19, ఫిబ్రవరి 2009, గురువారం

మానవ పరిణామం ...

నిన్న నేను డార్విన్ సిద్ధాంతం మన ప్రాచీన గ్రంథాలలో వుందనే విషయం గురించి రాస్తానని చెప్పాను కదా. విచిత్రంగా ఈ రోజు ఈనాడు పేపర్ లో డార్విన్ థియరీ కి సంబంధించి ఏదో ఆర్టికల్ పడింది... నేనింకా చూడలేదు... కాని, .... తరువాత చూస్తాను... ఇంతలోగా, మనం అనుకొన్న వ్యాసం సంగతి చూద్దాం...
సృష్టిలో ఏర్పడిన తొలి ప్రాణి ... ఏకకణ జీవి... అమీబా... జీవ రాశి అభివృద్ది చెందుతూ, తొలి వెన్నెముక ప్రాణి నీటిలో సంచరించే ప్రాణి ఏర్పడింది... అదే చేప... మన దశావతారాల్లో మొదటిదైన మత్స్త్యవతారం...
రాను, రానూ, నాలుగు చిన్న కాళ్ళ తో, అటు ఇటు కదిలే తల తో కూడిన, నీటిలో మాత్రమె కాక నేలపై కూడా నడిచే తాబేలు ఏర్పడింది... అదే కూర్మావతారం. .... అలా వరాహావతారం... పూర్తిగా నేలపై నడిచే జీవి, అప్పుడప్పుడు తన ముందు జీవి లక్షణాలను చూపిస్తూ, బురదలలో పొర్లుతూ ఉంటుంది... aలాగే నరసింహావతారం ... జంతు లక్షణాలను కలిగిన మానవుని రూపం,... సంపూర్ణ మానవుడుగా మారిన వామనావతారం... నేలనంతా ఆక్రమించి, ఆకసాన్ని ఆక్రమించి, ఆక్రమించదానికి మరో చోటు లేక... సాటి మానవుడి తలపై కాలు మోపి, పాతాళం లోకి పంపించిన వైనం మనకు బాగా పరిచితమే కదా... ఒకడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు... మొదలైన నీతి నియమాలతో కూడిన రామావతారం... కపటాలు నేర్చి, ఒక పురుషుడు ఎంతమంది స్త్రీల తో నైన.. , అలాగే, ఒక స్త్రీకి ఎంతమంది పురుషులైనా ఫరవాలేదని చెప్పిన కృష్ణావతారం...
కాని విష్ణు మూర్తి అవతారాలు పది కాదేమో అనిపిస్తోంది కదూ... బుద్ధుడు విష్ణు అవతారం కాదు, బౌద్ధ మతాన్ని ప్రత్యెక మతంగా వదిలేస్తే హిందూ మతానికి పోటి అవుతుందని... అంతవరకూ హిందూ మతం లో వున్నా లోపాలను సవరిస్తూ బుద్ధుని విష్ణు అవతారంగా మార్చేసారు... అలాగే ఎపుడు వస్తుందో తెలియని కల్కి అవతారం కూడా... మరి వివరంగా పోతే చరిత్ర ని కూడా కలపాల్సి వస్తుంది... అది మరోసారి.....
మురళి.

1 కామెంట్‌:

  1. మన ప్రాచీనులు పరిణామ సిద్దాంతాన్ని పాశ్చాత్యులకంటే ముందే కనుగొన్నారనే విషయం కన్నా మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం. ఈ రోజు ముందుకెళ్ళడమెలాగో ఆలోచించడం మనకు మంచిది.

    రిప్లయితొలగించండి