మా తేజస్విని కి మాటలు బాగానే వస్తున్నై... జస్ట్ "క'' బదులుగా "త" అంటుంది... మరికొన్ని నత్తి మాటలు ... అన్నీ మాట్లాడేస్తుంది... కాకపోతే కొన్నే అర్థం అవుతాయి... వాళ్ళమ్మ , వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబం ఈమెకు మాటలు ఎప్పుడు వస్తాయా , స్కూల్ లో జాయిన్ చేసేద్దమా అనేదే యాతన... అందుకే సరదాగా "ఎదగ డానికెందుకురా తొందరా" అనే పాటను పేరడీ చేస్తూ పాడుతుంటాను... (ఎవరూ విననప్పుడు)...
పల్లవి : ఎదగ డాని కెందుకురా తొందరా... ఎదర బ్రతుకంతా చిందర వందరా... జో.. జో..
చరణం :
నోట మాట వస్తేను కాన్వెంట్ కు పోవాలి...
బస్తా లకు బస్తాలు పుస్తకాలు మోయాలి...
పేజీ లకు పేజీలు హోం వర్క్ లు చేయాలి...
హోం వర్క్ చేయకుంటే గుంజీలు తీయాలి..
అపుడీ ఆటలు ... పాటలు బందురా ....
చదువొక్కటే ఉంటుంది ముందరా..
ఇప్పుడే తృప్తిగా ఆడరా ....
నాన్నా...
ఎదగడాని కెందుకురా తొందరా... మళ్ళీ పల్లవి...
రెండో చరణం మర్చి పోయాను... (అసలు ఉంటేగా ... మర్చిపోవడానికి...)
ఇప్పటికి ఇంతే...
మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి