24, ఏప్రిల్ 2010, శనివారం

తేజస్విని జోక్స్...

ఇది చాల కాలం క్రితం నాటిసంగతి ... (అంటే పాపకు సంవత్సరం దాటాక) నేను ఆఫీసు కి వెళ్ళడానికి రెడీ అవుతూ బాయ్ చెపుతున్న పాపకి.. అప్పుడు పాప అన్న మాట...

"ఆపీచు వద్దు... "

"ఎందుకమ్మా..." నేను...

"పాప .. ఉంది పాపా..." తను...

"మరి ఆఫీసు కు వెళ్ళాక పోతే ఆమ్... (అన్నం) ఎలా"... నేను...

"అమ్మ పెడుతుంది... " పాప...

"అన్నం కు డబ్బులు ఎలా వస్తాయి?" నేను...

"జ్జ్జ్జ్, జ్జ్జజ్జ్జ్జ్, ... లో వత్తాయి..." ( ఏ.టి.ఏం. లో డబ్బులు వచ్చే ముందు వచ్చే సౌండ్ అది...)

ఇంకా నేనేమి మాట్లాడగలను?

మురళి.

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

రెండు సంవత్సరాల వయస్సులో (అంటే ఆరు నెలల క్రితం) మా పాప ఫోటో...

14, ఏప్రిల్ 2010, బుధవారం

తేజస్విని జోక్స్ ...

లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాం... అక్కడ గుండులు, గోపుర దర్శనాలు అన్నీ ఐ పోయాక షాపింగ్ చేస్తున్నాం... మా ఫ్రెండ్ ఒక్కడు చాంటింగ్ బాక్స్ (దాని కరెక్ట్ పేరు ఏమిటో నాకూ తెలీదు... ఓం, వేంకటేశాయ నమః... అంటూ స్తుతిస్తూ వస్తుంది కదా... అది..) కావాలని అంటే చూస్తున్నాం... మా పాప కూడా సీరియస్ గా చోసేస్తోంది అన్నింటిని... ఒక దానిలో "శివయనమహా..." అంటూ స్టార్ట్ అవ్వడం, ఇంకో దానిలో "నారాయణాయ" అని స్టార్ట్ కావడం,, రేట్ కుదరక ఒక్కక్కటి చూస్తుండటం చేస్తున్నాము... ఒక్కో దానిలో, ఒక్కో నామ స్మరణం వినిపిస్తున్డటం తో సడన్ గా మా పాప షాప్ ఓనర్ ను అడిగింది... "ఆ... ఆ... అదుర్స్... ఉందా?"
....

13, ఏప్రిల్ 2010, మంగళవారం

తేజస్విని జోక్స్

ఈ మధ్య మా తేజస్విని ని కాకినాడ పంపించాను.. రెండు రోజుల తరువాత తిరిగి వచ్చాక అడిగాను... "నాన్నను వదిలేసి వెళ్ళిపోతావా?" అప్పుడు మా పాప సమాధానం "మరి నువ్వు ఆపీచుకు వేలతావుగా..." (తనను వదిలేసి నేను ఆఫీసు కి వెళతాను ... కాబట్టి నన్ను వదిలేసి తను కాకినాడ పోయిందని కొట్టినట్టుగా జవాబు..)
...
రాజమండ్రి లో పార్క్ కు తీసుకొని వెళుతుంటాను తనని... తనను ఎత్తుకొని వుండగా నా వెనుకకు చూపించి అంది... "మద దీర..." (మగ ధీర) ....... పార్క్ లో మగధీర పోస్టర్ ఉందా అని వెనక్కి తిరిగి చూసాను... అక్కడ ఉంది "గుర్రం మీద ఉన్న కాటన్ దొర విగ్రహం."
...
ప్రస్తుతానికి ఇంతే... సెలవ్...
మురళి.

12, ఏప్రిల్ 2010, సోమవారం

చాల కాలానికి ... బ్లాగ్ లోకి వచ్చాను... కొంచెం బిజీ... అంతే కాక ఏదో వ్రాయాలని ప్రారంభించి ఏదేదో వ్రాసేస్తున్నాను.. సుత్తి కొడితే చదివే వాళ్లకి మండి కామెంట్ కాలంతో దాడి చేస్తారని భయం... హరి సర్ ... రెస్పాన్స్ చూసి మళ్ళీ ... ఒకటి రెండు ముక్కలు వ్రాద్దామని కూర్చున్నాను... ఈ మధ్య షేర్ మార్కెట్ లో ఐ.సి.ఐ.సి.ఐ. డైరెక్ట్ వారి సూచనల ప్రకారం కొన్న షేర్ లు పాతాళం లోకి పోవడంతో ఒళ్ళు మండి ఐదు వందలు పోతే పోయింది అని నష్టానికి అమ్మి పడేసాను... ఇంకా లాభం లేదనుకొని ఒక్క వెయ్యి రూపాయలు పెట్టి ఆంధ్ర బ్యాంకు షేర్ లు వంద రూపాయల చొప్పున కొన్నాను... అలవాటు ప్రకారం తొంబై ఎనిమిది వరకూ దిగిపోయింది... కాని వారం లోపే నూట ఇరవై దాటింది... ఇంకా పెరుగుతుందేమో అన్న ఆశ మనసును తొలిచేస్తున్నా అమ్మేసాను... అమ్మేసాక తగ్గడం ప్రారంభించింది అనుకోండి... ఐనా.. ఆంద్ర బ్యాంకు, లాంటి షేర్ లు లాంగ్ టైం వరకూ హోల్డ్ చేసుకో వచ్చు... ముఖ్యంగా ఈ బ్యాంకు షేర్ లలో రిస్క్ తక్కువ... ఎందుకంటె అది నాకు అనుభవపూర్వకంగా తెలుసు... అసలు నా షేర్ మార్కెట్ జీవితం బ్యాంకు షేర్ ల తోనే స్టార్ట్ అయ్యింది... పంతొమ్మిది వందల తొంబై ఆరు లో బ్యాంకు అఫ్ ఇండియా షేర్ లను నలభై ఐదు రూపాయలకు కొన్నాను... ఐదేళ్ళ తరువాత వంద రూపాయలకు అమ్మేసాను... అదే బ్యాంకు అఫ్ ఇండియా షేర్ ధర ఇప్పుడు మూడు వందలు దాటి.. ఉంది.. అనుకుంటాం కాని ముతుఅల్ ఫండ్ సేఫ్ అని... దేనికీ దానికీ పెద్ద తేడ ఏమీ లేదు... ఆ దరిద్రపు రిలయన్స్ నాచురల్ ఫండ్ ఒక్కటి కొన్న నాటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా పెరగ లేదు... పెరిగితే పైసా పైసా... తగ్గితే రూపాయి చొప్పున... మరి అంతంత అర్హత లున్న ఫండ్ మేనేజర్ లు ఏమి చేస్తారో...
....