17, మే 2014, శనివారం

విజ్ఞత అందించిన విజయం

ఇది తెలుగు దేశం విజయమో, బి జె పి  విజయమో కాదు ... విజ్ఞత ప్రదర్శించి సరి అయిన సమయం లో సరి ఐన రీతిలో స్పందించిన తెలుగు ఓటర్ల విజయం ... ప్రస్తుత పరిస్తితుల్లో తమ గాయాలకు తగిన చికిత్స చేయగల నాయకుదేవరో ప్రజలకు తెలుసు ... అందుకే కసిగా , ఖచ్చితంగా , ఖరా ఖండిగా తమ అభిప్రాయాన్ని , తమ తీర్పునూ తెలియ జేసారు ...


జగన్ గారు అన్నట్టు చంద్ర బాబు గారి ఉచిత హామీలు చూసి ఎవరూ ఓటు వేయలేదు ... మోడీ గారి గాలి చూసీ కూడా ఓటు వేయలేదు ... ఎందుకంటె వారికి తెలుసు ... ఏ నాయకుడు ఎలాంటి వాడో ... ఎవరు మాటల మనిషో ... ఎవరు చేతల మనిషో ... ఇక జగన్ గారి ఓదార్పు యాత్ర వ్యతిరేక దిశలో జరగాలి ... అంటే ఓదార్పు కావలసింది ప్రజలకు కాదు .. అయన గారికే ... కాంగ్రెస్ చిరునామా గల్లంతు అవడం ఊహించని విషయం ఏమీ కాదు కానీ ... ఎవరి కోసం తెలుగు ప్రజలని విడదీశారో ... ఎవరికి మేలు చేసామని చెప్పుకున్నారో , వారు కూడా ఛీ కొట్టారంటే ... ఇది ఆలోచించ వలసిన విషయం ... తెలంగాణా ఇవ్వడం కాదు ... ఇవ్వడానికి కారణ మైన వారే ముఖ్యమని తేల్చి చెప్పారు తెలంగాణా తెలుగు ప్రజలు ...


తమ పరిణతి ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు ప్రజలందరికీ అభినంద నలు తెలియజేస్తూ ... నేను సైతం మీతో .. మీలో ఒకడిగా ....





13, మే 2014, మంగళవారం

నింగిలో తారలతో స్టాక్ ల చెట్ట పట్టాల్ ...

స్టాక్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది ... నిన్న మొన్నటి వరకూ పాతాళ లోకంలో ప్రయాణం చేసిన షేర్ లు ఇప్పుడు  నెల విడిచి సాము చేస్తున్నై ... నింగి కెగసి తారలతో సయ్యాట  లాడు తున్నాయి ... అన్ని స్టాక్ ల పరిస్తితి బాగానే ఉంది ... నా పార్టి ఫోలియో ఖాళీ అయిపోతా నంటుంది ...


అయితే డివిడెండ్ లు వచ్చే కాలం ... ఎస్ బ్యాంకు , bhel , uco బ్యాంకు స్టాక్స్ అమ్మేశాను .   వచ్చిన సొమ్ముతో కొన్ని ఆంధ్ర బ్యాంకు స్టాక్స్ కొన్నాను  ఎందుకంటె ఐదు వందల రూపాయల ఎస్ బ్యాంకు కూ , డెబ్బై రూపాయల ఆంధ్ర బ్యాంకు కూ వచ్చే డివిడెండ్ ఒకటే .  భెల్ ఎప్పుడు అమ్మేద్దమా అని చూస్తున్నాను .  uco బ్యాంకు కు డివిడెండ్ రెండు రూపాయల లోపే ... అందుకే ఒక లక్ష రూపాయల విలువ గల ఆంధ్ర బ్యాంకు స్టాక్స్ maintain చేస్తే 7 % ఇంట్రెస్ట్ డివిడెండ్ ల రూపం లో వస్తుంది ...  ఇంత లోగా బాగా పెరిగితే ఆంధ్ర బ్యాంకు అయినా అమ్మేయడమే ... ఇందులో మొహమాటాలు , సెంటి మెంట్లూ ఏమీ లేవు ....


నిన్న రూ 9790 తో  కొన్న ఆంధ్ర బ్యాంకు స్టాక్ వేల్యూ ఈ రోజు రూ 10282 అంటే 5 % ఇంట్రెస్ట్ ఒక్క రోజులో ... brokerage తీసేస్తే 3. 62 % .  కేంద్రం లో bjp వస్తుందన్న వార్త వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది ...


చూద్దాం ... అమ్మే కాలాన్ని ఉపయోగించుకొని కొనే కాలం వరకూ వెయిట్ చేయాలి ....

11, మే 2014, ఆదివారం

గీతం ఫన్ స్కూల్ ... తేజస్విని

తేజస్విని ఈ ఫంక్షన్ లో ఒక పాటకు గ్రూప్ డాన్సు లో కూడా పాల్గొనడం కూడా జరిగింది ... "దేశ రంగీల " పాట కోసం .   ఈ గీతం స్కూల్ చిన్న క్లాసు లకు గానూ బాగా కేర్ తీసుకోవాలని ఆశించే తల్లి దండ్రుల కోసం ఆలోచించ తగ్గ స్కూల్ ... కానీ పెద్ద క్లాసు ల పై కూడా దీని యాజమాన్యం దృష్టి పెడితే మంచి భవిష్యత్ ఉన్న స్కూల్ గా పేరు పొందే అవకాసం ఉంది ...


10, మే 2014, శనివారం

డివిడెండ్ ల కాలం ...

ప్రారంభ మవుతోంది ...
ఇంత కాలం స్టాక్స్ కొనడం వేరు ... డివిడెండ్ ఇచ్చేముందు కొనడం వేరు ... ఎందుకంటె క్రయ విక్రయాలు రెగ్యులర్ గా చేయలేని వారు ఆధార పడేది ఈ డివిడెండ్ ల పైనే ... ఏ సంస్థ ఎప్పుడు దివిదెంద్స్ ప్రకటిస్తుందో చూసుకొంటే ఆ యా రోజుల ముందు స్టాక్స్ కొని, 2 నుండి 5 శాతం (నూటికి ) పొందే అవకాశం ఉంది ... అయితే dividend ఇచ్చాక ఆ కంపెనీ షేర్ ధర తగ్గి పోవచ్చు ... కాబట్టి కొనే ముందు వెంటనే అమ్ముకోవాలా లేదా పెరిగే వరకూ ఆగ గలమా అని చూసుకొని మరీ కొనటం అవసరం ... సో ... టేక్ కేర్ అండ్ ప్రొసీడ్ ...

మీ
మురళి

6, మే 2014, మంగళవారం

ఓటు వేసారా ?

ఇంకా వేయలేదా ? త్వరగా వెళ్ళండి మరి ...

ఓటరు మహాశయా ... నీ రోజు ... నీ ఇష్టం

ప్రత్యెక ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి ఎన్నికలు ...
విడి పోతామని తెంచుకు పోయిన వారి గురించి ఆలోచన మనకు అవసరం లేదు ...


నీ వల్ల ... అంటే నీ వల్ల .. అంటూ విభజన కు కారణమైన ప్రతి ఒక్క రాజకీయ పక్షం ఎదుటి వారిపై నిందలు వేస్తునా మనకు ఆ పనికిమాలిన కబుర్లు అక్కర లేదు


ఇది ఫ్రీ ... అది ఫ్రీ ... అంటూ మభ్యపెడుతున్నా చిరునవ్వుతో ఆ కామెడీ సీన్ లను ఎంజాయ్ చేద్దాం ...


కోట్లకు కోట్లు డబ్బు దొరుకుతోంటే ముక్కున వేలేసుకున్నా ... పరిస్తితి ని జీర్నించుకుందాం


కానీ ...


ఓటు మాత్రం ... ఏ ప్రలోభాలకు లొంగ కుండా ... ఏ ఒత్తిళ్లకు తలొంచ కుండా ...
ఒక మంచి భవిష్యత్తు నిచ్చే  నాయకునికి వేసి ...


భావి తరాలకు స్పూర్తి నిచ్చే నిర్ణయం తీసుకుందాం ...


జైహింద్