ప్రతీ రోజూ ఒకేలా ప్రారంభమైనా ,రోజు ముగిసే లోపు యేవో కొన్నికొత్త సంగతుల బారిన పడటం సర్వ సాధారణం ... 2014 జనవరి ఒకటి (డిసంబర్ 31 అర్దరాత్రి 2013 తరువాత అన్నమాట ) కొత్తగా కొనుక్కొన్న డైరీ లో ఏవేవో భవిష్యత్ప్రణాళిక లతో మొదటి పేజి ని నింపేస్తా ము . ఏవేవో కఠిన నిర్ణయాలు తీసేసు కుంటాము ... ఇదంతా ఆరంభ శూరత్వమే నని తరువాత నాలుగు రోజులు గడిచాక అనుభవం లోకి వస్తుంది ....
ఇది చాల మంది చేసే పని ... కాని నాలాంటి మేతావులు (పుంలింగం మెతెద్దు అనుకుంటా ) ... ఇటువంటి నిర్ణయాలు ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు తీసేసు కుంటారు ... తీర చూస్తె పొద్దున్న కనీసం అనుకున్న సమయానికి లేవడానికి కూడా బద్ధకం ...
అయితే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం తీసుకుంటున్న రకరకాల నిర్ణయాలు ... అమలు పరచడం లో కాస్త సీరియస్నేస్స్ చూపిస్తున్నాను ...
ఎవరైనా షేర్ మార్కెట్ లో ఉన్నాము అని చెబితే నేను ఎదుర్కొన్న రెండు రకాల ప్రశ్నలు ... మొదటిది " ఏయే షేర్లు కొన్నవేమిటి ?" రెండోది "ఎంత సంపాదించావేమిటి ? " అని . నాకున్న ఒక డౌట్ ఏమిటంటే రెండో ప్రశ్న అసలు రూపం వేరే అని ... ఎంత పోగొట్టుకున్నవేమిటి అని అడగాలనుకుని , అడిగితే బాగోదని , ఇలా అడగలేక అలా అడుగుతున్నారని ...
అయితే ప్రత్యేకంగా నేను మాత్రమె ఎదుర్కొనే ఇంకో ప్రశ్న ఉంది ... అది నా భార్య తాలూకు వాళ్ళ నుండి మాత్రమె ఎదుర్కోవాల్సి వచ్చేది ... "మరి సంపాదించి న లాభాల నేమి చేసారు ?" ... దీనర్థం మా అమ్మాయి కోసం ఏమి చేసావని కదూ ... నా మట్టి బుర్ర కు అంత మాత్రం తెలీదా ?
సరే ... ఇవన్నీ ప్రక్కన పెడితే ... సీరియస్ గా 2014 లో మనీ కంట్రోల్ లో , నా portfolio లో , నాకు సంబంధించిన Transaction History తీసి చూసాను ... దాని ప్రకారం
Purchase Value INR 278903 ; Sell Value INR 329932; ప్రాఫిట్ రూ 51035 ;
బ్రోకరేజ్ పోనూ దాదాపు రూ . 46,000 / -
పరవాలేదా ? ... పరవాలేదు లెండి .. పరవాలేదు అని అనుకోక పోతే చాలదు అని ఎలా అనుకుంటాం ?
average గ నెలకు రూ . 3,800/- కిట్టుబాటు అయినట్టు
తక్కువ అంటారా ?
సంపాదించిన మొత్తం లో లేదు తక్కువ, ఎక్కువలు ... సాధించిన విజయం ముఖ్యం ... ఇది భవిష్యత్ లో సాధించ బోయే మరిన్ని విజయాలకు స్ఫూర్తి , కిక్కూను ...