షేర్ మార్కెట్ లో తిరుగాడే వారికి ముఖ్యమైన నెలలు ఉంటాయి కొన్ని ... జనవరి, ఏప్రిల్... అందులో ముఖ్యమైనవి . ఎందుకంటే కంపెనీల రిజల్ట్స్, వ్యక్తిగతంగా సెంటిమెంటల్ గా నిర్ణయాలు తీసుకోవడం, ప్రారంభ శపధాలు చేసుకోవడం ... ఇలా అన్న మాట ... నేనూ అందుకు అతీతుణ్ణి కాదనుకోండి ... "ఈ నెల నుండి ఖచ్చితంగా ఇలా చేయాలి ... అనుకోవడం ... నాలుగురోజుల తరువాత ... అనుకున్న దానిని బ్రేక్ చేసేయడం " మనకు చాలా మాములు విషయాలు ... ఆర్ధిక క్రమ శిక్షణ అనేది ... తాత్కాలిక భయాందోళనలకు ప్రభావితం కాకూడదు ... దీర్ఘ కాలం మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది ... తక్కువ కాలం లో మంచి ఫలితాలు లభిస్తే అది మన అదృష్టం అనుకోవాలంతే ... ఫలితాలు ఎలా ఉన్నా ముందుకు పోవాలి ...
ఇక ఈ నెల మల్టీ బ్యాగర్ స్టాక్స్ ...
పనామా పెట్రోలియం లిమిటెడ్
డిష్ మాన్ ఫార్మాసిటికల్స్ & కెమికల్స్
సెంచురీ ఏంకా లిమిటెడ్
HIL లిమిటెడ్
ఈ 2017-18 ఆర్ధిక సంవత్సరం మన ఆర్ధిక పరిస్థితుల్లో పురోగతిని కలిగించాలని కోరుకుంటూ ...
సెలవ్
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి