అభివృద్ధికీ, క్రమ శిక్షణ కీ పెట్టింది పేరు జపాన్... ఎలక్ట్రానిక్స్ అంటే గుర్తుకు వచ్చే పేరు జపాన్... భూకంపాలు తరచుగా వచ్చినా దానికి తగినట్లుగా ఇల్లు నిర్మించుకొని అయినా జీవనం సాగిస్తుంటారు అక్కడి ప్రజలు... అయితే ప్రకృతి విలయం అనేది ఎవరి చేతిలోనూ లేదు... కానీ ఈ అను రియాక్టర్లు, రేడియో ధార్మికత మొదలైన వాటి మాటేమిటి? ఇది కూడా ప్రకృతి ప్రసాదించిన సమస్యేనా? కాదు... కూర్చున్న కొమ్మనే నరుక్కొన్న రీతిగా మానవులు తమ జాతిని తామే నాశనం చేసుకోవడానికి అభివృద్ధి పేరుతొ చేస్తున్న వికృత చేష్టలు... ఎక్స్ రే, సెల్ ఫోన్స్, ఇలా మన నిత్య జీవితం లో అతి సాధారణం గా వాడే వస్తువులు, మన ఆయుషును తగ్గించే స్లో పాయిజన్ లాంటివని తెలిసి కూడా మనం రసాయనాల పైన, ఎలెక్ట్రానిక్స్ పైన, ఆధార పడి బతక వలసి వస్తుంది... కరెంటు ను ఉత్పత్తి చేయడానికనో లేక వేరే దేశం మన పైకి వస్తే అడ్డుకోవడానికని ఆత్మా రక్షణ గానో, అణు ఆధారిత పదార్థాలను నిలువ చేస్తూ వుంటున్నై ప్రస్తుత దేశాలన్నీ... మరి ఈ వైజ్ఞానిక ఆవిష్కరణలు మానవ జాతి అభివృద్ధికి వీలైనంత తోడ్పాటు అందిస్తున్నపటికీ ఖర్మ కాలితే మాత్రం భస్మాసుర హస్తలుగా మారి, ప్రస్తుత జపాన్ పరిస్తుతులను కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది... కేవలం "ఆన్" చేయడానికే కాదు... అవసరం లేనప్పుడు "ఆఫ్" చేయడానికీ ఒక స్విచ్ ఉండాలి కదా.. మరి జనాల ప్రాణాలను గాలి కి వదిలేసి ఉపయోగం తో పోలిస్తే హాని చాల తక్కువ అని మభ్య పెట్టకుండా, హాని చేయని విధంగా, కనీసం తక్కువ హాని చేసేటట్లుగా మన శాస్త్రవేత్తలు ఆలోచన చేస్తే బాగుంటుంది... అలాగే ప్రభుత్వాలు తమ వంతుగా, సమస్య వచ్చినప్పుడు హెలికాప్టర్ లలో ఏరియల్ సర్వే లు చేయడం కాకుండా.. ముందుగానే ఏమి చేయాలో ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకొనే తట్లుగా ఏర్పాట్లు చేయాలి... ప్రజలు కూడా ఎక్కడ స్తలం దొరికితే చాలన్నట్లుగా కాకుండా, కొద్దిగా ముందు వెనుకలు అలోచించి ఇళ్ళ ను ఏర్పాటు చేసుకోవాలి... ఇలా ఎందుకంటున్నానంటే హైదరాబాద్ లో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం వూరి మధ్యలో ఉన్నట్లు... కాని అది నిర్మాణం జరిగే సమయానికి వూరి చివరనే ఉండి వుంటుంది... ఎయిర్ పోర్ట్ కట్టాక చుట్టూ ఇల్లులు నిర్మించు కొన్నారు... ఇప్పుడు శంషాబాద్ కూడా అంతే... ఇలా ఎయిర్ పోర్ట్ ప్రకటన చేసారో లేదో ... అలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దాని చుట్టూ పక్కల స్థలాలను ప్లాట్ లు గా అమ్మేయడం ప్రారంభించారు... జనాలు కూడా కొనటం ప్రారంభించారు... మళ్ళీ దాని వాళ్ళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎయిర్ పోర్ట్ మీద నిందలు వేయడం... ఇది ప్రజల ఆలోచన రాహిత్య ఫలితమే కదా..
మన ప్రయత్నాలు ఎంత చేసినా, సమస్య వచ్చిందంటే ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు... ఏదైనా ప్రకృతి తో మాత్రం మనం ఆట లాడు తున్నాం... అది యెంత ప్రమాదకరమైనదో ఇలాంటి సమయాల్లోనే మనకు అనుభవం అవుతూ వుంటుంది... కాని గతం నుంచి, లేదా మరొకరి అనుభవాల నుంచి గుణపాఠం నేర్చు కోవటం మనకు అలవాటు లేదు కదా... ఈ ప్రాణాలు ... నలుగురితో పాటు నారాయణ ... అన్నట్లు పోవలసిందే...
బై
మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి