ఈ మధ్య ఇంటర్ నెట్ జాబు మెయిల్స్ గొడవ ఎక్కువైపోతోంది... ఇంకా లాటరీ లో డబ్బు వచ్చిందంటూ మెయిల్స్.... స్నేహం చేస్తామంటూ మెయిల్స్... ఇలా ఎన్నెన్నో... ఈ లాటరీ మెయిల్స్ ఇంత వరకూ నెట్ లోనే వచ్చేవి... ఈ మధ్యనే ఎస్.ఎం.ఎస్. లూ వస్తున్నాయంట... నెట్ నుండి ఫోన్స్ కు ప్రాకింది ఈ జబ్బు.. నెట్ వాడిన వాళ్ళతో పోలిస్తే ఫోన్స్ వాడే వాళ్లు ఎక్కువ కదా... ఎక్కువ మంది బుట్టలో పడే అవకాశం ఉంటుంది... చాల కాలం క్రిందట మా వూళ్ళో (పార్వతీపురం) అందవర్ సర్క్యులేషన్ అని పెట్టాడు... అండవార్ అంటే ఏమిటి? అని అడిగాం మా కుర్రాళ్ళం (అపుడు మనం జస్ట్ నిక్కర్ల నుండి ఫాంట్ లోకి మారిన వయసులో ఉన్నాం లెండి... ) అపుడు ఆ మహానుభావుడు ఆకాశం వైపు చూపించి "ఆండవర్ అంటే ఆ భగవంతుడని అర్థం" అన్నాడు... ఇంతకీ స్కీమ్ ఏమిటంటే సగం రేట్ కే అన్ని సామాన్లు దొరుకుతాయి... కాకపోతే డబ్బులు కట్టిన వారం రోజులకి వస్తువు ఇస్తారు... అందరికీ తెలుసు అందులో ఖచ్చితంగా మోసం ఉంటుందని... కాని మొదట కట్టిన వాళ్ళకి వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది అనే ఆశ... తరువాత కట్టినవాడు పోతాడు... అంతే.. మరి ఏం చేయకుండా ఉరుకొనే వయసు కాదు కదా... వాళ్ళిచ్చిన పాంఫ్లెట్ ను కవర్ లో పెట్టి, ఒక ఉత్తరం వ్రాసి, (అపుడు సెల్ ఫోన్స్ లేవు కదా... కనీసం ల్యాండ్ లైన్స్ కూడా తక్కువ... మొదట ఫోన్ ఎత్తగానే "నెంబర్ ప్లీజ్" అని అడుగుతారు... మనం నెంబర్ చెప్పితే కాసేపు అయ్యాక కనెక్షన్ ఇస్తారు... అదే ఎస్.టి.డి. ఐతే ప్రొద్దున్న కాల్ బుక్ చేస్తే ఏ రాత్రికో కనెక్షన్ ఇచ్చేవాళ్ళు.. ఈ కాలం వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపిస్తుంది కాని ... ఇది నిజం...) పోలీస్ స్టేషన్ అడ్రస్ వ్రాసి పంపించాము... పాపం వాడు పూర్తిగా ఆఫీసు సెట్ అప్ చేయడం కూడా చేయలేదు... పోలీస్ లు వచ్చారు... ఆండవర్ గారిని తీసుక పోయారు... ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి... ఎలా కంప్లైంట్ చేయడం? ఎవరి మీద అని కంప్లైంట్ చేయడం? ఇలా నమ్మొద్దని "ఆన్ లైన్ - బ్లాగ్స్" లోనే హెచ్చరించడం తప్ప....
...మురళి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి