బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ లో సెంచురీ సిప్
రక్షణ మరియు సంపద సృష్టి ఈ రెండూ ఎటువంటి పెట్టుబడి దారుడైనా కోరుకునేవి ...
అయితే రక్షణ కోసం ఇన్సూరెన్స్ మరియు సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయించాలి ...
మరి ఈ రెండు ఒకే చోట దొరికితే ... దాని పేరు బిర్లా సన్ లైఫ్ వారి సెంచురీ సిప్.
సంపద సృష్టి
క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘ కాలం కొనసాగడం వల్ల మంచి రాబడులు పొందడానికి అవకాశం ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయం . మరి దీనిలో రక్షణ అంటే బీమా దీర్ఘ కాలపు పెట్టుబడి దారులకు లభిస్తే, అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్టే కదా ...
రక్షణ
బిర్లా సన్ లైఫ్ లో సెంచురీ సిప్ దీర్ఘ కాలపు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు, నెలవారీ క్రమానుగత మొత్తానికి 100 రేట్ల వరకూ బీమా రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు ...
ఈ అవకాశం ఎవరికీ మరియు ఎలా ?
ప్రతి నెలా ఖచ్చితంగా క్రమం తప్పకుండా, మర్చి పోకుండా సిప్ చేయాల్సిందే ... కానీ 45 సం . లోపుగా అయితే ప్రమాద బీమా మాత్రమే వర్తిస్తుంది ... మొదటి సంవత్సరం లో అనుకోని సంఘటన జరిగితే నెలవారీ వాయిదా కు 10 రెట్లు బీమా లభిస్తుంది ... అదే రెండవ సం. లో 50 రెట్లు ; మూడవ సంవత్సరం లో లేదా తరువాత నుండి అయితే 100 రెట్లు బీమా మొత్తం నామినీ కి లభిస్తుంది ... ఫండ్ విలువ తో పాటుగా ...
ఇందు కోసం పెట్టుబడి దారుడు సి సిప్ లో ఎన్ రోల్ చేసుకొనవలసి ఉంటుందిది మరియు "Declaration of Good Health " ఇవ్వ వలసి ఉంటుంది
మరిన్ని మరియు ఖచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలో గల బిర్లా సన్ లైఫ్ అడ్వైజర్ ను సంప్రదించి, ముందుకు సాగండి ...
మురళి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి