13, ఏప్రిల్ 2010, మంగళవారం

తేజస్విని జోక్స్

ఈ మధ్య మా తేజస్విని ని కాకినాడ పంపించాను.. రెండు రోజుల తరువాత తిరిగి వచ్చాక అడిగాను... "నాన్నను వదిలేసి వెళ్ళిపోతావా?" అప్పుడు మా పాప సమాధానం "మరి నువ్వు ఆపీచుకు వేలతావుగా..." (తనను వదిలేసి నేను ఆఫీసు కి వెళతాను ... కాబట్టి నన్ను వదిలేసి తను కాకినాడ పోయిందని కొట్టినట్టుగా జవాబు..)
...
రాజమండ్రి లో పార్క్ కు తీసుకొని వెళుతుంటాను తనని... తనను ఎత్తుకొని వుండగా నా వెనుకకు చూపించి అంది... "మద దీర..." (మగ ధీర) ....... పార్క్ లో మగధీర పోస్టర్ ఉందా అని వెనక్కి తిరిగి చూసాను... అక్కడ ఉంది "గుర్రం మీద ఉన్న కాటన్ దొర విగ్రహం."
...
ప్రస్తుతానికి ఇంతే... సెలవ్...
మురళి.

1 కామెంట్‌:

  1. కాటన్ దొరకి దక్కాల్సిన బిరుదమే దక్కింది, మీ పాప తనకు తెలియకపోయినా సృజానాత్మక అభినందననే ఇచ్చింది :)

    రిప్లయితొలగించండి