31, ఆగస్టు 2009, సోమవారం

ప్రతినెలా ఇంటర్నెట్ ద్వార రూ. లక్ష సంపాదించండి..

ఏమిటీ? రోజుకు రెండు మూడు గంటలు మాత్రమె పనిచేసి ఇంటర్నెట్ ద్వార నెలకు లక్షలలో సంపాదించాలని లేదా? సంపాదించాలనుకుంటే నా బ్లాగ్ ని చూడమని మనవి. ఒకసారి దీనిలో రహస్యం రాసాక మళ్ళీ ఎందుకు వ్రాశానని అనుకుంటున్నారా? ప్రతీరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, వార్త, సూర్య, ఇలా ఈ పేపర్ ఆ పేపర్ అని తేడా లేకుండా.. అన్ని పేపర్ల లోను, ఎస్.ఏం.ఎస్. ల ద్వారానూ, ఇంటర్నెట్ మెయిల్స్ లోనూ, రోడ్ మీద వెళుతూంటే పంచబడే పంప్లేట్ ల ద్వారానూ, మన మెదడు లోకి డైరెక్ట్ గా ప్రవేశిస్తాయి ఈ ప్రకటనలు... అలా చూసి, చూసీ, నేను కూడా వీటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాను... తరువాత ఏమైందనేది నా బ్లాగ్ లో అల్ రెడీ వ్రాశాను... ఒక్కరే చూశా రది... మిగిలిన వాళ్ళు కుడా చూడాలని మళ్ళీ వ్రాశాను... తప్పైతే క్షమించండి...

2 కామెంట్‌లు:

  1. తేజస్విని గారు, ఇప్పుడే ఈ టాపిక్ గురించి మీరు రాసిన పోస్ట్ చదివాను. ఈ ఊబిలో కూరుకుపోయి సమయమూ, ప్రొడక్టివిటీ కోల్పోతున్న కంప్యూటర్ నిరక్ష్యరాస్యులతో పాటు కొద్దోగొప్పో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారిని తెలిసీ తెలియక రిఫరల్స్ ద్వారా ఈ ఊబిలోకి లాగుతున్న విద్యావంతులనూ చూసి జాలిపడక తప్పదు. ఏదో ఒక రోజు ఇలాంటి వాటిలోని డొల్లతనం ఇలా మోసపోయే ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటారు.

    రిప్లయితొలగించండి
  2. తేజస్విని గారు అందరు చేసే ఉంటారు కాని రిప్లై ఇవ్వలేదు అంతే. అయినా మరో సారి అందరికి గుర్తు చేశారు. Sridharగారు అన్నట్లు ఏదో ఒక రోజు ఇలాంటి వాటిలోని డొల్లతనం ఇలా మోసపోయే ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటారు.

    రిప్లయితొలగించండి