12, అక్టోబర్ 2009, సోమవారం

టాంత్ లాల ... బై తేజస్విని...

ఇది మొన్న ఆదివారం నాటి సంగతి. ఆ రోజు మా తెజును తీసుకొని పుష్కర్ ఘాట్ కి వెళ్లి, గట్టు వెంబడి పి.వి.ఆర్. పార్క్ వైపు వెళుతున్నాను. అక్కడ వాటర్ ట్యాంక్ లారీలు వరసగా ఉంటాయి. కొన్ని టాంకర్లు ట్రాక్టర్స్ కు అట్టాచ్ చేయబడి ఉంటాయి కదా.. ఐతే అక్కడ ట్రాక్టర్స్ కు అట్టాచ్ కాకుండా కేవలం టాంకర్లు మాత్రమె ఉన్నాయి. మా పాప లారి టాంకర్ లను చూపించి "టాంత్ లాల" అంటుంది.. (వీధిల్లో కుళాయిలు రానప్పుడు వాటర్ టాంకర్లు రావడంజనాలు వాటి వెనక బిందెలు పట్టుకుని పరిగెట్టడం చూసింది లెండి...) ఐతే ట్రాక్టర్ అట్టాచ్ చేయని టాంకర్ లను ఏమనాలో తెలియలేదు... కాని ఆ విషయం నాకు చెప్పాలి... కాసేపు ఆలోచించి చెప్పింది "అత్తడ (అంటే అక్కడ అని అర్థం చేసుకోగలరు) ముతం లేని (మొహం మీద బుల్లి చేతులు పెట్టి చూపిస్తూ) టాంత్ లాల (ముందే చెప్పాను కదా... తనకు "క" పలకదు... అందుకు బదులుగా "త" అంటుంది) ఉంది.." కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు... అర్థం అయ్యాక ఆశ్చర్యం అనిపించింది... మనసులో ఉద్దేశ్యాన్ని బయటకు చెప్పడానికి అదీ మనకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ఆలోచించి, ఇంజన్ లేని వాహనం గురించి చెప్పడానికి తను ఉపయోగించిన ఉదాహరణ... ఇలాంటప్పుడే అనిపిస్తుంది "వీళ్ళు పిల్లలా...పిడుగులా" అని. అందుకే ఐదు సంవత్సరాల వరకూ స్కూల్ వైపుకి వెళ్ళని కాలం పోయి మూడు సంవత్సరాలకే స్కూల్ కి పోయే కాలం వచ్చింది... అంతేనా... సిలబస్ లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు... (వాటితో పాటు ఫీజు లు కూడా)... మళ్ళీ మరోసారి...
మురళి.

1 కామెంట్‌: