22, జనవరి 2010, శుక్రవారం

షార్ట్ హ్యాండ్ ను కనిపెట్టింది ఎవరు?

చిన్నప్పు డెప్పుడోఏదో పిల్లల పత్రికలో ఆయన పేరు మహీధర మురళి మోహన్ రావు అనుకుంటా.. సరిగ్గా గుర్తు లేదు... ఒక ఫీచర్ మెయిన్ టెన్ చేస్తుండే వారు... అందులో చమత్కారంగా కొన్ని వ్యాసాలు వస్తుండేవి... సడన్ గా ఇప్పుడు గుర్తొచ్చి సరదాగా వ్రాయలనిపించి వ్రాస్తున్నాను... (బహుశాఈ మధ్య ఏమి వ్రాయాలో మేటర్ లేక రాయలేదు... ఏదో ఒకటి రాయాలని కూడా ఈ రాయడానికి కారణం కావచ్చు)... చాల మంది ఇది చదివి కూడా ఉండవచ్చు... చదివి చాల కాలం అయి ఉంటుంది... కాబట్టి గుర్తు చేస్తున్నాను అనుకోండి...
షార్ట్ హ్యాండ్ తెలుసు కదా... దీనిని కానీ పెట్టింది ఎవరో తెలుసా? "ఆ మాత్రం తెలీదా... షార్ట్ హ్యాండ్ కనిపెట్టింది పిట్ మాన్ " అంటారు కదా.. కాని అక్కడే తప్పులో కాలేసారు... ఎందుకంటే షార్ట్ మాన్ కనిపెట్టింది మన పూర్వులే... అతను అందరికీ తెలిసిన వ్యక్తే ... ఆయనే .... మన వినాయకుడు...
వ్యాసుడు భారతం స్పీడ్ గా డిక్టేట్ చేస్తుంటే , అంతకంతకు స్పీడ్ గా టకటకా వ్రాసింది వినాయకుడే నన్నది మన అందరికీ తెలిసిన విషయమే కదా... ఆ వినాయకుడిని సరిగ్గా పేరు పలక లేక ఆంగ్లేయులు షార్ట్ హ్యాండ్ కనిపెట్టిన వారి పేరు "పొట్టి మనిషి" అని డిక్లేర్ చేసారు... రాను రానూ పొట్టి మాన్ గా మారి... చివరకు పిట్ మాన్ గా సెటిలయ్యింది...
కాబట్టి షార్ట్ హ్యాండ్ ను కనిపెట్టింది ఎవరు అని ఎవరైనా అడిగితే "వినాయకుడని" చెప్పండి ఈ సారి నుండి...
"ఇంకా నయం... కంప్యూటర్ కు మౌస్ ఉంది కాబట్టి , మౌస్ అంతే మూషికం కాబట్టి , మూషిక వాహనుడు వినాయకుడు కాబట్టి... కంప్యూటర్ ను వినాయక యంత్రం అనో గణేశ యంత్రం అనో అన్నారు కాదు... " అంటారా... అన్నా తప్పు లేదు అంటారా... అల అయితే ఈ సారి వినాయక చవితికి ఉండ్రాళ్ళ బదులుగా సి.డి. లను పెడదాం...
....


14, జనవరి 2010, గురువారం

బాబోయ్ ప్రయాణం...

హాయ్! మొత్తానికి తెలంగాణా లో ఉన్న నా తెజస్వినిని తీసుకొచ్చేసాను... (కూడా వాళ్ళమ్మ కూడా వచ్చింది)... స్పెషల్ ట్రైన్ లో... కాకపోతే జీవితం లో స్పెషల్ ట్రైన్ ఎక్క కూడదని అనిపించింది... రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరవలసిన విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం కు వస్తుందని జస్ట్ పది గంటల ఏభై ఐదు నిమిషాలకు ప్రకటించారు... అలవాటు ప్రకారం అర డజన్ లగేజ్ లు, ప్లస్ మా తేజస్విని... ప్లాట్ ఫారం పై సామూహికంగా తపస్సు చేసిన జనాలను కరుణించిన ఆ ట్రైన్ చాల త్వరగానే జస్ట్ ఒంటి గంటకు ప్లాట్ ఫోరం మీదకు వచ్చింది... తీర చూస్తె బోగి నంబర్లు రాయలేదు... అందరూ ఇదే ఎస్ నాలుగు అన్నారని ఒక బోగిలోకి సామాన్లన్నీ ఎక్కించిన కాసేపటికి అది ఎస్ నాలుగు కాదు... ఎస్ తొమ్మిది అన్నారు... ఉసూరు మంటూ సామాన్లన్నీ మోసుకొంటూ (ఒకసారి రెండు సార్లు కాదు, నాలుగు సార్లు) సదరు బోగి లోకి చేరగానే బయలు దేరింది... విజయవాడ వచ్చేసరికి ఏడు న్నర... ఎక్కడ ఎవడు చెయ్యి ఎత్తినాఆపేస్తున్నట్లు ఆపేయడం, ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ వేశారేమో, ప్లాట్ ఫారం దొరక్క ఔటర్ లో ఆపేయడం, ఆఖరికి పదకొండు గంటలకు రాజమండ్రి చేరింది... ఇంకా వైజాగ్ చేరే సరికి ఎంత టైం అవుతుందో... మొత్తానికి ఈ ప్రయాణం భయంకరమైన కిక్ ఇచ్చింది... అయితే తత్కాల్ లో ట్రైన్ ఫేర్ కన్నాఆర్.టి.సి. లో ఛార్జ్ ఎక్కువ ఐంది... హైదరాబాద్ సిటీ బస్సు ఆర్డినరీ మినిముం ఛార్జ్ ఐదు రూపాయలు... మెట్రో లో ఏడు రూపాయలు, పైగా రిజర్వేషన్ టికెట్ వారికి ఇంతకు ముందు మెట్రో సిటీ బస్సు లో ప్రయాణం ఉచితం... ఇప్పుడు అది కాస్త రద్దు చేసినట్లున్నారు... అనధికారంగా ఐ ఉండవచ్చు... లేదా ఈ మధ్య సమ్మె ల లో తగల బడిన బస్సు ల ఖర్చు, సమ్మెల వలన ఆగిన ప్రయాణాల నష్టం ఇలా పూడ్చు కోవాలని అనుకొంటూ న్నరేమో... ఈ పెరిగిన ఛార్జ్ ల పుణ్యమా అని బస్సుల లో జనాలు తగ్గిపోయారు... ట్రైన్ ఛార్జ్ లు కూడా పెంచుతారని విన్నాను... కరంట్ ఛార్జ్ కూడా పెరుగుతుందట... ఇంకా ఏమేమి పెంచాలో బాగా ఆలోచించి ఐడియా లిచ్చే వారికి బహుమతులు కూడా ఇస్తారేమో... ఇవన్నీ చూస్తోంటే యర్రంసెట్టి సాయి నవల (ఇరవై లో అరవై యో అరవై లో ఇరవై యో సరిగ్గా గుర్తు లేదు) లో ఒక సన్నివేసం గుర్తుకు వస్తూంది... హీరో హుస్సేన్ సాగర్ గట్టున నిలబడి ఉంటాడు... ఇంతలో నైట్ డ్యూటీ పోలీసు అతన్ని చూసే ఆత్మహత్య చేసుకొనే బాపతుగా భావించి "ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలను కుంటున్నావ్" అని అడుగు తాడు... అప్పుడు హీరో "పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న జీతాలు, నిరుద్యోగం, పనికి మాలిన రాజకీయాలు, రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు" అంటూ ఏకరువు పెడతాడు... (సరిగ్గా ఆ సంభాషణలు గుర్తు లేవు) దాంతో "దేశం ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు నీకే కాదు బాబు, ఎవరికైన ఆత్మ హత్య చేసుకోవాలని అనిపిస్తుంది ... ఇటువంటి పరిస్తితుల్లో బ్రతకడం కన్నా చావడమే బెటర్" అంటూ తనే దూకేస్తాడు సాగర్ లోకి. నాకు పక్కనే గోదావరి ఉంది....
మురళి.

12, జనవరి 2010, మంగళవారం

బ్లాగ్ మిత్రులందరికీ.. మీ
మురళి.
ఫాదర్ అఫ్ తేజస్విని.

8, జనవరి 2010, శుక్రవారం

ధ్వంస రచన

ఏమవుతుంది ఆంద్ర రాష్ట్రానికి? వేరే వేరే రాష్ట్రాలకు వెళ్లి వచ్చాక మన ఆంధ్ర ప్రదేశ్ అంత సేఫ్ ప్లేస్ మరొకటి లేదని అనిపించేది... కాని, ఉన్నట్టుండి ఏమిటీ విపరీతం? ఒకసారి ప్రత్యెక రాష్ట్ర గొడవలు , మరోసారి సమైఖ్యంగా ఉండమని గొడవలు, ఇవన్నీ సద్దు మనిగాయో లేదో అప్పుడే... రిలయన్స్ కీ, మాజీ ముఖ్య మంత్రి మరణానికీ లంకె పెట్టి... రాష్ట్ర వ్యాప్తంగా గందర గోళం... ఇదేదో బోడి గుండుకీ మోకాలుకీ లంకె పెట్టినట్టుగా అనిపించడం లేదూ... దేశ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు కలిగిన కంపెనీ అధినేతలు, ఒక రాష్ట్రము లో ముఖ్య మంత్రి ని మట్టుపెట్టడంలోకీలక పాత్ర పోషించారంటే అది నమ్మకశ్యమైన విషయమా కాదా అని కొంచం కూడా ఆలోచన లేకుండా అవకాశంకోసం ఎదురు చూస్తున్నట్లు గా అల్లరి సృస్టించారంటే దీని వెంకక పెద్ద డొంకే ఉంది ఉండొచ్చు... కాకపోతే తీగ దొరకాలి... అంతే... కాని, ఈ చానళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేని విధం గా తయారయ్యింది... అప్పుడెప్పుడో ఫాషన్ షో లో ఒకామె వేసుకొన్న గౌన్ జారి అందాలు బయటపడి ప్రేక్షకులను కనువిందు చేసాయని మీడియా లో చూపించారు... అయితే ఆమె గౌన్ జారింది ఒక్క సారే.... కానీ ఆ రోజు టి.వి.ల లో మాత్రం ఆ దృశ్యం ఒక వంద సార్లు చూసే భాగ్యం కలిగించారు ఈ మీడియా వాళ్ళు... అలాగే హత్యలు, అక్రమ సంబంధాలు, అశ్లీల దృశ్యాలు .... వీళ్ళు జనాల బలహీనతల తో ఆడుకునివారి మెదడు లను కలుషితం చేస్తున్నారు... కొంత మంది చేతిలో మీడియా, కోతికి దొరికిన కొబ్బరి కాయలా తయారయ్యింది... ఏది ఏమైనా సాధారణ ప్రజలు మాత్రం కొంచం జాగ్రత్తగా ఉండాల్సిందే... లేక పోతే మరో గోకుల్ చాట్, మరో లుంబిని పార్క్ ఘట్టాలను ఎదుర్కో వలసిన పరిస్థితి రావచ్చు... చూసారా... నెమ్మది నెమ్మదిగా ఉద్యమం నుంచి అంతా ప్రక్క దారి పడుతున్నారు... ఇన్ని కబుర్లు చెప్పారు... ఏమి పోయాయి అవన్నీ... ఇప్పుడు వీరంతా చల్ల బడ్డారు... మరి పోయిన ప్రాణాలను ఎవరు ఇస్తారు... చచ్చిన వారి పేర్లను పొట్టి శ్రీరాములు విగ్రహం పీకేసిన ప్లేసులో స్థాపించే శీలా ఫలకాలపై చేక్కిస్తారా.... వారి వారి తల్లి దండ్రులపరిస్థితి ఏమిటి... అంతే... గొర్రెల్లా ఎవడు ఏమంటే దానికి తాళం వేస్తూ పోవడం కాదు... బుర్రలతో ఆలోచించాలి... ఏమిటో... సంధి ప్రేలాపన ల వలె అనిపిస్తున్నాయి కదూ నా మాటలు... ? నేనూ ఈ మందలో ఒక గోర్రేనే కదా... అలానే ఉంటాయి మరి నా ఆలోచనలు కూడా... ఇక సెలవ్... మీ తిట్లను సదా కాంక్షించే .... మురళి.

7, జనవరి 2010, గురువారం

తెలుగులో షేర్ మార్కెట్ వెబ్సైటు...

హాయ్! ఇప్పుడే గమనించాను .... షేర్ మార్కెట్ కు సంబంధించి ఒక వెబ్ సైట్... తెలుగులో... ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సందర్శించండి... దాని పేరు...
www.tv5news.in

6, జనవరి 2010, బుధవారం

శుభారంభం...

కొత్త సంవత్సరం ప్రభుత్వ కానుకల పరంపర ప్రారంభమయ్యింది... బస్సు చార్జీల రూపంలో నాంది పలికింది... నూటికి కనీసం ఇరవై ఐదు రూపాయల చొప్పున వాయింపు .... ఇది ఆరంభం మాత్రమె... రెండు రూపాయల కిలో బియ్యం, ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీ రుణాలు... అంటూ అధికారంలోకి వచ్చిన జాతీయ పార్టీ... ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామన్న వ్యక్తీ చనిపోయి బ్రతికి పోయాడు... లేకపోతే ఇవన్నీ అమలు చేయాలంటే ఆయన మాత్రం ఎలా తెస్తాడు? పది కే.జి. ల బియ్యం రెండు రూపాయల చొప్పున ఇచ్చి, మార్కెట్ లో కిలో బియ్యం ముప్పై దాటించారు... పప్పులు, పలు, ఉప్పులు, మిగిలిన వాటి సంగతి సరేసరి... జల ప్రలయాలోచ్చి కూర గాయల ధరలు నింగి కేగ సాయి. సమ్మెలు, రాస్తారోకోలు, ప్రత్యెక వాదాలు, సమైఖ్య రాగాలు, తగలపెట్ట డాలు... తన్నుకోవ డాలు, .... ధరలు పెంచడానికి, వద్దను కున్న లేదా భారమనిపిస్తున్న పథకాలురద్దు చేయడానికి ఇదే మంచి అనువైన సమయం... ఆర్ధిక మాంద్యం వచ్చి ఉద్యోగాలు పోతున్నై... ఇంక్రిమెంట్లు ఆగి పోయాయి... సారి కదా ఉన్న జీతాలు తగ్గిపోతున్నై... (ప్రస్తుతం ఆ తగ్గిన జీతల తోనే బ్రతుకు తున్నాం కదా... నాలాంటి వాళ్ళు...) , మేడి పండు పథకాలు కొన్ని ధరలు పెంచాయి... ప్రకృతి కన్నెర్ర కు కొంత ధరలు పెరిగాయి... మనుషుల మూర్ఖత్వం వాళ్ళ కొన్ని ధరలు పెరుగు తున్నై... రేపు ప్రత్యెక రాష్ట్రాలుగా ఏర్పడితే కొత్త కొత్త ఖర్చులు, కొత్త కొత్త పన్నులు... కొత్త కొత్త ఇబ్బందులు... బందులు...

ఇప్పుడు నాకు మరో డౌట్ వచ్చింది... ఈ పండగలకీ పబ్బాలకీ ఆర్.టి.సి. వాళ్ళు ఏభై శాతం ఎక్కువ ఛార్జ్ వసూల్ చేస్తారు కదా... అది ఈ కొత్త ఛార్జ్ మీద కూడా ఉంటుందా... అలా ఉంటె మన మధ్య తరగతి లెక్క ప్రకారం వంద రూపాయల మీద డెబ్భై ఐదు రూపాయలు ఎక్కువ దొబ్బుడు .... ప్రైవేట్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్ నుండి రాజమండ్రి కి మూడు వందల ఏభై వసూల్ చేస్తున్నారు... రాను రానూ.. నేను పండగకి "రాను రానూ"... అనే పరిస్తితి వచ్చేట్టుంది... అన్ని పరిస్థితులకీ అలవాటు పడటం మనకు అలవాటే కదా...
మురళి.

5, జనవరి 2010, మంగళవారం

చాలా బాగుంది... కర్ర విరగ కుండా.. పాము చావకుండా "ముందు మీ నోళ్ళు, కాళ్ళు, అదుపులో పెట్టుకోండి, తరువాత మాట్లాడుదాం... " అన్నట్లుగా చేసి, పైగా వాళ్ళ తోటే శాంతి ప్రకటన చేయించిన కేంద్రం చర్య నిజంగా మెచ్చుకోదగ్గది.. అసలు వెళ్ళగానే "అనవసరంగా గొడవలు సృష్టించి, మమ్మల్ని ఇరకాటం లో పెడతార్ర వెధవల్లారా... " అని గదిలో పెట్టి చితక కొట్టాలి వీళ్ళందరినీ... కర్రలు కాగడాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతారా... వీళ్ళనుంచినాలుగు సార్లుహైదరాబాద్ ప్రయాణం రిజర్వేషన్ చేయించుకోవడం, కేన్సిల్చేసుకోవడం, ఇదే పని... మొత్తం అంతాప్రశాంతంగా ఉందని, అందరు మాములుగా ఉన్నారని కన్ఫంఅయ్యాకే తరువాత స్టెప్ అని చెప్పాలి... అంతా చల్ల బడాలి... తరువాతే మాట్లాడాలి... అంతే... చల్లబడితే అంతా నీరు కారిపోతుంది అని భావించకుండా ఉండాలంటే, తరువాత చర్చల తేదిని నిర్ణయించాలి. ... ఆ చర్చల తేది లోపు ఎటువంటి ఆందోళన జరిగినా చర్చల తేదిని పొడిగించుకుంటూ పోవడమే... దెబ్బకు అన్నీ మూసుకుని చచ్చినట్టు కూర్చుంటారు...

4, జనవరి 2010, సోమవారం

జై తెలుగు నేల...

తెలంగాణా వాదులకు విన్నపం... ప్రత్యెక రాష్ట్రము ఏర్పడినాక హైదరాబాద్ మీద మీకు పూర్తి హక్కు... అప్పుడు ఆంద్ర వాళ్ళే కానివ్వండి... మరే ఇతర రాష్ట్రం వాళ్ళు కానివ్వండి... ఎవరినైనా ఉంచ దలచు కుంటే, ఉంచొచ్చు... లేదా పొమ్మన వచ్చు... ఇప్పుడు మాత్రం దయ చేసి వాళ్ళను ఏదో మీ దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి బ్రతుకుతున్న వారి వలె ట్రీట్ చేయకండి... పండగలకు వెళ్ళిన వారిని తిరిగి రానివ్వం... అంటూ రెచ్చ గొట్టకండి.... మీ మీద ఉన్న సానుభూతి ని దూరం చేసుకోకండి... హైదరాబాద్ కానివ్వండి... వేరే స్టేట్ లేదా వేరే సిటి ... లోకల్ వాళ్ళు మాత్రమె ఉండాలనే నిబంధన వస్తే... హైదరాబాద్ లాంటి సిటీస్ శ్మశానం కన్నా నిశ్శబం గ తయారవుతాయి... మీరు ఏదో అన్నారని... ఈ సీమ ఆంధ్ర వాళ్ళు బంద్ అంటున్నారు... అసలు సామాన్య మానవుని కోసం మీలో ఎవరైనా ఆలోచించారా? ఆలోచించరుఆ మధ్య ఇలా స్టేట్ ముక్కలుగా మారి, మళ్ళీ సంస్థానం సంస్కృతి వస్తుందని రాసినందుకే... ఒక మహానుభావుడికి నేను వ్రాసింది దిక్కుమాలిన టపా అయిపొయింది... ఇప్పుడు ఇలా వ్రాసినందుకు ఇంకెన్ని కామెంట్లను భరించాలో... దిక్కుమాలిన నా లాంటి వాళ్ళకు దేవుడే దిక్కు... మరి .....ఇలా కామెంట్స్ చేసే వాళ్లకు ... ???