ఆ అనుమానం దూరం అయ్యింది... మొత్తాని కి డాక్టర్ ఇచ్చిన డేట్ సెప్టెంబర్ ఇరవై.. దగ్గర... ఇంతలో వినాయక చవితి దగ్గర కొచ్చింది... డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న టైం లో అప్పే అయినా అందింది... సరిగ్గా సెప్టెంబర్ పదకొండు ఉదయం పరుగులు... ఆ డాక్టర్ అమావాస్య అని ఆపరేషన్ చేయడాని కి కూడా వేనుకాడింది... అమావాస్య దాటిన తరువాత రాత్రి తొమ్మిది గంటల ముప్పై అఆరు నిమిషాలకు ... నా సంసారం లోకి కొత్త ప్రాణి.. అంతా బాబే పుడతారన్నారు... కాని పాప... ఎవరైతే ఏమి...
మళ్ళీ.. వ్రాస్తాను...
మురళి...