14, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎస్.బి.ఐ.సేక్యురిటీస్ గురించి...

ఈ మధ్య ఎస్.బి.ఐ. లో ౩ ఇన్ ౧ ఎకౌంటు ఓపెన్ చేశాను... ఇంతకు ముందు మోతిలాల్ ఒస్వాల్ తో లింక్ ఉన్న ఎస్.బి.ఐ. ఇప్పుడు "ఎస్.బి.ఐ. కేప్ సెక్యురిటీస్" గ మారింది.. ఐ.సి.ఐ.సి.ఐ. డైరెక్ట్ తో పోలిస్తే సర్వీసెస్ కొద్దిగా పూర్... కాకపోతే బ్రోకరేజ్ కాస్త తక్కువ పడుతుంది... అంతే కాకుండా మినిమం ఇన్ని కొనాలి అని రూల్ లేదు... అందువల్ల కాస్త తక్కువ ధర పెరిగినా అమ్మేసుకొనే అవకాసం ఉంది... రోజుకి ఒక స్క్రిప్ కు సంబంధించి రికమండేషన్ ఇస్స్తున్నాడు.. దాని ప్రకారం ట్రేడింగ్ చేస్తే కనీసం పదిహేను వందలకు నాలుగు రోజుల్లో కనీసం ఐదు రూపాయలైనా కిట్టుబాటు అవుతుంది.. అదే ఐ.సి.ఐ.సి.ఐ. లో ముప్పై వేల మీద రెండు వేలు రావడానికి మూడు నెలలు పట్టింది... లాంగ్ టైం వెయిట్ చేస్తే ఏదైనా ఓ.కే. కానీ మనకు అంత ఓపిక లేదు కదా.. నిజానికి ఇంట్ర డే ట్రై చేసి నాలుగు వందలు బొక్క పెట్టుకున్నాక బుద్ధి మంతునిలా తక్కువ పెట్టుబడి... తక్కువ లాభం ... సూత్రాన్ని పాటిస్తున్నాను... ఏది ఏమైనా పూర్తిగా ఇంప్రూవ్ కావాలంటే (నేను కాదు... ఎస్.బి.ఐ. సంగతి ... ఐ.సి.ఐ.సి.ఐ. లాగ... ) చాల టైం పడుతుంది... ప్రస్తుతానికి నాలాంటి వారికి ఎస్.బి. ఐ. ... ఓ.కే.

ఎలాగైనా ఇన్వెస్ట్ చెయ్యండి... భవిష్యత్ కోసం...

మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి