మా పాప తేజస్విని పేరు మీద బ్లాగ్ క్రియేట్ చేశాను... కాని ఎప్పుడూ మా పాప గురించి వ్రాయలేదు... ఆ మధ్య తన పుట్టిన రోజు శుభాకాంక్షలు ఫోటో తో సహా వేయడం తప్ప... నా పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లో... సెప్టెంబర్ మూడు... కాని నాకు సంతానం కలిగింది సెప్టెంబర్ పదకొండు... రెండువేల ఏడు లో... అంటే పెళ్ళయిన ఎనిమిది సంవత్సరాలకు ... సంతాన భాగ్యం కలిగింది మాకు... వేరికోసిల్ అన్నారు... ఆపరేషన్ చేయించుకొన్నాను... దేవుళ్ళకు మొక్కేస్తూ, డాక్టర్స్ ను పోషిస్తూ, బంధువుల సూటి పోటి మాటలను భరిస్తూ, ఆఖరికి ఎవరివల్ల పొందగాలిగానో తెలియకుండా.. (ఐ మీన్ దేవుడు.. ఐతే ఏ దేవుడో : డాక్టర్ ఐతేఏ డాక్టరో తెలియలేదని నా ఉద్దేశ్యం) ఒక బిడ్డను పొందగలిగాను... నిజానికి నాకు అనిపించింది ఏమిటంటే దేముడు, డాక్టర్స్, వీళ్ళందరి సాయం కన్నా ఒక ముఖ్యమైన కనిపించని శక్తి సాయం తో ఏమైనా సాధించ వచ్చు... అదే మన మనస్సు... ఎస్... నేను ముఖ్యంగా మనసు తోనే సాధించగలిగాను... ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, బంధువుల మాటలను పట్టించుకోకుండా.. ఎదురుగా ఉన్న గుడిలో వినాయకుని విగ్రహం కళ్ళల్లోకి కళ్లు పెట్టి "నేను సాధించాలి... " అని పదేపదే సెల్ఫ్ హిప్నో టైజ్ చేసుకుంటూ, ఒక కాలెండరు తయారుచేసుకుని ఛాన్స్ ఉన్న రోజుల్లోనే ప్రయత్నిస్తూ మొత్తానికి... మూడు నెలల లోపే సాధించాను... ఈ సొంత డబ్బా చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేది కాదని నాకు తెలుసు.. కాని వ్రాయాలనిపించింది ... వ్రాస్తున్నాను... ఐతే ...
ముఖమైన ఒక పొరపాటు ... నా వల్ల జరిగింది.. చాల మందికీ జరిగీ ఛాన్స్ ఉండేది... ఒకటుంది... అదేంటంటే స్పెరం టెస్ట్ చేయడానికి ఇస్తున్నప్పుడు ... అంగ స్తంభనం బాగా జరిగాక.. స్పెరం మొత్తం బాటిల్ లోకి పడేట్టు జాగ్రత్త వహించాలి... టెన్షన్ తో ప్రయత్నిస్తే అంగస్తంభన జరగక పోవచ్చు... స్పెరం లో మొదట పదే డ్రాప్స్ లోనే ఎక్కువ కణాలు ఉండే అవకాసం ఉంటుంది.. తరువాత వచ్చే డ్రాప్స్ లో కణాలు తక్కువ ఉంటాయి.. కాబట్టి ఒక్కసారి స్పెరం టెస్ట్ చేయించేసుకొని ఆపరేషన్ కు తయారవడం తప్పు... ఇంకో విషయం ఏమిటంటే సిగ్గు పడటం లాంటి వి ఇటువంటి విషయాలలో చేయవద్దు.. కనీసం రెండు మూడు సార్లు అయినా టెస్ట్ చేయించుకోవాలి...
జస్ట్ నాలాగా కొంత మంది ఉండవచ్చు అనే ఉద్దేశ్యం తో వ్రాసాను... లోపం అనే మాటను మనసు లోంచి తీసేయక పోతే శరీరం ఏ మాత్రం సహకరించదు.. ఇటువంటి విషయాలలో మనమే డాక్టర్స్ కావాలి... మనమే దేవుళ్ళ మ వ్వాలి.. కొద్దిగా ఎమోషన్ ఎక్కువైందని పిస్తే క్షమించాలి...
ఈ స్క్రిప్ట్ సరిగ్గా సహకరించడం లేదు.. మళ్ళీ మరోసారి...
మురళి.
లేదు మోతాదులోనే ఉంది. చాలా వ్యక్తిగతమైన, చాలా సంకోచపడే విషయాన్ని సూటిగానూ, సెన్సిటివ్ గానూ పంచుకున్నారు. అభినందనలు. చిన్నారి తేజస్వినికి ఆశీస్సులు.
రిప్లయితొలగించండి