26, మార్చి 2009, గురువారం

ఉగాది శుభాకాంక్షలు

తెలుగు సంవత్సరాది అంటే గుర్తుకు వచ్చేది కవి సమ్మేళనం. చాల సినిమాల్లో బ్రహ్మానందం ఆలి లాంటి వాళ్ళు సరదా కవిత్వాలు చెబుతూ ప్రేక్షకుల్ని అలరించారు. నేను సొంతంగా ఒక కవిత్వాన్ని వ్రాసాను... ఇది అముద్రితం. ఎవరికైనా పంపిస్తే... ఖచ్చితంగా తిరిగి రాదు. ఎందుకో తెలుసా? కవరు మీద ఫ్రం అడ్రెస్స్ వ్రాయను కాబట్టి.... మరి ఎవరికీ ప్రచురించే ధైర్యం లేదు ... కాని, నేను ధైర్యవంతున్ని కాబట్టి ప్రచురిస్తున్నాను...
చిత్తగించండి....
చంపక మాలతో చంపేస్తా....
ఉత్పల మాలతో ఉతికేస్తా...
కంద పద్యం తో కరిచేస్త...
సీస పద్యం తో చిన్చేస్తా...
ఆట వెలది తో అనిచేస్తా..
తేటగీతి తో తన్నేస్తా...
శార్దూలం తో సఫా చేస్తా...
మత్తేభం తో మర్డర్ చేస్తా...
నా జోలికి ఎవరైనా వస్తే...
వచన కవితతో వనికిస్తా...

బాగుందా... నా కవిత్వం... వచ్చిందా... వణుకు... గుర్తించారా.. నా భావుకత...
సీరియస్సు ఎండుకవుతారు? మడిసన్నాక కుసింత కళా పోసన ఉండాలా .. మీరూ మీ మీ కళా పోసనని జనాల మీదకి వదలండి... రేపే మంచి రోజు...

మీ
మురళి.

2 కామెంట్‌లు:

  1. me dhairyaninni, kalaa posana chusi..kallu gijel mannai andi murali garu...kavitha bagundhi.

    రిప్లయితొలగించండి
  2. మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.

    రిప్లయితొలగించండి