27, ఫిబ్రవరి 2014, గురువారం

చిన్న జోక్

బ్లాగ్ మిత్రులకు మహా శివ రాత్రి శుభాకాంక్షలు




పేస్ బుక్ లో నా మిత్రుడొకడు షేర్ చేసి న చిన్న జోక్ మీ కోసం






ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు.

వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు.
వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు.
“ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు.
కాబట్టి మీకు శిక్ష విధించబేయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు

మొదటగా అమెరికన్ వంతు వచ్చింది.
అతను కొద్ది సేపు ఆలోచించి తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు.
కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది.
మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.

తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది.
తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు.
అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది.

తరువాత భారతీయుడి వంతు వచ్చింది.

అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు.
మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.

“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.

నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”

“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు.
సరే నీ రెండో కోరిక ఏమిటి?”
.
.
.
.
.
.
.
.
.
.

“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.”...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి