Share మార్కెట్ అనుభవాలు : నిజానికి పన్నెండు సంవత్సరాల క్రితం నాలుగువేల ఇదు వందల రూపాయలతో బ్యాంకు అఫ్ ఇండియా షేర్ లను కొనడం ద్వార ఈ రంగంలోకి వచ్చి పడ్డాను. అప్పుడు ఇప్పుడులాగా కంప్యూటర్లు లేవు కదా, పేపర్లో చూసి హెచ్చు తగ్గులు తెలుసుకొనే వాళ్ళం. ఒక్కో షేర్ ధర నలభై ఐదు చొప్పున వంద షేర్లు కొన్న. వారం రోజుల్లో డెబ్భై ఐదుకు పెరిగింది. అంటే షేర్ సర్టిఫికేట్ రాక ముందే మూడు వేలు లాభం వచినట్లిందన్న మాట. అప్పుడే అమ్ముకోవచు కదా! నెల తిరగక ముందే నాలుగువేల ఐదు వందలు కాస్త ఏడు వేలు దాటే సరికి కాలికులటర్ తీసుకొని లెక్కలు వేసుకొని సంవత్సరం అయ్యేసరికి లక్షాధికారి ని అయిపోతానని వూహించేసుకొని అమ్మడం మానేసాను. తీర సర్టిఫికేట్ వచ్చేసరికి ధర కాస్త సగం అయ్యింది. ఒక రెండు నెలలు చూసి, ఇక దాన్ని పట్టించుకోవడం మానేసాను. ఆఖరికి ఐదు సంవత్సరాలు దాటాక దాని ధర వందకు చేరాక అమ్మేసాను. అది గతం. (ఐతే ఈ బ్యాంకు అఫ్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రెండు వందల వరకు వుందనుకుంటా. ... )
సరిగ్గా పన్నెండు సంవత్సరాల తరవాత ....
అంటే పద్నాలుగు నెలల క్రితం ....
మ్యుతువాల్ ఫండ్స్ ద్వార ఆం లైన్ షేర్ మార్కెట్ కథ ప్రారంభం. ...
ముందుగా మ్వుతువాల్ ఫండ్స్ గురించి.. నిజం చెప్పాలంటే వీటి గురించి నాకు పూర్తిగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటె వీటిలో రెండు రకలన్నారు. ఒకటి డివిడెండ్ ... మరొకటి గ్రోత్ ....
షేర్ మార్కెట్ రిస్కులు ఎందుకనుకొనే వారికి ఇవి సరి అయినవి అంటారు. ... కాని షేర్ మార్కెట్లో వీరు ఏయే షేర్లలో పెట్టుబడి పెడతారో వాటి రేట్ పెరిగితే వీటి రేట్ పెరుగుతుంది... నెమ్మదిగా... కాని తగ్గితే వేగంగా వీటి రేట్ తగ్గిపోతుంది ... ఇంకొక విషయం ఏమిటంటే గ్రోత్ ఫండ్స్ లో యూనిట్లు పెరగవనట.. మరి ఏమి లాభమో ... డివిడెండ్ ఫండ్స్ నయం కదా! లేదా నాకు తెలిసింది తక్కువనా... ? ఎవరకైన తెలిస్తే చెప్పండి ....
మొదట్లో కొన్నవి డబ్బు అవసరం వచ్చి అమ్మేసా తక్కువ ఇంట్రెస్ట్ కి. ఖర్మ కాలి ఆ రిలయన్స్ పవర్ షేర్ మార్కెట్ లోకి వచ్చింది.. నాశనం .... రిలయన్స్ నాచురల్ రెసౌర్చెస్ ఫండ్ .... భయంకరమైన ప్రకటనలు చూసి ఐదు వేలు అప్పు చేసి కొన్నాను. అంతేనా ... ఫ్రెండ్స్ చేత కొనిపించాను కూడా ... ఓక్క యూనిట్ ధర పది రూపాయలు... అప్పుడు... మరి ఇప్పుడు ... ఆరు రూపాయలు ...
జనరల్ గా ఈ మ్యుతువాల్ ఫండ్స్ కొన్నవారు ఎక్కువ కాలం ఆగితే లాభాలు వుంటాయని చెబుతారు. ఎక్కువ కాలం ఆగితే ఏదైనా పెరుగుతుంది.. ప్రభుత్వాల పోస్ట్ ఆఫీసు బ్యాంకు మొదలైన డిపాజిట్లు కూడా ఎనిమిది సంవత్సరాలలో డబల్ అవుతాయి... మరి వీటిలో ప్రత్యేకత ఏమిటో... ఏమిటంటే .... మన రాత బాగుంటే పెరుగుతాయి బాగా.. లేకపోతే పాతాళం లోకే ప్రయాణం చేస్తాయి. .... మనల్ని సమాధి చేస్తాయి.
ఈ షేర్ మార్కెట్ లేదా మ్యుతువాల్ ఫండ్స్ అభిమానులు ఎవరైనా ... ఈ మ్యుతువాల్ ఫండ్స్ గురించి మంచి విషయాలు ఏమైనా చెప్పండి... ప్లీజ్ ... (ఇది ఈ రోజుకి ముగించే విషయం కాదు.....)
మీ
మురళి.
mututal funds ఒకప్పుడు గొప్పగా ఉండేవి. కాని ప్రస్తుతం బాగా దిగజారాయి. కాకపొతే కొంతమంది చెప్పేదేమిటంటే... ఇప్పుడు units చాలా తక్కువ రేటులో దొరుకుతున్నాయి కాబట్టి కొంచం సాహసం చేసి కొనుక్కోవచ్చు. (అప్పు చేసి మాత్రం కాదు). మరికొంత మంది అంటున్నారు షేర్లు కూడా చాలా తక్కువ రేటులో దొరుకుతున్నప్పుడు units కొనడంలో అర్థం లేదు అని. (నేను మాత్రం mutual funds units మొత్తం తెగనమ్మి - నష్టానికి - షేర్లు కొన్నాను). ఏది ఏమైనా ulip మాత్రం శుద్ద వేస్టు. దాని జోలికి వెళ్ళకండి.
రిప్లయితొలగించండి