31, ఆగస్టు 2009, సోమవారం

ప్రతినెలా ఇంటర్నెట్ ద్వార రూ. లక్ష సంపాదించండి..

ఏమిటీ? రోజుకు రెండు మూడు గంటలు మాత్రమె పనిచేసి ఇంటర్నెట్ ద్వార నెలకు లక్షలలో సంపాదించాలని లేదా? సంపాదించాలనుకుంటే నా బ్లాగ్ ని చూడమని మనవి. ఒకసారి దీనిలో రహస్యం రాసాక మళ్ళీ ఎందుకు వ్రాశానని అనుకుంటున్నారా? ప్రతీరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, వార్త, సూర్య, ఇలా ఈ పేపర్ ఆ పేపర్ అని తేడా లేకుండా.. అన్ని పేపర్ల లోను, ఎస్.ఏం.ఎస్. ల ద్వారానూ, ఇంటర్నెట్ మెయిల్స్ లోనూ, రోడ్ మీద వెళుతూంటే పంచబడే పంప్లేట్ ల ద్వారానూ, మన మెదడు లోకి డైరెక్ట్ గా ప్రవేశిస్తాయి ఈ ప్రకటనలు... అలా చూసి, చూసీ, నేను కూడా వీటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాను... తరువాత ఏమైందనేది నా బ్లాగ్ లో అల్ రెడీ వ్రాశాను... ఒక్కరే చూశా రది... మిగిలిన వాళ్ళు కుడా చూడాలని మళ్ళీ వ్రాశాను... తప్పైతే క్షమించండి...

29, ఆగస్టు 2009, శనివారం

జస్ట్ స్మాల్ జోక్...

"సర్, ... ఎక్ష్ క్యూజ్ మీ... "

బజార్లో నా దారిన నేను పోతుంటే ఒక కుర్రాడు పిలిచాడు...

"ఏమిటి..." ప్రశ్నించాను నేను....

"ఇక్కడ భోజనానికి హోటల్స్ ఏమైనా ఉన్నాయా దగ్గరలో... నేను ఈ ఊరికి కొత్త"

అనుమానంగా చూసాను... ఎందుకంటె అతను వస్తున్నా దారిలోనే ఒక రెస్టారెంటు ఉన్నట్టు గుర్తు.... అది చూసే వుండవచ్చు అతను... అయినా అడుగుతున్నాడనిపించి అలా చూసానన్న మాట...

మొహం చూస్తె అమాయకంగానే ఉంది...

"మీరు వచ్చిన దారి లో ... ఉంది కదా " చూడలేదా అన్నట్లు అడిగాను...

"అంటే... అది ఫ్యామిలీ రెస్టారెంటు అని రాసి ఉంది కదండీ... మరి నేను బ్యాచిలర్ ను... " సందిగ్ధంగా అడిగాడు...

జోక్ బావుందా....

నవ్వు రాలేదా? సరే!

ఒక సినిమా లో ఇలానే బ్రహ్మానందం ఫ్యామిలీ రెస్టారెంటు అని రాసి ఉంటే వెళతాడు... లోపలికి పోగానే "నాన్న.... చాక లేట్ కొనుక్కుంటా ... డబ్బులియ్యి " అంటూ ఇద్దరు ముగ్గురు పిల్లలు మూగుతారు... ఒకామె వచ్చి "ఏమండీ! ఏమిటి ఇంత లేటు... " అంటూ వేరే దారికి డబ్బులు అడుగుతూ ఉంటూంది... పడక కుర్చీలో ఒక ముసలాయన (సుత్తివేలు) దగ్గుతూ... "ఒరేయ్! మందు లైపోయాయి... తెప్పించు రా..." అంటాడు... ఇలా ఉంటుందీ సీన్...

తరువాత అదే హోటల్ కి మిలటరీ హోటల్ అని బోర్డు ఉంటుంది... బ్రహ్మానందం లోపలికి పోగానే సుత్తి వేలు మిలిటరీ డ్రెస్ వేసుకుని " లెఫ్ట్ రైట్... " అంటూ బ్రహ్మానందం ను నడిపిస్తాడు...

ఏ సినిమాలో సీనో తెలీదు కాని ఈ హోటల్స్ చూస్తున్నప్పుడల్లా ఈ జోక్ గుర్తు వస్తుంటుంది...

ఐడియా బాగుంది కదా!

28, ఆగస్టు 2009, శుక్రవారం

పని చేయకుండా.. నెలకు లక్ష సంపా దించాలని ఉందా?

"ఇంటి వద్ద నుండే రోజుకు ఒకటి రెండు గంటలు మాత్రం పని చేసి నెలకు కనీసం ఇరవై వేలు సంపాదించండి. " అంటూ చాల ప్రకటనలు చూస్తుంటాం. ఆ మధ్య అత్యధిక ప్రజాదరణ కలిగిన న్యూస్ పేపర్స్ కూడా ఇంటర్నెట్ ద్వార వుచితంగా కొన్ని కంపెనీల కు లాగ్ ఇన్ అయ్యి విపరీతంగా డబ్బులు సంపాదించమని వుద్బోదించాయి. ప్రకటనలు చదివితే చాలు డబ్బులు ఇస్తామని కొందరు, టైపింగ్ వర్క్ అని కొందరు, ఆన్ లైన్ సర్వే లని కొందరు, ఇలా చాల రకాలుగా ప్రకటనలు వస్తున్నాయి. సరే... డబ్బులు బొక్క పడితే పడ్డాయి అని నాలుగు వందలు ఖర్చు పెట్టి ఒక సి.డి. తెప్పించాను... కొన్ని కంపెనీల వెబ్ సైట్స్ లిస్టు ఇచ్చారు... ముఖ్యంగా వాటిలో సారాంశం ఎలా వుంటుందంటే మొదట లాగ్ ఇన్ అవ్వాలి... తరువాత శాంపిల్ గా రెండు మూడు ప్రకటనలు ఇస్తారు... వాటిపై క్లిక్ చేస్తే మన ఎకౌంటు లో డబ్బులు "కనబడతాయి". కాని, రిఫరల్ల్స్ ను జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తాయి... మళ్ళీ మనం ప్రకటనలు ఇస్తే మనలాంటి బకరాలు దొరికితే వారికి ఈ సి.డి.అమ్మి లాగిన్ చేయించి వాళ్ళు కూడా క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంట... వాళ్ళిచ్చే వెబ్ సైట్స్ వల్ల ఏం వైరస్ తగల బడ తయో చెప్పలేం... పైగా పే పాల్ ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి.... క్రెడిట్ కార్డు నెంబర్ ఇవ్వాలి... అంత అవసరం వుందంటారా? సరే... తెలియని వాళ్ళు నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి ప్రకటనలను పట్టించుకోకండి... లేదా డబ్బులు వచ్చిన వారు ఎవరైనా వుంటే తెలియ చేయండి... సరేనా? గుడ్ డే....

26, ఆగస్టు 2009, బుధవారం

ప్రజా రాజ్యం పార్టి ఆవిర్భావ దినోత్సవం

ప్రజా రాజ్యం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టి జిల్లా కన్వీనర్ లెఫ్టినెంట్ జాస్తి మూర్తి గారు నగరంలో పలుచోట్ల పార్టి జండాను ఎగురవేసారు. ధవళేస్వరం, శాటిలైట్ సిటీ, గో రక్షణ పేట, పదమూడవ వార్డు, హుకుంపేట మొదలైన పలు ప్రాంతాలలో జండా ఎగుర వేసారు. కార్యకర్తలకు ఈ సందర్భంగా మిఠాయిలు పంచి పెట్టారు. నగరంలో ప్రముఖులైన మేడా గురుదత్త ప్రసాద్, అన్నందేవుల చంటి, వై.శ్రీనివాస్, సుంకర శ్రీహరి, కడియం బాబు, హారిక, నాలా పద్మశ్రీ, సుంకర మధు మొదలైన వారంతా ఆ యా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన వారందరికీ లెఫ్టినెంట్ మూర్తి గారు కృతజ్ఞతలు తెలియ జేశారు. రానున్న కాలంలో పార్టి మరింత బలపడాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు. పార్టి అధినేత శ్రీ చిరంజీవి గారికి, ఇతర రాజకీయ ప్రముఖులకు శుభా కాంక్షలు తెలియ జేశారు.

22, ఆగస్టు 2009, శనివారం

గుడ్ బై టు హైదరాబాద్!

చాల కాలం అయింది బ్లాగ్ లో కి వచ్చి. మొత్తానికి హైదరాబాద్ కి గుడ్ బై చెప్పేసాను... రాజమండ్రి వచ్చేశాను.. ఈ సిస్టం లో తెలుగు రాలేదు ఇంతవరకు... నిన్ననే ఫార్మేటు చేసారు... తెలుగు వచ్చింది... అందుకే ఇది టెస్ట్ అన్నమాట... నాకు ఇష్టమైన వినాయకుని పండగ ముందు రోజున ఇది పని చేయడం నిజంగా నా లక్... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... ఇక రెగ్యులర్ గ బ్లాగ్ లో వుంటూ వుంటాను... ప్రస్తుతానికి బై...
మురళి.