ఎన్నో ఆశలతో తెలుగు ప్రజలు (ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందామా ?) ఒక అనుభవ శాలి ని ముఖ్య మంత్రి కుర్చీ లో కూర్చో పెట్టారు .. అయితే ఆ కుర్చీని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్తితి ని ఆయన ఎదుర్కొంటున్నారు .... ఏ కాగితం పై సంతకం చేస్తే ఏమి సమస్య వస్తుందో , సంతకం చేయక పొతే ఏ బాధ భరించాల్సి వస్తుందో ... అసలు ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుండి ఎప్పుడు ఎలా వస్తాయో , అసలు వస్తాయో రావో , ఇలా సవాలక్ష సమస్యలు ... ఇవన్నీ మేము అర్థం చేసుకుంటాం ...
కాకపోతే ప్రియమైన ముఖ్యమంత్రి గారు ... మా ఒక్క సమస్యను అర్థం చేసుకోండి ... అది విద్యుత్ కోత సమస్య ... మేము అసలు విద్యుత్ పై కోత విధించ వద్ద ని అనటం లేదు ... అది మీ ప్రభుత్వం కానీ, మరి ఏ ప్రభుత్వం కానీ చేయలేనిదని మాకు తెలుసు ... ఎందుకంటె వాడని కరంట్ కు కూడా బిల్లులు చెల్లించిన ఘన చరిత్ర మాకుంది ...
గత సర్కార్ హయాం లో ఒక కొత్త పద్ధతిని విద్యుత్ శాఖ వారు ప్రవేశ పెట్టారు ... వాడని కరంట్ కు బిల్లు కట్టమనటం , వర్షా కాలం లో కూడా పవర్ కట్ విధించడం ... అబ్బే ... ఇవి మాకు చాల చిన్న చిన్న విషయాలు ... అది కాదు ...
" రాత్రి నిద్ర పోతున్న సమయం లో కరంట్ తీయటం ... "
పగలంతా కరంట్ తీస్తున్నారు ... చెమటలు కక్కుకుంటూ భరిస్తున్నాం ... రాత్రి పది వరకో , పదకొండు వరకో అయితే ఆడుతూ పాడుతూ సమయం గడిపెస్తున్నాం ... పొద్దున్న ఆరు గంటలకే బద్ధకం వదిలించే కార్యక్రమం పవర్ కట్ ద్వార నిర్వహిస్తున్నారు ... సరే ... ఓకే ... అంటూ చెప్పుల్లో కాళ్ళు దూర్చి మార్నింగ్ వాక్ కు పోతున్నాం ... ఆరోగ్యానికి మంచిదే కదా అనుకుంటూ ...
కానీ , నిద్రకు ఉపక్రమించి , కాస్త కునుకు పట్టే సమయానికి , అర్ధరాత్రి ఒంటి గంట దాటాక , నాలుగు గంటల మధ్య ... కరంట్ తీయటం ఏమి న్యాయమో విధ్యుత్ శాఖ వారు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది ...
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తే పవర్ కట్ పై ఏదో ఒక పరిష్కారం చూస్తుందనే నమ్మకం తో INVERTOR కూడా కొనటం మానేశాను ...
కనుక ... దయచేసి ఈ " రాత్రి నిద్ర పోతున్న సమయం లో కరంట్ తీయటం ... " అనే స్కీం ను రద్దు చేసి .. కాదు ... కాదు ... సవరించి ... మమ్ములను బ్రతికించ వలసినది గా సదరు అధికారులను , నాయకులను లేగ్సూ ఫింగార్సూ పట్టుకుని బ్రతిమాలుతున్నాం ... అలా చేయక పోతే ఈ నాయకులకే కాదు ఏ నాయకులకూ కూడా ఓట్లు వేసే వారి సంఖ్య తగ్గిపోయే అవకాసం ఉంది ... ఇష్టం లేక కాదు ... ఈ ఎండలూ , కరంటు వారూ కలిసి కట్టుగా వోటర్ల ప్రాణాలు తీయటం వల్ల ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి