16, డిసెంబర్ 2009, బుధవారం

జై సమైఖ్యాంధ్ర...

ఈ మధ్య నెట్ సరిగ్గా పని చేయడం లేదు... అందుకే ఇంత గొడవగా ఉన్న ఏమీ వ్రాయలేకపోయాను... మా ఆవిడ, మా తేజస్విని తెలంగాణా లో (హైదరాబాద్) ఉండిపోయారు... నేనేమో ఇక్కడ ఆంధ్ర లో ఉండిపోయాను. రాత్రి కి రాత్రి తెలంగాణా ప్రకటించేసి నట్టుగా... ఆంధ్ర తెలంగాణా వేర్వేరు రాష్ట్రాలుగా చేసేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి పోవాలని రూల్స్ పాస్ చేసేస్తారేమో... అప్పుడు నువ్వక్క డుంటే, నేనిక్క డుంటే... ప్రాణం విల.. విలా... అంటూ పాటలు పాడుకోవాలి... ఇలా ప్రత్యెక ఆంధ్ర, ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాద్, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, ..... అంటే బ్రిటిష్ కాలానికి ముందు... ఊరుకు ఒక సంస్థానం ఉన్నట్టుగా... కురుపాం సంస్థానం, బొబ్బిలి సంస్థానం, విజయనగరం సంస్థానం, రాజం, రాజమహేంద్రవరం, పిఠాపురం సంస్థానం, .... ఇలా అన్నమాట... అంతకు ముందు ముక్కలు ముక్కలుగా ఉన్న భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్లకి అప్పగించాం... ఇప్పుడు ఏ అమెరికా వాడికో అప్పగిస్తాం... చరిత్ర పునరావ్రుత్త మవుతుందంటే ఏంటో అనుకున్నాను... ఇలాగే నన్న మాట ... అమ్మో ... అర్జెంటు గా హైదరాబాద్ సంస్థానానికి .... అదే... హైదరాబాద్ నగరానికి వెళ్లి, తెలంగాణా రాకముందే మా పాపను తెచ్చేసుకోవాలి... (ఇదే అవకాసం నాకు.. మా ఆవిడను వదలి వచ్చేస్తా...)
జై సమైఖ్యాంధ్ర...
మురళి.

3 కామెంట్‌లు:

  1. తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంద్ర ముద్దు ! అనే దిక్కుమాలిన ఉద్యమం ప్రారంభించ బడ నంత వరకూ ఆంద్ర వాళ్ళంటే తెలంగాణా వాళ్ళ కంటే తెలిగాల్ల వాళ్ళనే దురభిప్రాయం వుండేది. అది ఇప్పుడు పటాపంచలైంది.
    మీ దిక్కుమాలిన టపా చూసిన తర్వాత మీవి ఎంత గొప్ప తెలివి తేటలో మరింత తెలిసి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    రిప్లయితొలగించండి