బ్లాగ్ మిత్రులకు
సంక్రాంతి శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ....
మన దేశం లోనూ, రాష్ట్రం లోనూ, పరిస్తితులను చూస్తూ ఉంటె అనిపిస్తుంది నాకు... రాను రానూ, ఈ శుభాకాంక్షలు కూడా కరువైపోయే పరిస్తితి వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది...
ఆడవాళ్ళ మాన ప్రాణాలకు విలువ లేదు... ఏ నేరానికి ఎటువంటి శిక్ష వేయాలో ఎప్పుడూ చర్చలకే పరిమితం చేస్తారు... రూపాయికి కిలో బియ్యం అని ఒక పది కె.జి. లు ఇచ్చి, బయట మార్కెట్ లో కిలో ముప్పై ఇదు దాటినా పట్టిచుకోని పాలకులు... పొయ్యి పైన మాత్రమె కరువు చేసేస్తే ఎలాగో ఒకలా బ్రతికేస్తారని భయం తో , పొయ్యి కింద కూడా కరువు చేసేస్తున్నారు... ఒక ఫ్యాన్ క్రింద డజను మంది నిద్ర పోవాలనే సూత్రం అమలు చేసే ఉద్దేశ్యంతో కరంట్ చార్జ్ లు పెంచేస్తారు... అద్దె కొంపల్లో అద్దె లు పెంచేస్తున్నారు... చేస్తున్న కొలువులో మాత్రం ప్రభుత్వ విధానాల వల్ల జీతాలు పెంచలేక, ఎప్పుడు మూసేసి కుర్చున్దామా అని ఆలోచిస్తున్నాయి యాజమాన్యాలు.
నిన్న ఒక ధర... ఈరోజు ఒక ధర... రోజు రోజుకూ, పెరిగిపోతూ సామాన్యుడు బ్రతకడం జరగకూడదనే సూత్రం అమలు చేస్తున్నారు... ఈ ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించకుండా, పెదలనే నిర్మూలిన్చేస్తున్నారు.. మధ్య తరగతి వాడి పరిస్తితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది...
ఇదంతా ఒకవైపు... మరోవైపు సౌకర్యాలు పెరిగిపోతున్నై... 5 స్టార్ హోటల్స్ నిండి పోతున్నై... పబ్బులు కిట కిట లాది పోతున్నై... multiflex theatres కూడా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి... ఫ్లాట్లూ, ప్లాట్ లూ. హాట్ కేకు ల్లా అమ్ముడుపోతున్నై... ట్రైన్స్ లో ఫస్ట్ క్లాసు ఎ.సి. బోగీలు కూడా ఖాలీ ఉండడం లేదు... ఎ.సి. స్లీపర్ బస్సు ల లో, రూ.2000.00 చొప్పున టికెట్స్ అమ్ముతున్నా, కొనేసి ప్రయాణాలు చేసేస్తున్నారు... plane కూడా ఫుల్ ... బ్యాంక్స్ లో మూలుగు తున్న డబ్బు, విదేశీ బ్యాంక్స్ లో పది ఏడుస్తున్న డబ్బు, మిలియనీర్లు, బిలియనీర్లు...
ఒక ప్రక్క ఆకస హర్మ్యాలు... మరోపక్క పూరి గుడిసెలు... ఒక పక్క తిన్నది అరక్క డైటింగ్ లూ , బరువు తగ్గడానికి ఆపసోపాలు... మరోపక్క వీపుకు అంటుకుంటున్న పొట్ట లతో, ఈ ప్రపంచంలో పుట్టిన పాపానికి చచ్చే వరకు చచ్చినట్టుగా బతుకు ఈడుస్తున్న ఎవరికీ పట్టని ప్రాణాలు...
మరి మనం ఎలా తయారవుదాం... ఎలా తయారవుతాం... నా చదువుకి నెలకు ముప్పై రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు మా అమ్మ... మరి నా బిడ్డ కోసం మాత్రం నేను నెలకు మూడు వేలు ఖర్చు పెడుతున్నాను... అంటే నా ముందు తరానికీ, నా తరానికీ తేడా ఏమిటి, ఇంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తున్నందుకు బాధ ;పడాలా? లేక ఇంత డబ్బు ఖర్చు పెట్ట గలుగుతున్నందుకు నా ఆర్ధిక పరిస్తితి బాగుందని భావించాలా?
...............
ఎవడ్రా వీడు? పండగ మూడ్ అంతా చెడగోట్టేసాడు .... అనుకుంటున్నారు కదూ... సారీ.. ... ఇక వుంటాను...
మురళి