అందరికి నమస్కారం ...
ముందుగా అందరికి భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ శుభాకాంక్షలు
చాలా కాలానికి బ్లాగ్ లోకి వచ్చాను. చాల సంఘటనలు జరిగిపోయాయి ఈ మధ్య. వాటిల్లో కరోనా ఒకటి. మూడు సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెడుతోంది మనల్ని. అయినా మనం ఏమీ నేర్చుకోవట్లేదు ... పోయిన ప్రాణాలు పోతున్నాయి ... వున్నవాళ్లు ముసుగులు వేసుకుని మామూలుగానే జీవితాన్ని గడిపేస్తున్నారు... తప్పదు కదా ! రోగంతో ప్రాణం పోతున్నదని, బ్రతికే మార్గం వదలలేము మరి.
సరే మరి ... ఏమిటి స్టాక్ మార్కెట్ అప్ డేట్స్ ... ఈ మధ్య బోలెడన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ... టెలిగ్రామ్ ఛానల్స్ ... వెబ్ సైట్స్ ... టీ వి ఛానెల్స్ ... ఫేస్ బుక్ లో కూడా వదలకుండా స్టాక్ మార్కెట్ గురించి సలహాలు ఇచ్చేస్తున్నారు. నేను జనరల్ గా స్టాక్ మార్కెట్ గురుంచి ఈ బ్లాగ్ లో చర్చించే వాడిని. ఇన్ని రూపాల్లో ఇంతమంది చెబుతున్నపుడు నేను చెప్పేది నథింగ్ అనిపించింది. అంతే కాకుండా వాట్స్ యాప్, పేస్ బుక్ లలో పోస్ట్ లు పెట్టడానికి టైం లేదు ... ఇక కి బోర్డు మీద "బి ఏ ఏ జి యు ఎన్ ఎన్ ఏ ఆర్ ఏ ఏ - బాగున్నారా?" అంటూ టైపు చేయడానికి ఓపిక, సమయం ఎక్కడిది
అంతేనా ... ఇప్పుడు బ్లాగ్స్ ఎవరు చూస్తున్నారు ... ఎవరు ఫాలొ అవుతున్నారు ... అందుకే కొద్దిగా బ్లాగ్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ బ్లాగ్ లోకి అంటే ... రావాలని అనిపించింది ... వచ్చాను ... అంతే !
మామూలుగానే కొన్ని స్టాక్స్ కొనడం, కొద్దీ రోజులు హోల్డ్ చేయడం ... పెరుగుతుంటే అమ్మటం ... ఇలా జరుగుతూ వస్తుంది ... ఒక్క వారం క్రితమే బ్యాంకు నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్ చేయడం చేస్తున్నాను ...మొదటి రోజు పది వేలు దొబ్బాయి ... మొత్తానికి వారం రోజుల్లో రికవరీ చేసుకున్నాను ... అది వేరే సంగతి ... అంతే కాదు ... మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి దెబ్బ పడుతుంది ... కొద్దిరోజులు దూరంగా ఉంటాం ... తరువాత మళ్ళీ మాములే... ప్రస్తుతానికి అయితే బండి సజావుగా నడుస్తుంది ... అంతేగా .. అంతేగా ...
బ్యాంక్ నిఫ్టీ రన్నింగ్ వాల్యూ కన్నా ఎక్కువ దగ్గరగా ఉన్న విలువ ధరకు .. వచ్చే వారానికి సంబందించిన కాల్ ఆప్షన్ ఒక లాట్ , ఫుట్ ఆప్షన్ ... ఒక లాట్ ... అమ్మటం లేదా కొనటం చేయాలి ... అమ్మే ధర ఫిక్స్ చేయడం ... ఒకవేళ లాస్ అవుతామని డౌట్ ఉంటె ... తక్కువ లాస్ తో బయట పడటం ... తప్పదంటే మరుసటి రోజుకి ఉంచటం ... సాధ్యమైనంత వరకు అమ్ముకోవటం ... ఇది ప్రస్తుత కార్యక్రమం ... అల్ప సంతోషులం కాబట్టి ... రోజుకి రెండు మూడు వందలు వచ్చినా చాలని సంతృప్త పడుతూ గడిపేస్తున్నా .... ఇది ఇలా లాస్ వచ్చే వరకు ... లేదా డబ్బులు కాస్త అయిపోయే వరకు ....
సరే మరి ... ఉంటా ఇక ...
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి