సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి ఉంటుంది "గాయం" సినిమాలో... "పాత రాతి గుహలు ... పాలరాతి గృహాలైనా , అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా... వేట అదే, వేటు అదే... నాటి కథే అంతా. నట్టడవులు నడివీధికి నడిచొచ్చిన వింత... " అలాగే "అయినా మనిషి మారలేదు" అంటూ గుండమ్మ కథ లో ఘంటసాల పాట... అంటే ఎంత అభివృద్ది చెందుతున్నా మనిషి మనస్తత్వం మారలేదు.. మారాడు.. అని అర్థం. అంటే మూలం మాత్రం మారదు, పై పైన మారినట్టు కనిపిస్తుంది అంతే... ఆదిమ మానవులు పచ్చి మాంసం తినేవారు... తరువాత కాల్చిన మాంసం తినే వారు... తరువాత ఉడక బెట్టిన "మాంసం" తినేవారు. తరువాత ఉప్పు, కారం కలిసిన "మాంసం" తినేవారు... ఇప్పుడు "మాంసం" చికెన్ అరవై ఐదు, చికెన్ చెట్టినాడు, తందూరీ చికెన్, మటన్ మొఘలై ఇలా రాసుకుంటూ పోతే "మాంసం" ఎన్ని రకాలుగా తింటున్నారో ... అంటే "మాంసం" తినే పద్ధతి ఐతే మారింది... కాని మాంసం తినడం మానలేదు... బహుశ ఇంకా పెరిగింది... అంటే పధ్ధతి మారింది.. కాని మూలం మారలేదు... ఈ మోసలకూ అది వర్తిస్తుంది... ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటె నాకు వచ్చిన కొత్త మెయిల్ చూడటం వలన... ఒక మూడు వందలు పంపించా లాంట, కొంత ఆ మైంటైన్ చేసేవాడు తీసుకొని మిగిలింది మనకన్నా ముందుగా లిస్టు లో ఉన్నా బకరా గాళ్ళకు ఇస్తారు అంట... మన పేరు పైకి పోతుందంట... మన తరువాత డబ్బు కట్టే వారి వల్ల మనకు డబ్బు వస్తుందంట... అలా నెలలో ఒక లక్ష వస్తుందంట.. పైన చెప్పిన "మారలేదు" అనే స్టోరి కీ దీనికీ సంబంధం ఏమిటి అంటారా? ఇంతకు ముందు పోస్ట్ లో డబ్బు కట్టమని "లింక్" సిస్టం వల్ల ముగ్గురు చేత కట్టించాలని, వారు ఒక్కక్కరు ముగ్గురేసి చొప్పున కట్టించితే ... అలా లింక్ పెరిగితే బోల్డంత డబ్బు వచ్చేస్తుందని... (స్టాలిన్ సినిమా గుర్తొస్తుందా..?). ఇప్పుడు అది ఆన్ లైన్ లోకి, డైవర్ట్ అయ్యింది... అదీ సంగతి... ఈ మనిషి ఎపుడు మారతాడో... కదా...
మరో మారని మనిషి... మురళి....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి