తెలంగాణా ఏరియా లో ఎలెక్షన్ లు అయిపోయాయి. ప్రతి పార్టీ నాయకుడూ తమ పార్టీయే ప్రభుత్వం నెలకొల్పుతుందని ప్రత్యర్ధి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు... ఓటర్లు మాత్రం అందరి సభలకూ వెళుతున్నారు... అందరి మాటలు వింటున్నారు... కానీ, ఏ గుర్తు మీద గుద్దుతున్నారో, .... ఏ అభ్యర్ధిని గుద్దుతారో,... సరిగ్గా చెప్పడం లేదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కో బాకా పత్రికలున్నాయి కదా.. అవి మాత్రం తమ తమ పార్టీలే గెలుస్తాయని సర్వే చేసి మరీ చెబుతున్నాయి... ఈ గందరగోళానికి సమాధానం దొరికేది మాత్రం కౌంటింగ్ అయిపొయాకే. రేపు ఆంధ్ర ఏరియా లో ఎలెక్షన్ లు. ... ఉచిత హామీలతో జనాలను ఊదర గోడుతున్న పార్టీలు అధికారం లోకి వచ్చాక ఎంత వరకు అమలు చేస్తాయో కాని... కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచినందుకే, బయటి మార్కెట్ లో కిలో రేట్ ముప్పై అయింది... మరి ఈ వుచిత హామీలన్నీ అమలు చేస్తే, ఏ ఏ వస్తువు ధర ఏ ఏ పాలపున్తలను తాకుతుందో... నాలాంటి మధ్య తరగతి జీవులు ఆ ధరలను అందుకోవడానికి ఎటువంటి విహంగాలను ఉపయోగించాలో ... లేదా శ్రీహరికోట లో కాపురం పెట్టి వాళ్లు నింగి లోకి పంపించే ఉపగ్రహాలను పట్టుకొని పైకి పోయి ఆ ధరలను అందుకోవాలో ... ఆ భగవంతుని దయ ఎలా ఉందొ... మన ప్రాప్తం ఎలా ఉందొ... అసలే ఆర్ధిక మాంద్యం అని చెప్పి మాకు జీతాలు పెంచడం మానేసారు... ఇంటి అద్దెలు, పెరుగుతున్న ఖర్చులూ భరించలేక హైదరాబాద్ వదిలేసి... రాజమండ్రి వెళ్లి పోతున్నా.... ఇంకా పరిస్థితులు తారు మారు అయితే ఏ అడవుల్లోకో పోయి మొలకి గుడ్డ కట్టుకొని, వేటాడుతూ బ్రతకాలేమో... దేవుడా... జానెడు పొట్ట .... బెత్తెడు పొట్ట క్రింది భాగాన్ని ఇచ్చి చోద్యం చూస్తున్నావు కదయ్యా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి