నాకు బాగా గుర్తు... దాదాపుగా నేను ఈ బ్లాగ్ ఓపెన్ చేసిన మొదట్లో ఉగాది శుభాకాంక్షలు చెప్పానునా బ్లాగ్ మిత్రు లందరికీ.. ఒక మంచి కవిత చెప్పడం ద్వారా..
ఈ మధ్య డ్యూటీ లో బాగా బిజీ అవడం వల్లనూ, మళ్ళీ షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి, ఐ.సి.ఐ.సి.ఐ. డైరెక్ట్ వారి పుణ్యం వాళ్ళ, ఒక ఐదు వేలు డిమాట్లో ఉంచడం వల్లనూ, (అంటే అర్థం వారి సలహా తో కొన్న షేర్ లు అమ్మడానికి వీలు లేనంతగా తగ్గి పోయాయి అని), మా తేజస్విని తో ఆడుకోవడానికేసమయం సారి పోక పోతుండటం వల్లనూ... ముఖ్యంగా వ్రాయడానికి ప్రత్యేకంగా మేటర్ లేక పోవడం వల్లనూ, మూడ్ లేకపోవడం వల్లనూ, బ్లాగ్ లో సొల్లు వ్రాయడం తగ్గింది..
ఇప్పుడు మా తెజస్వినికి మాటలు చాలానే వచ్చేసాయి.. కాకపోతే "క" బదులుగా "త" మాత్రం మర్చిపోకుండా వాడుతుంది... ఈ మధ్య "మద దీర" (మగధీర), సినిమా చివరి సాంగ్ వరకూ చూస్తోంది.. చున్ని కనబడితే ఆ చివర ఒకరిని పట్టుకోమని, ఈ చివరి నుంచి చుడుతోంది... మోటర్ బైక్ తో జంపింగ్ చేస్తోంటే (గ్రాఫిక్స్ అని తెలీదు కదా..) కేరింతలు కొడుతోంది.. సునీల్ కామెడీని, బ్రహ్మానందం సీన్ నీ ఎంజాయ్ చేస్తోంది.. తరువాతి సీన్ లు చెప్పేస్తోంది.. సమస్య అది కాదు కానీ, మమ్మల్ని కూడా పక్కన కూర్చొని సినిమా చూడ మంటోంది.. ఈ మధ్యనే "కిక్" సినిమా కూడా చూస్తోంది... శంకర్ దాదా జిందాబాద్ కూడా... తన లో నాకు ఆశ్చర్యం కలిగించే లక్షణం ఏమిటంటే, తన మనసులో ఫీలింగ్స్ ను ఎక్ష్ప్రెస్స్ చేసే విధానం... అస్సలు మాటలు రా ని వయస్సులో (అంటే చిన్న చిన్న మాటలు వరకూ వచ్చిన వయస్సన్న మాట) ఒకసారి జరిగిన సంఘటన...
తనను భుజం మీద వేసుకొని ఇంట్లో అయితే గాలి తక్కువని, వీధిలో అటూ ఇటూ తిరుగుతున్నా ... అపుడు "ఇంట్లో అమ్మ దగ్గరకు వెళతానని" చెప్పిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించింది...
"నాన్న... ఇల్లు ఉంది ఇల్లు... అమ్మ ఉంది అమ్మ... " అంటూ బొటన వేలు "తంసప్" లా బయటకి పెట్టి నోటి దగ్గర పెట్టి... "చ్చో,... చ్చో... " అంటూ పాలు తాగు తానని అన్నట్లుగా చేతిని ఇంటి దిక్కు చూపించింది... "ఏంటమ్మా " అని అర్థం కానట్లుగా అడిగితే మళ్ళీ .. అదే యాక్షన్... రిపీట్ ....
భలే నవ్వు వచ్చేది... అటువంటి టైం లో... మరి ఇప్పుడు వాగుడు బాగా ఎక్కువయ్యింది...
ఇప్పుడు అర్థం అవుతోంది... తల్లి దండ్రులు పిల్లలను మూడేళ్లకే స్కూల్ లోకి ఎందుకు తోసేస్తున్నారో... ఇప్పుడు ఇక నా వాటా..
ఈ ఉగాదికి రాజమండ్రిలో... తరువాత ఉగాది ఎక్కడో...
అందుకే అందరికీ చంపక మాలతో చంపకుండా... ఉత్పల మాలతో ఉతక కుండా.. శార్దూలం తో సఫా చేయకుండా. మత్తేభం తో మర్డర్ చేయకుండా. వచన కవిత తో వణికించ కుండా... చెప్పేస్తున్నా...
ఉగాది శుభాకాంక్షలు...
Murali anna namasthe i am hari. When i am searching for share market i saw ur blog. It is nice. I join as a follower to ur blog. I too like writing like u and i am impresing ur postings.keep in touch.
రిప్లయితొలగించండి