22, మే 2011, ఆదివారం

సరదాగా కాసేపు...

నేను చదివిన, నాకు నచ్చిన కొన్ని జోక్స్...
మరో చరిత్ర (ఇది ఒక విషాద ప్రేమ గాధ)
అనగనగా ఒక ఊరిలో ఒక కోడి, దోమ ఒకదానితో ఒకటి ప్రేమలో పడ్డాయి... రెండూ కలసి ఒక ఇంగ్లిష్ సినిమాకి వెళ్ళాయి... అందులో హీరో హీరోయిన్ ల రొమాంటిక్ సీన్ చూసి మూడ్ వచ్చి ఒకదాని నొకటి ముద్దు పెట్టుకొన్నాయి...
తరువాతి సీన్ లో ... పాపం రెండూ చచ్చి పోయాయి... కోడి డెంగ్యువచ్చి చనిపోతే, దోమ బర్డ్ ఫ్లూ తో చని పోయింది...
రెండు నిముషాలు మవునం పాటిద్దామా...
ఇంకో చరిత్ర (ఇది ఓక విచిత్ర ప్రేమ గాధ)
ఒక పిచ్చాసుపత్రి ని సందర్శిస్తూ ఒక మంత్రి "రాధ" రాధ..." అంటూ గంతులేస్తున్న ఒక వ్యక్తిని గురించి అడిగాడు డాక్టర్ ను ఆసక్తిగా.. "ఏమైంది ఇతనికి... ఎవరా రాధ"
డాక్టర్ చెప్పాడు..."రాధ అనే అమ్మాయిని ఇతను ప్రేమించాడు సర్... ఆమెతో పెళ్లి కాక పోవడంతో ఇలా పిచ్చి వాడయ్యాడు..."
కాస్త దూరం పోయాక మరో వ్యక్తీ "రాధ... హు.. రాధ... హు..."అంటూ సూన్యం లోకి చూస్తూ గొణుగుతున్నాడు... వెంటనే మంత్రి డాక్టర్ వైపుకి తిరిగి అడిగాడు...."ఇతను కూడా ఆ రాధ అనే అమ్మాయినే ప్రేమించాడ?'
"లేదు సర్" చెప్పాడు డాక్టర్...
"ఇతను ఆ రాధను పెళ్లి చేసుకున్నాడు..."
రాణి గారను కున్నా! (ఇదో మల్లాది మార్కు జోకు)
ఓక రాజు గారికి ఆస్తానం లోని విదూష కుని మీద ఎందుకో కానీ గోప్ప్హ కోపం వచ్చేసింది..అలవాటు ప్రకారం మరణ దండన విధించారు... విదూషకుడు లెగ్స్ అండ్ ఫింగెర్స్ పడి (ఐ మీన్ కాళ్ళా, వెళ్ళ) బ్రతిమాలినా రాజు గారు కరగలేదు... కాని ఓక ఛాన్స్ ఇచ్చారు.. "సరే... నీకు ఓక అవకాశం.. నువ్వు ఓక పని చేయాలి... అందు వాళ్ళ నాకు విపరీతమైన కోపం మరియూ ఆశ్చర్యం ఒకేసారి రావాలి... ఎందుకు ఈ పని చేసావని అడిగితె వచ్చే సమాధానం ఇంకా కోపం మరియూ ఆశ్చర్యం కలిగించేది ఉండాలి..."
వెంటనే విదూషకుడు రాజు గారి నడుం మీద గట్టిగా గిల్లాడు...
సడన్ గా విదూషకుని పనికి రాజు గారు ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు... తేరుకొని కోపంగా ప్రశ్నించారు... "ఎందుకు చేసావీ పని... రాజు అయిన నాతో..."
వెంటనే విదూషకుడు అమాయకంగా మొహం పెట్టి అన్నాడు...
"క్షమించండి... మహారాజా... మీరనుకోలేదు...." .... "రాణి గారనుకొన్నా"
తిక్క కుదిరింది...
అప్పారావు హడావుడి గా వచ్చి సుబ్బారావు తో అంటున్నాడు..."ఒరేయ్... ఆ మధ్య మన శీను గాడు... గోదాట్లో పడి న ఓక అమ్మాయిని రక్షించాడు...తెలుసు కదా..."
"ఆ.. తెలుసు ... అయితే..." అడిగాడు సుబ్బా రావు..
"అందుకు కృతజ్ఞత గా మనోడ్ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోండి రా..."
వెంటనే సుబ్బా రావు అన్నాడు..."తిక్క కుదిరింది వెధవకి... ఇంకెప్పుడూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడు..."
సిటి బస్సు... రద్దీలో మిస్సు...
మాలతి అప్పుడే వచ్చిన సిటి బస్సు ఎక్కింది... మామూలుగానే బాగా రద్దీ గా ఉంది ... ఆడా, మగా, ముసలీ, ముతకా, చిన్న, చితకా.. అనే తేడ లేకుండా... అంతా ఒకరినొకరు హత్తుకొని మరీ తమ తమ గమ్య స్తానానికి బస్సు ఎప్పుడు చేరుతుందా అని ఎదురు చూస్తూ ప్రయాణం చేసేస్తున్నారు... మాలతి చచ్చీ, చెడి, లోపలకు దూరి నిలుచుంది... ఇంతలో కాండుక్టర్ దగ్గరకు రావడం తో అతి కష్టం మీద ఒక చేతిని కిందకు చేర్చి, హ్యాండ్ బాగ్ జిప్ తెరిచి... చిల్లర కోసం తడిమింది... అందులో ఒక్క పైసా కూడా తగలక పోవడం తో... వెంటనే జిప్ మూసేసి... జనరల్ గా పర్సు దాచే ప్రదేశం లో ట్రై చేసింది... కానీ అక్కడ పర్సు లేదు... మళ్ళీ క్రిందకు చెయ్యి పోనిచ్చి బాగ్ జిప్ తెరిచి లోపల చెయ్యి పెట్టి వెదికింది...
ఇలా రెండు మూడు సార్లు ట్రై చేసింది... కానీ డబ్బులు తగల లేదు... ఇంతలో పక్కన ఉన్న వ్యక్తీ కలుగ జేసుకుంటూ అన్నాడు...
"మేడం... కావాలంటే... మీ టికెట్ డబ్బులు నేనిస్తాను..."
"అంతే కానీ, ఇలా మీరు మాటి మాటికీ నా ఫాంట్ జిప్ ఓపెన్ చేసి కెలకడం ఏమీ బాగు లేదు..."

ప్రస్తుతానికి సెలవ్...
ఇంకా ఉన్నాయి.. గుర్తు తెచ్చుకోవాలి...

మురళి.












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి