22, ఏప్రిల్ 2009, బుధవారం

నా గోడు...

తెలంగాణా ఏరియా లో ఎలెక్షన్ లు అయిపోయాయి. ప్రతి పార్టీ నాయకుడూ తమ పార్టీయే ప్రభుత్వం నెలకొల్పుతుందని ప్రత్యర్ధి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు... ఓటర్లు మాత్రం అందరి సభలకూ వెళుతున్నారు... అందరి మాటలు వింటున్నారు... కానీ, ఏ గుర్తు మీద గుద్దుతున్నారో, .... ఏ అభ్యర్ధిని గుద్దుతారో,... సరిగ్గా చెప్పడం లేదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కో బాకా పత్రికలున్నాయి కదా.. అవి మాత్రం తమ తమ పార్టీలే గెలుస్తాయని సర్వే చేసి మరీ చెబుతున్నాయి... ఈ గందరగోళానికి సమాధానం దొరికేది మాత్రం కౌంటింగ్ అయిపొయాకే. రేపు ఆంధ్ర ఏరియా లో ఎలెక్షన్ లు. ... ఉచిత హామీలతో జనాలను ఊదర గోడుతున్న పార్టీలు అధికారం లోకి వచ్చాక ఎంత వరకు అమలు చేస్తాయో కాని... కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచినందుకే, బయటి మార్కెట్ లో కిలో రేట్ ముప్పై అయింది... మరి ఈ వుచిత హామీలన్నీ అమలు చేస్తే, ఏ ఏ వస్తువు ధర ఏ ఏ పాలపున్తలను తాకుతుందో... నాలాంటి మధ్య తరగతి జీవులు ఆ ధరలను అందుకోవడానికి ఎటువంటి విహంగాలను ఉపయోగించాలో ... లేదా శ్రీహరికోట లో కాపురం పెట్టి వాళ్లు నింగి లోకి పంపించే ఉపగ్రహాలను పట్టుకొని పైకి పోయి ఆ ధరలను అందుకోవాలో ... ఆ భగవంతుని దయ ఎలా ఉందొ... మన ప్రాప్తం ఎలా ఉందొ... అసలే ఆర్ధిక మాంద్యం అని చెప్పి మాకు జీతాలు పెంచడం మానేసారు... ఇంటి అద్దెలు, పెరుగుతున్న ఖర్చులూ భరించలేక హైదరాబాద్ వదిలేసి... రాజమండ్రి వెళ్లి పోతున్నా.... ఇంకా పరిస్థితులు తారు మారు అయితే ఏ అడవుల్లోకో పోయి మొలకి గుడ్డ కట్టుకొని, వేటాడుతూ బ్రతకాలేమో... దేవుడా... జానెడు పొట్ట .... బెత్తెడు పొట్ట క్రింది భాగాన్ని ఇచ్చి చోద్యం చూస్తున్నావు కదయ్యా....

15, ఏప్రిల్ 2009, బుధవారం

వాంటెడ్ డిప్లొమా ఇన్ సివిల్ పర్సనల్






I, being the HR Executive of M/s.Sumadhura Geomatica Pvt.Ltd., take pleasure in introducing the company which is a pioneer in Topographical and Engineering Surveys, Photogrammetry, GIS & CAD Services, Earth Sciences and Oil & Gas Works all over India. We are currently surveying and Designing irrigation canals for some of the major irrigations projects undertaken by Government of Andhra Pradesh using latest survey equipment sourced from Switzerland and USA and executing prestigious projects in other areas as mentioned above using cutting edge technologies.
So, in searching of diploma candidates in civil engineering, we are contacting all Polytechnic colleges for campus interviews.
In this connection, we invite qualified candidates to fix their interview date and time and the request Placement Officers of Polytechnic colleges all over Andhra Pradesh to contact me if you are interested to arrange campus interviews at your college premises. Or, you can mail your resume to my mail ID given below.
muralitsv@yahoo.co.in
Contact No.9000 235 406
With Regards,

TSV Murali Krishna
HR Executive.
అడ్రస్ :
1-2-607/54/7, SBH Colony, Behind DBR Mill, Hyderabad.
హాయ్! సుమధుర జియో మేటికా ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ కాన్సల్టేన్సి కంపెనీ. ఇర్రిగేషన్, ఆయిల్ అండ్ గాస్ సంబంధించి సర్వే చేయించి

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఈ సారి సంక్రాంతికి కోళ్ళ పందెం కోసం రెండు కోళ్ళు కొన్నాను... ఒక దాని పేరు ఈనాడు, ఇంకోదాని పేరు సాక్షి... ఓడిపోయేది ఏదైనా పోరాటం మాత్రం భలే మజాగా ఉంటుంది కదూ....

2, ఏప్రిల్ 2009, గురువారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు

లాస్ట్ మంత్ హోలీ ప్రభుత్వ సెలవు దినాల ప్రకారం ఒక రోజు ఐతే, పండగ జరుపు కొన్నది మరో రోజు అయింది. మా ఆఫీస్ లో ప్రభుత్వం ప్రకారం సెలవు తీసుకొన్నాం... తీర చూస్తె పండగ అందరూ జరుపు కొంటుంటే మేము డ్యూటీ చేసాం.... ఈ సారీ శ్రీరామ నవమి విషయంలో అలాగే జరగాల్సి ఉండగా, ముందే జాగ్రత్త పడటం జరిగింది.... అందుకే నాలుగున సెలవు ప్రకటించేసాం. కళ్యాణం భద్రాచలం లో ఏప్రిల్ నాలుగున ... ముందుగానే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు....