1, సెప్టెంబర్ 2009, మంగళవారం

కొమ్మూరి వేణుగోపాల రావు నవలలో కొన్ని వాక్యాలు...

ఇది కాపీ చేసి పేస్టు చేద్దామంటే కుదరడం లేదు... ఐనా అందరికీ తెలియపరచాలనే కోరికతో వ్రాయాలని పిస్తుంది.. అంతా ఒకే సారి వ్రాయడం నాకు కుదరదు... ఆఫీసు లో టైం మిస్ యూజ్ చేసినట్లవుతుంది... ఈ రోజుకి కొన్ని వాక్యాలు...
"నువ్వసలు దేవుణ్ణి నమ్మవా?"
"దేవుడంటే నాకు అప నమ్మకం లేదు... ఈ సుందరమైన ప్రపంచం, భూమి, ఆకసం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, శక్తివంతమైన టెలిస్కోప్ లో గోచరించే అనేక దృశ్యాలు ... ఆయన వుండే వుంటా డన్ననమ్మకాన్ని కల్గిస్తున్నై... ఏదైనా రూపంలో ఉన్నాడో, అదృశ్య రూపం లో ఉన్నాడో, కాంతి రూపంలో ఉన్నాడో , శబ్ద రూపంలో ఉన్నాడో నిర్వచించ లేను... కాని ఆయన్ని మీలాంటి రకరకాల సిద్ధాంతాలలో మునిగి తేలుతున్న గురుజి లు కాంప్లి కేట్ చేసే పధ్ధతి చూస్తె చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ... "
"దేవుడున్నాడా లేదా అనే ఆలోచన విడిచిపెట్టి మనం నిర్ణయించు కున్న దాన్ని కృషి చేస్తూ వెళ్ళిపోవడం ఉత్తమం... అపుడు మనిషి లో ఆత్మా విశ్వాసం పెరుగుతుంది... ప్రతిదాని కి దేముడి మీద ఆధార పడే మనస్తత్వం పోతుంది.. "
"స్వయం కృషి ఉన్నా దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల ఆ కృషి రాణించ డానికి అవకాసం ఉంది కదా!"
"స్వయం కృషి ఉందీ... దేవుడి మీద విపరీతంగా అమాయకంగా నమ్మకం పెట్టుకున్న వారు కలసిరాకుండా ఆ కృషి వృధా ఐ పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు... ఏదో మొక్కుబడిగా భక్తిని ప్రదర్శిస్తూ అన్నీ కలసి వస్తూ పట్టిందల్లా బంగారం ఐనా వాళ్ళూ ఉన్నారు... "
"మరి పూర్వజన్మ?"
....
మిగిలిన మేటర్ మరోసారి...
ఇంకా వెంటనే చదవాలను కుంటే క్రింది లింక్ లోకి వెళ్ళండి...
మురళి
http://teluguone.com/grandalayam/kathalu/nenu/index.jsp?eno=92

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి