ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రాచిన గ్రంధాలలో విజ్ఞానం గురించి గాని, పూర్వుల గొప్పదనం గురించి గాని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో నేనీ రాతలు రాయలేదు. తాతల కాలం నాడు తాగిన నేతుల వాసనల ఘుమఘుమల గురించి గోప్పాలను చెప్పుకోవడం కూడా నా ఉద్దేశ్యం కాదు. ఎవరో కనిపెట్టినాక ఇవన్నీ మన గ్రంధాలలో ఉన్నాయని చెప్పుకోవడం కన్నా, మనకు అందుబాటులో గల ప్రాచీన గ్రంధాలను పరిశోధిస్తే ఇంక బయటపడే రహస్యాలు చాలానే ఉండొచ్చు. విదేశీయులు మన భాషలను నేర్చుకొని, మన గ్రంధాలలో విషయాలను ఇంగ్లిష్ లో రాస్తే అవి మనం చదువుకొనే పరిస్తితి లో ఉన్నాం. వేద గణితం అందుకు ఉదాహరణ... అంతే కాదు.. నాకు తెలిసిన విషయాలను కొన్ని నేను వ్రాస్తే, ఇది చదివిన వారికి మరి కొన్ని విషయాలు తెలిసి రాయలనిపించవచ్చు. అలా నాకు మరికొన్ని విషయాలు తెలుసుకొనే అవకాశం వస్తుంది.. తెలుసుకోవాలనుకొనే ఆసక్తి ఉన్నవారికి మరిన్ని విషయాలు తెలుసుకొనే అవకాసం వస్తుంది... గతం కు సంబంధిన విషయాలు మనకు అవసరం లేదనుకొంటే సిలబస్ నుండి హిస్టరీ లాంటి సబ్జక్ట్ అవసరమే మనకు లేదు... కాని మనం తెలుసు కొనేది, గ్రంధస్తం చేసేది మనకోసం మాత్రమె కాదు.. మన భావి తారల వారికోసం కూడా.. ఈ సృష్టిలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఒక వేళ వాటికి సంబంధించిన విషయాలు కూడా, ఈ ప్రాచీన గ్రంధాలలో నిక్షిప్తమై ఉన్నాయేమో... అలాంటి పరిశోధన మనం చెయ్యలేకపోయిన, ఆలోచన అంటూ ప్రారంభమైతే మన తరువాతి వారైన ఆ దిశలో పరిశోధనలు చేయవచ్చు. మనం ఎక్కడున్నాం ? అనే ప్రశ్న చాలా చిన్నది... సమాధానం విశ్వమంతా పెద్దది... మనం ఎక్కడున్నాం అని నిరాశ పడే బదులు మనమేమి చేయగలం అని ప్రశ్నించుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో ! కనీసం మన కోపాన్ని, నిరాశని, ఆవేశాన్ని, అక్షర రూపం లో పెడితే బాగుంటుందని నా ఉద్దేశ్యం... నేను చేస్తుందీ అదే....
మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి