31, జనవరి 2014, శుక్రవారం

ఏమియునూ లేదు ...

 జనవరి ఒకటో తేదిన మొక్కుబడిగా "ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు " బ్లాగ్ మిత్రులకు తెలిపిన నేను ఈ మధ్య చాల ముఖ్యమైన సందర్భాలలో కూడా బ్లాగ్ ను సందర్శించ కుండా ఉండ దానికి కారణం ఏమిటి ?
 
ప్రత్యెక కారణ మేమీ లేదు ... జస్ట్ బద్ధకం అంతే ... అందులోకి ఈ పేస్ బుక్ లో అయితే like ఇంకా కావాలంటే share ... ఇలా నొక్కేసి తరువాత బయటకు వచ్చేయ వచ్చు ... మరి బ్లాగ్ లో అయితే టైపు చేయాలి కదా ... అదీ ఇంగ్లీష్ లో టైపు చేయాలి ... ఈ ఆపిల్ లిపి లో ఏమైనా టైపు చేసే ఆప్షన్ ఉంటె ఎవరైనా  చెప్పి పుణ్యం కట్టుకొందురూ ... 
 
టైపు మెషిన్ మీద టైపు చేసినపుడు ఒక రకంగా , డి టీ పి  నెర్చుకున్నపుదు ఆపిల్ లిపి ... ఇప్పుడు బ్లాగ్ లో టైపు చేయాల్సి వచ్చినప్పుడు ఒక లాగ ... నా తెలుగు భాష ఇంగ్లీష్ పై ఇంతగా ఆధార పడితే ... ఇలా ఎంత కాలం ?  ఏమైనా ప్రత్యామ్నాయాలు వచ్చి ఉంటె కాస్త ఎవరైనా తెలియపరచండి ... 
 
చక్కటి కుర్రాడు ... కారణాలు చిన్నవా పెద్దవా , కారకులు ఇంట్లో వారా బయటి వారా అనేది వేరే విషయం ... అనవరసంగా ఆత్మ హత్య చేసుకుని చచ్చి పోయాడు ... అప్పుడూ నా అభిప్రాయాల్ని పంచుకునెదుకు బ్లాగ్ లో ఏదో ఒకటి రాయాలి కదా ... అదీ లేదు ... ఒకటి ఏమిటంటే ఏమి రాయాలో కూడా అర్థం కాలేదు ... ఫుట్ పాత్ ల మీద సంసారాలు చేస్తూ బతికేస్తున్నారు చాల మంది ...  దారుణమైన పరిస్తితులా అతనివి ? 
 
సంక్రాతి వచ్చింది ... వెళ్ళింది ... అందరూ సంబరాల కోసం సొంత ఊర్లు పోయారు ... నేను మాత్రం ఆఫీసు కె అంకితమై పోయాను ... అందుకీ శుభాకాంక్షలు కూడా తెలుప లేదు ... 
 
అక్కినేని శకం ముగిసింది ... ఇంకా పాత వారిలో సత్యనారాయణ ఉన్నారనుకుంటా ... శ్రీహరి , ధర్మవరపు సుబ్రహ్మణ్యం , ఏ వి యస్  ... అంజలి దేవి, ఇలా ఒకరొకరుగా తెలుగు తారలు రాలిపోతున్నాయి ... సుధాకర్ కోమాలోనే ఉన్నారంట ... 
 
అసెంబ్లీ లో తెలంగాణా బిల్లు ను ఏమీ కాకుండా చేసారు ... అంటే తెలుగు వాళ్ళని విడదీయడానికి జరుగుతున్నా ప్రయత్నాలను కాస్త వాయిదా వేయించారు ... నాకు తెలిసి ... తెలంగాణా వాళ్ళు మానసికంగా ఎపుడో విదిపొయమనె అనుకుంటున్నారు ... సీమన్ధ్ర వాళ్ళు విడిపోవడం జరగదనే నమ్ముతున్నారు ... జనాలు ఎంతసేపు ఏమవుతుందా అని ఆత్రుతగా చూస్తున్నారు ...  ఎంత ఆత్రుతగా అంటే ... రక రకాలుగా దోపిడీకి గురవుతున్నా , రోడ్ల మీద నూతులు తయారై , ప్రమాదలవుతున్నా , చార్జీలు పెంచేసి బస్సులు , టాక్స్ లు వేసి ప్రభుత్వం ఇష్టానుసారంగా నడ్డి విరగ గొడుతున్నా అవాసాలు సమస్యలే కానట్టు , తెలంగాణా సమైఖ్యాంధ్ర మాత్రమె సమస్య ఐనట్టు ... 
 
ఇంకా ఏమి మరిచి పోయాను ? ఆ ... షేర్ మార్కెట్ ... మొన్న బ్యాంకు అఫ్ ఇండియా షేర్ కి ఐదు రూపాయల చొప్పున డివిడెండ్ , ఈ రోజు uco బ్యాంకు రెండు రూపాయల చొప్పున డివిడెండ్ ఇచ్చాయి .. ఆంధ్ర బ్యాంకు కూడా ఒక రూపాయి చొప్పున డివిడెండ్ ప్రకటించింది ... నేనేమో ఒక లక్ష రూపాయల వరకూ షేర్ ల లో పెట్టి ఎప్పుడు అమ్ముదామ అని ఎదురు చూస్తున్నాను ... 
 
కొత్త సంవత్సరం ... పాత బడి పోయింది ... 2014 కు రెండో నెల వచ్చేస్తుంది .... 
 
ఇంకా ... మా తేజస్విని అలవాటు ప్రకారం రక రకాల ప్రశ్నలతో మా ప్రాణం తీస్తుంది ... february month లో స్కూల్ లో డాన్సు ప్రోగ్రాం కు ప్రాక్టీసు చేసుకుంటోంది ... 
 
ఇంకా ... ఇంతే ...
 
మురళి 
 
 
 
 

1, జనవరి 2014, బుధవారం

బ్లాగ్ మిత్రులందరికీ నా తరపున , మా తేజస్విని తరపున 

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు 

మురళి