1, అక్టోబర్ 2009, గురువారం

మూడో రోజు... రెండో భాగం

పూర్తిగా వ్రాయకుండానే ... కదిలేశాను... గాంధి జయంతి అని మా వాళ్లంతా విగ్రహానికి దండలేస్తున్నాం వచ్చి మీరూ పాల్గొనండి.. అనే మెసేజ్ రావడం వల్ల... మధ్యలో ఆపేశాను... సరే... ఎంతవరకూ వచ్చాను?
ఆ తెల్ల బట్టల నర్సు నా పాపను ... పండులా మంచి రంగులో ఉన్నా నా పాపను... బొమ్మను తీసుకు పోతున్నట్లు తీసుకుపోవడం... మేమంతా వెనుకే పరుగులెత్తడం... లోపల ఒక ట్రే లో వేశారు... మేము దూరం నుండి చూస్తున్నాం.. డాక్టర్ శుభ్రం చేస్తున్నాడు... లోపలికి రమ్మనగానే వెళ్లి చూశాం.. ఆ ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు తెలీదు... కవి, రచయిత లాంటి లక్షణాలు ఏమి లేవు నాలో... ఏడవనైనా ఏడవకుండా.. పక్కనే వ్రేలాడు తున్న బ్లూ కలర్ క్లోత్ ను పరిశీలిస్తూ ... నా బిడ్డ... నర్సింగ్ హోం రూం లోకి తీసుకు రాగానే పరిసరాలను గమనించ సాగింది... పాలిస్తున్న అమ్మ ముఖం తదేకంగా చూస్తోంది.. ఈమేనా నాకు ఫుడ్ పెట్టేది అని ఆలోచిస్తూ చూస్తున్నట్లుగా అనిపించింది.. వినాయకుణ్ణి పూజిస్తే సరిగ్గా వినాయక చవితి సమయం లోనే పుట్టింది... మరి జన్మ నక్షత్రం ప్రకారం త తో పేరు పెట్టాలని "తేజస్విని" అని నిర్ణయించాం... హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇంటిని పరిశీలించడం... పలకరించే మనుషుల్ని మైండ్ లో రికార్డు చేసుకోవడాని కి అన్నట్లు తదేకంగా కళ్ళల్లో కళ్లు పెట్టి చూడటం... ఇక నాకు తనే ప్రపంచం గా మారింది.. కానీ తను పుట్టిన రెండో నెల లోనే రెండు నెలలు ఆఫీసు పని మీద "మిజోరం" పోవలసి వచ్చింది... ఎక్కడ హైదరాబాద్... ఎక్కడ మిజోరం? అప్పుడే డిసైడ్ అయ్యాను నేను... నా పాప తో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే హైదరాబాద్ లో జరగదని... ఎందుకంటె సిటీ బస్ లో రెండేసి గంటలు ప్రయాణం ప్రొద్దున... సాయంత్రం... ఇలా ఎన్ని రోజులు...? అందుకే ఆఫీసు నుండి ఎక్కువ దూరం లేకుండా... ఇల్లు తీసుకోవాలని... హైదరాబాద్ లో అది కుదర లేదు.. అందుకే వదిలేశాను హైదరాబాద్ ను... ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా వినలేదు.. ముఖ్యం గా నా భార్య తల్లి, అక్కలు బావలు, అన్నదమ్ములు అందరూ ఉండే హైదరాబాద్ వదలడానికి నా భార్య ఒప్పుకోక పోయినా పట్టించుకోలేదు... ఉద్యోగ భద్రత గురించి కూడా ఆలోచించలేదు.. ఒకటే ఆలోచన... ఏం... బ్రతకలేనా? హైదరాబాద్ లో తప్ప ఇంక ఎక్కడైనా? చేయలేనా ఏ ఉద్యోగమైనా... అని.. లక్కీగా రాజమండ్రి లో నా తో కాకినాడ లో హోటల్ జయ లో జాబు చేసిన నా ఫ్రెండ్ రాజమండ్రి లో క్రొత్తగా ఓపెన్ అయిన "రివర్ బె" రేసోర్త్స్ లో జాబు ఉంది... అన్నాడు... ఆ ఛాన్స్ ను వదులుకో దలచు కోలేదు.. అందుకే రాజమండ్రి వచ్చేసా... కాని హైదరాబాద్ లో నా భార్య, వారి కుటుంబం వాళ్ల మూర్ఖత్వం వల్ల చేసిన అప్పులు ఉన్నాయ్... లక్షన్నర దాక... అవి తీరాలి... నా పాపకు మంచి భవిష్యత్ ఇవ్వాలి... రెండు సంవత్సారాలు పూర్తి అయ్యాయి పాపకి... తనకి "క" పలకదు... బదులుగా "త" అంటుంది... ఆ ముద్దు మాటలు, అల్లరి చేష్టలు చూస్తుంటే అనిపిస్తుంది... జీవితం లో ఇటువంటి రక రకాల అనుభవాలు... ఆనంద కరమైన క్షణాలు... ఉండబట్టే ఈ మాత్రం జీవించ గలుగుతున్నమ అని... లేక పోతే ఈ జీవితం ఎప్పుడో బోర్ కొట్టేసేది... కదూ... ఏంటో... న సోది తో మీకు బోర్ కొట్టేసి ఉంటాను... ఎంతో వ్రాయాలని... అనుకున్నాను.. ఏదో వ్రాయాలని అనుకున్నాను... ఏదేదో వ్రాశాను... ఈ రోజుకి ఇంతే...
నిజాని కి పాపా ముచ్చట్లు ఆ షార్ప్ నెస్.. ఆ అల్లరి... అన్నీ వ్రాస్తుండటమే పనిగా పెట్టుకోవలనుకున్నాను... కాని ఏదో డైరీ లో పేజీల్లో వ్రాయాల్సిన సోది ఈ బ్లాగ్ లో వ్రాస్తున్నాను... తిట్టుకోకండి... ప్లీజ్...
మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి