హాయ్! మొత్తానికి తెలంగాణా లో ఉన్న నా తెజస్వినిని తీసుకొచ్చేసాను... (కూడా వాళ్ళమ్మ కూడా వచ్చింది)... స్పెషల్ ట్రైన్ లో... కాకపోతే జీవితం లో స్పెషల్ ట్రైన్ ఎక్క కూడదని అనిపించింది... రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరవలసిన విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం కు వస్తుందని జస్ట్ పది గంటల ఏభై ఐదు నిమిషాలకు ప్రకటించారు... అలవాటు ప్రకారం అర డజన్ లగేజ్ లు, ప్లస్ మా తేజస్విని... ప్లాట్ ఫారం పై సామూహికంగా తపస్సు చేసిన జనాలను కరుణించిన ఆ ట్రైన్ చాల త్వరగానే జస్ట్ ఒంటి గంటకు ప్లాట్ ఫోరం మీదకు వచ్చింది... తీర చూస్తె బోగి నంబర్లు రాయలేదు... అందరూ ఇదే ఎస్ నాలుగు అన్నారని ఒక బోగిలోకి సామాన్లన్నీ ఎక్కించిన కాసేపటికి అది ఎస్ నాలుగు కాదు... ఎస్ తొమ్మిది అన్నారు... ఉసూరు మంటూ సామాన్లన్నీ మోసుకొంటూ (ఒకసారి రెండు సార్లు కాదు, నాలుగు సార్లు) సదరు బోగి లోకి చేరగానే బయలు దేరింది... విజయవాడ వచ్చేసరికి ఏడు న్నర... ఎక్కడ ఎవడు చెయ్యి ఎత్తినాఆపేస్తున్నట్లు ఆపేయడం, ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ వేశారేమో, ప్లాట్ ఫారం దొరక్క ఔటర్ లో ఆపేయడం, ఆఖరికి పదకొండు గంటలకు రాజమండ్రి చేరింది... ఇంకా వైజాగ్ చేరే సరికి ఎంత టైం అవుతుందో... మొత్తానికి ఈ ప్రయాణం భయంకరమైన కిక్ ఇచ్చింది... అయితే తత్కాల్ లో ట్రైన్ ఫేర్ కన్నాఆర్.టి.సి. లో ఛార్జ్ ఎక్కువ ఐంది... హైదరాబాద్ సిటీ బస్సు ఆర్డినరీ మినిముం ఛార్జ్ ఐదు రూపాయలు... మెట్రో లో ఏడు రూపాయలు, పైగా రిజర్వేషన్ టికెట్ వారికి ఇంతకు ముందు మెట్రో సిటీ బస్సు లో ప్రయాణం ఉచితం... ఇప్పుడు అది కాస్త రద్దు చేసినట్లున్నారు... అనధికారంగా ఐ ఉండవచ్చు... లేదా ఈ మధ్య సమ్మె ల లో తగల బడిన బస్సు ల ఖర్చు, సమ్మెల వలన ఆగిన ప్రయాణాల నష్టం ఇలా పూడ్చు కోవాలని అనుకొంటూ న్నరేమో... ఈ పెరిగిన ఛార్జ్ ల పుణ్యమా అని బస్సుల లో జనాలు తగ్గిపోయారు... ట్రైన్ ఛార్జ్ లు కూడా పెంచుతారని విన్నాను... కరంట్ ఛార్జ్ కూడా పెరుగుతుందట... ఇంకా ఏమేమి పెంచాలో బాగా ఆలోచించి ఐడియా లిచ్చే వారికి బహుమతులు కూడా ఇస్తారేమో... ఇవన్నీ చూస్తోంటే యర్రంసెట్టి సాయి నవల (ఇరవై లో అరవై యో అరవై లో ఇరవై యో సరిగ్గా గుర్తు లేదు) లో ఒక సన్నివేసం గుర్తుకు వస్తూంది... హీరో హుస్సేన్ సాగర్ గట్టున నిలబడి ఉంటాడు... ఇంతలో నైట్ డ్యూటీ పోలీసు అతన్ని చూసే ఆత్మహత్య చేసుకొనే బాపతుగా భావించి "ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలను కుంటున్నావ్" అని అడుగు తాడు... అప్పుడు హీరో "పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న జీతాలు, నిరుద్యోగం, పనికి మాలిన రాజకీయాలు, రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు" అంటూ ఏకరువు పెడతాడు... (సరిగ్గా ఆ సంభాషణలు గుర్తు లేవు) దాంతో "దేశం ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు నీకే కాదు బాబు, ఎవరికైన ఆత్మ హత్య చేసుకోవాలని అనిపిస్తుంది ... ఇటువంటి పరిస్తితుల్లో బ్రతకడం కన్నా చావడమే బెటర్" అంటూ తనే దూకేస్తాడు సాగర్ లోకి. నాకు పక్కనే గోదావరి ఉంది....
మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి