"ఈ ఉగాదికి మీ ఇంట్లో ఏం చేసారు?"
"నేను - కవిత్వం వ్రాసాను....,"
మా ఆవిడ పచ్చడి చేసింది...,"
"మరి మీ పిల్లలు ఏం చేసారు?"
"నా కవిత్వం విన్నారు... పచ్చడి తిన్నారు..."
31, మార్చి 2009, మంగళవారం
26, మార్చి 2009, గురువారం
ఉగాది శుభాకాంక్షలు
తెలుగు సంవత్సరాది అంటే గుర్తుకు వచ్చేది కవి సమ్మేళనం. చాల సినిమాల్లో బ్రహ్మానందం ఆలి లాంటి వాళ్ళు సరదా కవిత్వాలు చెబుతూ ప్రేక్షకుల్ని అలరించారు. నేను సొంతంగా ఒక కవిత్వాన్ని వ్రాసాను... ఇది అముద్రితం. ఎవరికైనా పంపిస్తే... ఖచ్చితంగా తిరిగి రాదు. ఎందుకో తెలుసా? కవరు మీద ఫ్రం అడ్రెస్స్ వ్రాయను కాబట్టి.... మరి ఎవరికీ ప్రచురించే ధైర్యం లేదు ... కాని, నేను ధైర్యవంతున్ని కాబట్టి ప్రచురిస్తున్నాను...
చిత్తగించండి....
చంపక మాలతో చంపేస్తా....
ఉత్పల మాలతో ఉతికేస్తా...
కంద పద్యం తో కరిచేస్త...
సీస పద్యం తో చిన్చేస్తా...
ఆట వెలది తో అనిచేస్తా..
తేటగీతి తో తన్నేస్తా...
శార్దూలం తో సఫా చేస్తా...
మత్తేభం తో మర్డర్ చేస్తా...
నా జోలికి ఎవరైనా వస్తే...
వచన కవితతో వనికిస్తా...
బాగుందా... నా కవిత్వం... వచ్చిందా... వణుకు... గుర్తించారా.. నా భావుకత...
సీరియస్సు ఎండుకవుతారు? మడిసన్నాక కుసింత కళా పోసన ఉండాలా .. మీరూ మీ మీ కళా పోసనని జనాల మీదకి వదలండి... రేపే మంచి రోజు...
మీ
మురళి.
చిత్తగించండి....
చంపక మాలతో చంపేస్తా....
ఉత్పల మాలతో ఉతికేస్తా...
కంద పద్యం తో కరిచేస్త...
సీస పద్యం తో చిన్చేస్తా...
ఆట వెలది తో అనిచేస్తా..
తేటగీతి తో తన్నేస్తా...
శార్దూలం తో సఫా చేస్తా...
మత్తేభం తో మర్డర్ చేస్తా...
నా జోలికి ఎవరైనా వస్తే...
వచన కవితతో వనికిస్తా...
బాగుందా... నా కవిత్వం... వచ్చిందా... వణుకు... గుర్తించారా.. నా భావుకత...
సీరియస్సు ఎండుకవుతారు? మడిసన్నాక కుసింత కళా పోసన ఉండాలా .. మీరూ మీ మీ కళా పోసనని జనాల మీదకి వదలండి... రేపే మంచి రోజు...
మీ
మురళి.
2, మార్చి 2009, సోమవారం
చిన్న జోక్....
ఒక పల్లెటూరిలో ఒక ఇంటికి పండగకి అల్లుడు వచ్చాడు. స్నానం కాగానే, తన పంచెను ఉతికి ఆరేశాడు. పక్కనే అతని మరదలు తన బట్టలు కూడా ఆరేసింది. కాసేపయ్యాక వర్షం పట్టుకుంది. మరదలు బట్టలు తీయడానికి బయటకు వచ్చింది... ఆమెతో ఆ అల్లుడు అంటున్నాడు... "అమ్మాయీ... నీ బట్టలు తీసిన వెంటనే నా పంచె కూడా తీసేయి..." అప్పుడు ఆ మరదలు అంది... "బావగారూ! నా బట్టలు తీసేలోపు మీ పంచె తడిసి పోతుందేమో ..." -
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)