16, నవంబర్ 2012, శుక్రవారం

ఇన్సురెన్స్

బ్లాగ్ మిత్రులకు నమస్కారం.. చాలా కాలానికి బ్లాగ్ లోకి రావడం.. జస్ట్ జాబ్ టెన్షన్స్..  ఖాళీ లేదు.. అయినా నా ఇన్సురెన్స్ పొలసి అనుభవం గురించి రాయాలని తాపత్రయం బ్లాగ్ లోకి రావడానికి ప్రేరేపించింది...  ఇంతకు ముందే నేను రాసి వుంటాను... నేను తీసుకున్న యూనిట్ లింక్డ్ పాలసీ గురించి... ఐ సి ఐ సి ఐ వారి ఒక యూనిట్ లింక్డ్ పాలసీ ని నాకు అంట గట్టాడు ఇండియన్ ఇన్ఫో లైన్ వాడు... సంవత్సరానికి పద్దెనిమిది వేలు కడితే పది సంవత్సరాల తరువాత నుండి సంవత్సరానికి 10 % చొప్పున అమౌంట్ ఇస్తారని... పాలసీ కట్టిన మూడు సంవత్సరాల తరువాత లోన్ ఇస్తారని..  100 % అమౌంట్ కు యూనిట్స్ allot  చేస్తారని...ఇలా నాలుగైదు చెప్పాడు...  నా దగ్గర ప్రస్తుతం అంత సొమ్ము లేదు మొర్రో అన్నా వినకుండా కనీసం తొమ్మిది వేలు కట్టండి .. మిగిలినది నెల రోజుల లోపు కట్టండి.. అనగానే సరే...  అప్పుడప్పుడే ఈ లోకం చూస్తున్న నా తేజస్విని కోసమని తీసుకున్నా పాలసీ ని..   15 సంవత్సరాల కి.  మరి ఇబ్బంది ఏమిటి?  వివరంగా...

1. sum assured ... కేవలం 1,35,000.00 (అంటే నేను 15 సంవత్సాలకు కట్టేది రూ.2,70,000.00 కానీ, నాకేమైనా అయితే నా వాళ్లకి వచ్చేది సగమే.) అంతేనా... ఇందులో నా understanding లో తేడా ఉందా?
2. పొరపాటున ఒక premium ఒక్క రోజు దాటినా, ఆ premium తో పాటు next premium కూడా కట్టించు కోవడం దీనిలో మరో ప్రత్యేకత...
3. మూడు సవత్సరాల తరువాత లోన్ ఇస్తారని ముఖ్యంగా నేను దీనిని కట్టడం చేసాను... కానీ, దీంట్లో ఎటువంటి లోన్ కూడా లభించదు... అని మూడేళ్ళ తరువాత చెప్పారు.
4. పదేళ్ళు వరసగా amount పే చేసినా, ఎటువంటి మనీ బ్యాక్ పద్ధతి దీంట్లో లేదు.
5. అన్నింటికీ మించి దాదాపు కట్టిన సొమ్ములో సగం fund allocation charges పేరుతో తీసేసు కుంటారు. మరి 100% యూనిట్ allotment కి అర్థం ఏమిటో...
6. ఈ లెక్కన నన్ను పీడించి రూ.72000.00 కట్టించుకున్నారు...  నేను పాలసీ తీసుకునే సమయానికి యూనిట్ వేల్యూ రూ.12.00 ఇప్పుడు రూ.18.00 ... అయినా నేను కట్టిన 72000 విలువ రూ.57000.00 మాత్రం.
7. ఒకవేళ surrender చేస్తే... నాకు వచ్చేది రూ.34,500 మాత్రం...

మరి ఇప్పుడు నేనేం చేయాలి... కంటిన్యూ  చేయాలా? లేదా ఆపేసి 15 సంవత్సరాల తరువాత వచ్చే సొమ్ము కోసం వెయిట్ చెయాల? లేక సరెండర్ చెయాల?

కనుక మిత్రులారా... పాలసీ కట్టేటప్పుడు జాగ్రత్త...

bye

మీ మురళి.