11, ఆగస్టు 2017, శుక్రవారం

ట్రేడింగ్ విత్ కొల్లేటరల్ అమౌంట్

ఈ సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది ... మనం కొన్న చాలా స్టాక్స్ కు (అన్ని స్టాక్స్ కాదు ) కొల్లేటరల్ ఫెసిలిటీ ఉంటుంది ... అంటే మన  ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బు లేకున్నా, మనకు స్టాక్స్ కొనుక్కునే అవకాశం ఉండటం. 

అందుకోసం Buy చేస్తున్నప్పుడు డెలివరీ బదులుగా T - 5 ఫెసిలిటీ యూజ్ చేసుకోవలసి ఉంటుంది .   అంటే బయ్ చేసే స్టాక్స్ బయ్ చేసిన రోజు నుండి 5 రోజుల లోగా అమ్ముకోవాల్సి ఉంటుంది .   ఒకవేళ అమ్ముకో లేకపోతే ఆటోమేటిక్ గా ఆ ఐదో రోజున ఏ ధర ఉంటుందో ఆ ధరకు బ్రోకర్ అమ్మేయడం జరుగుతుంది.  

చిన్న ఉదాహరణతో ముగిస్తాను ... ఇంతకు ముందు చెప్పినట్టు "వీలైతే ఇంట్రా డే .. లేకపోతే డెలివరీ " పధ్ధతి లో కొన్న రోజునే అమ్ముకోవడానికి వీలు లేని స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఉంచేస్తాం కదా .. ఆ స్టాక్స్ మనకు కావలసిన ధర రానంత వరకు మన డీమ్యాట్ అకౌంట్ లోనే ఉంటాయి .. వాటి మీద మనకు 5 రోజుల వరకు అప్పు ఇస్తారన్నమాట .  అంటే మన అకౌంట్ లో డబ్బు లేకపోయినా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటి ని ఉపయోగించుకొని ట్రేడింగ్ చేయవచ్చు .  అయితే ఈ ట్రేడింగ్ లో లాస్ రాకుండా ట్రేడ్ చేయాలంటే, మన స్టాక్స్ కొనుగోలు ధర కన్నా, స్టాక్స్ ధర ఎక్కువగా ఉంటె సేఫ్ గ ట్రేడింగ్ చేయవచ్చు .  అంటే ఒక లక్ష రూపాయల తో స్టాక్స్ కొన్నామనుకుంటే , వాటి ధర ఏ లక్షన్నరో ఉంటె ఇటువంటి ట్రేడింగ్ చేయడం సేఫ్ .  లేక పోతే కొద్దిగా రిస్క్ . 

సో 
హ్యాపీ ఇన్వెస్టింగ్ 

మురళి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి