5, జూన్ 2020, శుక్రవారం

షేర్స్ లాంటి మ్యూచువల్ ఫండ్ లు ... ఈ టీ ఎఫ్ ... లు ... కరెక్టేనా సార్... ???

ఈ మధ్య అసలు బ్లాగ్ లోకి ప్రవేశించడం గగనమైపోయింది ... నేనేనా ... లేక చాలమంది ... కూడానా ?  కారణం ఏమై ఉంటుందంటారు ... ?  ముఖ్య కారణం నాకైతే స్మార్ట్ ఫోన్స్... పేస్ బుక్, టిక్ టాక్స్, ఫోన్ లోనే యు ట్యూబ్ లలో బోలెడంత ఎంటర్టైన్మెంట్ ... ఇన్ఫర్మేషన్ ... చాలా ... చాల .. చాలా ... గూగుల్ లో సెర్చ్ కొడితే చాలు ... కావలసినంత కాలక్షేపం ... చాల ప్రశ్నలకు జవాబులు ...  ఈ బ్లాగ్ లో ఏదైనా టైపు చేయాలంటే ... ప్రత్యేకంగా నెట్ ఉన్న కంప్యూటర్ కావాలి ... ఎక్కడికి కావలిస్తే అక్కడకు మోసుకు పోయే స్మార్ట్ ఫోన్స్ ఉండగా ... కంప్యూటర్ దగ్గర ఎక్కడ కూర్చుంటాం ... ఏదో ఆఫీస్ లో పని లేనప్పుడు మాత్రం తప్ప ... ??? 

అందులోకి మనం ఎక్కువగా చర్చించేది స్టాక్ మార్కెట్ గురించి.. ప్రస్తుత పరిస్థితుల గురించి ... ఇవన్నింటిని స్మార్ట్ ఫోన్స్, వాటిల్లో  నెట్స్,  సోషల్ మీడియా ... వీడియో లైసెన్స్ కవర్ చేసేస్తున్నాయి కదా .. మన బ్లాగ్ డిస్కషన్స్ ఎవరికీ కావాలి. 

సరే ... ఎలాగూ బ్లాగ్ ఓపెన్ చేసాం కదా ... కబుర్లాడుదాం... 

నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎదుర్కోని పరిస్థితులను ఈ మధ్య ప్రపంచమంతా ఎదుర్కొంది ... ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉంటుంది ... అదే ... కరోనా ది గ్రేట్ ... లాకప్ అంటే భయపడే జనం ... లాక్ డౌన్ మాట తో వణికిపోతున్నారు ...  పొయ్యి కిందికి ... పొయ్యి మీదికి ఉండే వాళ్లకు ఈ కరోనా మంచి విశ్రాంత  జీవితాన్ని ఇచ్చింది ... కానీ రెక్కాడితే కానీ డొక్కాడని సగటు మానవునికి మాత్రం ఎన్నో పాఠాలు ... గుణపాఠాలు నేర్పింది.. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ గ ఎలా పడితే ఆలా ఉండే సగటు భారతీయుడికి సైనిక క్రమశిక్షణ ని రుచి చూపించింది ... ముఖానికి గుడ్డలు, మాటిమాటికి చేతులను సబ్బులతో, రుద్దుకోవడాలు ... మనిషికి మనిషికి మధ్య సామజిక దూరం ... కానీ కుటుంబ సభ్యుల మధ్య తగ్గిన దూరం ... ఎప్పుడూ కలవని ఇరుగు పొరుగు వాళ్లతో కబుర్లు .. ఆటలు , పాటలు ... ఆఫీస్ టెన్షన్ లేని ప్రశాంత జీవితం ... కొందరికి తప్పని డ్యూటీలు ... మరికొందరి ఇంటి నుండి పని పథకాలు ... బహుశా ... న భూతొ న భవిష్యత్ అనుభవం ... అదేనండి .... అబ్బబ్బబ్బబ్బా ఈ ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ... నెవర్ ఆఫ్టర్ ... 

సరే ... ఇక మార్కెట్ కబుర్లు ... ఇంకెక్కడి స్టాక్ మార్కెట్ ... ఉన్న డబ్బులు కాస్త పొట్టలోకే సరిపోయాయి ... ప్రస్తుతం ఖాళీ ... ఎస్ బ్యాంకు దెబ్బకు ... కరోనా తోడై ... ఖజానా కాళీ అయింది ... అప్పులు చెప్పులతో వెంటపడుతున్నాయి ... రేపెప్పుడో మనం ఛస్తే మన కుటుంబానికి ఉపయోగ పడాలని కడుతున్న జీవిత భీమా పాలసీలు ... మనం బతికుండగా పనికి రావని అర్ధం అయ్యేట్టు చేసిన కరోనా ... మనిషి ఈ రోజు నుండి రేపటికి చేసే ప్రయాణం మధ్యలో ... కూడా ఒక జీవితం ఉంటుందని ... దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పినట్టయ్యింది .  

మరి ఏమిటి ... మనం డబ్బు సంపాదించినా పోగొట్టుకున్నా ... ప్రాణం పోయేవరకు ప్రయోగాలూ మానం ... పరిశోధనలూ మానం .... అందుకే ఒకపక్క స్టాక్ మార్కెట్ లాస్ కి, సమాధానం చెప్పేలా ... మరోపక్క సాంప్రదాయ పొదుపు పద్ధతులకు గౌరవం ఇచ్చేలా... ఎప్పటికో మనం చచ్చాకో.. చావడానికి ముందో తప్ప ఉపయోగపడని జీవిత భీమా లకు చెక్ చెప్పేలా ... తప్పని సరి పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తే ... ఖర్మ కాలి లాభం రాకపోయినా .. తక్కువ నష్టాన్ని ... అదృష్టం బాగుంది సంవత్సరం అంత ఉంచుకోగలిగితే ఖచ్చితంగా కనీసం 10-20 శాతం మించి రిటర్న్స్ వచ్చే దారిని కనుగొన్నాను ... అది మరేమిటో కాదు ... బంగారం .... 

వార్ని ... ఇంత సోది చెప్పి నువ్ చెప్పే పరిష్కారం ఇదా ... ఇది మాకు తెలియదా ... అంటారా ... ఇది ఫిజికల్ గోల్డ్ కాదు ... మరి ... గోల్డ్ ఫండ్సా ... గోల్డ్ బాండ్స్ నా ... కమొడిటీసా ... ఇవేవి కాదు ... గోల్డ్ ఈ టి ఎఫ్ లు ... ఓస్ ... ఇవి మాకు తెలియవా అంటారా ... తెలిస్తే మంచిదే ... అసలు తెలిసిన వారికీ నేను చెప్పేదేముంది ... తెలియని వారికీ కదా నా నస కావలసింది ... 

సరే ... నాకు తెలిసిన గోల్డ్ ETF కహాని చెబుతాను ... వీలయితే గమనించండి ... 

ఈ టి ఎఫ్ ... అంటే ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ ... అంటే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే ... అంటే కొన్ని షేర్స్ గుంపు అన్నమాట ... కాకపోతే తేడా ఏమిటంటే ... ఈ. టి. ఎఫ్ లను మాములు షేర్స్ లా ట్రేడింగ్ చేయొచ్చు ... చార్జెస్ షేర్స్ కు వర్తించేవే ... అంటే ఇంట్రా డే.. డెలివరీ అన్నీ షేర్స్ లాగానే ... కాకపోతే ఒక షేర్ .. కాదు ... ఎన్నో షేర్స్ గ్రూప్ ... మరి ఈ గోల్డ్ ఈ. టి. ఎఫ్. ఏమిటి ?

మనం బంగారం సాధారణం గా అమ్మడానికి కొనం .. కానీ ఈ డీమ్యాట్ బంగారం ... అమ్మడానికి కొంటాం ... ఒకసారి గమనించండి ... బంగారం ఈ టి. ఎఫ్ ఏదైనా కాస్త కాస్త తగ్గటం తప్ప సంవత్సరం మొత్తానికి చూసుకుంటే పెరగడమే తప్ప తగ్గడం మాములు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఈ.టి.ఎఫ్ ల లా ఉండదు ... 

ఉదాహరణకు "నిప్పన్ ఇండియా ఈ. టి. ఎఫ్. గోల్డ్ బీస్ " ను చెక్ చేయండి ... జూన్ 6, 2019 లో దీని ధర రూ 28. 95 పై  .  నెల తరువాత రూ .. 29. 95 పైసలు ... అలా పెరుగుతూనే ఉంది ... అలా రూ .45 /- కు చేరింది ... ఇప్పుడు దీని ధర రూ . 41 దగ్గర ... అంటే దగ్గర దగ్గర గా 50 శాతం పెరిగింది ... మరి తగ్గదా ... బంగారం కదా ... తగ్గుతుంది ... మరలా పెరుగుతుంది ... అపూర్వమైన రాబడి ఇవ్వదు ... అలాగని స్థిరమైన రాబడీ ఇవ్వదు ... కానీ ఖచ్చితమైన రాబడి కనిపిస్తోంది ... ఈ. టి. ఎఫ్ ల లోనే నిఫ్టీ ఈ. టి. ఎఫ్. , బ్యాంకు నిఫ్టీ ఈ.టి.ఎఫ్ .. గూగుల్ , పేస్ బుక్ లాంటి ఇంటర్నేషనల్ స్టాక్స్ తో కూడిన ఈ టి ఎఫ్ ... భారత్ 22 ఈ టి ఎఫ్ ... , నిఫ్టీ జూనియర్ ఈ టి ఎఫ్ .. ఇలా చాలా ఉన్నాయి ... షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఈ టి. ఎఫ్ లతో పాటు ఈ గోల్డ్ ఈ టి ఎఫ్ లను కూడా గమనించండి .. బాగున్నాయని నమ్మకం కుదిరితే ఇన్వెస్ట్ చేయండి ... కనీసం సంవత్సర కాలం ఉండేలా ... చూసుకొనవసరం లేకుండా ఖచ్చితమైన 15 శాతం రాబడులను అందిస్తాయని నా అంచనా ... మధ్యలో ఒక వేళ తగ్గితే మళ్ళీ కొనుక్కొంటూ ఉంటె .. లాభాల శాతం పెరిగే అవకాశం ఉంటుంది ... 

ఒకే నా మరి ... ఒకవేళ ఇందులో ఏమైనా మార్పులు మీకు తెలిస్తే ... మీ అభిప్రాయం చెప్పండి 

బై 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి