6, అక్టోబర్ 2009, మంగళవారం

విలయం...


ఈ నెలాఖరు ఇంకా అర్థ సంవత్సరపు ముగింపు లెక్కల పనిలో కొద్దిగా బిజి గా ఉన్నాను... నిజానికి ఈ వరదల తాకిడికి కకావికాలైన జన జీవనం, ఊళ్ళన్నీ నీళ్ళ పాలైన వైనం.. చూస్తుంటే ఎటువంటి వారికైనా ఉసూరు అనిపించక మానదు.. క్రిష్ణమ్మకూ, తుంగభద్రమ్మకూ ఎందుకంత కోపం వచ్చిందో కాని, ఆ ఆగ్రహాన్ని తట్టుకొనే విషయంలో ఇంత అభివృద్ది సాధించాం, అంత అభివృద్ది సాధించాం, అని చెప్పుకొనే మానవులు ప్రకృతి ముందు మిగిలిన జీవరాశి తో సమానంగా సరిగ్గా చెప్పాలంటే అంతకంటే దారుణంగా నష్ట పోయారు... ఇటువంటి పరిస్తితులలో ప్రకృతి, మనిషి, అంటూ కబుర్లు చెప్పడం ఎందుకంటారా? ఒక వైపు వరదల భీభత్సానికి కోట్లాది విలువైన ఆస్తులు నాశనమైపోతుంటే, ఇదే అదనుగా స్వైర విహారం చేస్తూన్న దోపిడీ దొంగలు, ఒకరి మీద ఒకరు బురద చల్లుకొనే ప్రయత్నాలు, మరో పక్క దొరికిందే తడవుగా దోచుకుందాం అని ధరలు పెంచి లాభ పడదామనుకునే వ్యాపారస్తులు, చందాల రూపం లో వసూలు చేసి, అందులో ఎంతో కొంత బాధితులకిచ్చిమిగిలింది నోక్కేద్దమను కొనే సంకుచిత స్వభావులు, పది రూపాయల ఆహారపు పొట్లాలు కట్టించి, వంద రూపాయల బిల్లులు సృష్టించి శవాల మీద డబ్బులు ఏరుకొనే వారిలా, అంతకంటే దారుణంగా దోచుకుందామని సిద్ధపడే ప్రభుత్వ అధికారులు... ఇంత ప్రళయం వచ్చి మానవ జాతి ఒక పక్క నాశనం అవుతుంటే, మరోప్రక్క దీనినుంచి ఎలా లాభ పడవచ్చో ఆలోచించే, ... మా నవ జాతి... దేవుడా... ఇంకేం చెప్పను?

సరే... నేను మాత్రం చేస్తున్నదేమిటి కాని... ఈ సెప్టెంబర్ జీతంలో ఒక రోజు జీతాన్ని (మా స్టాఫ్ అందరితో పాటు) విరాళంగా ఇస్తున్నా... నయం .... ఈ గోదావరి పొంగిందంటే నేను కూడా పరుగులేత్తాలి... అది ఎప్పుడో ఒకప్పుడు తప్పనిదని తెలుసు... కాని దూరంగా పోలేము కదా...

బాయ్...

మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి