31, డిసెంబర్ 2010, శుక్రవారం

న్యూ ఇయర్ గ్రీటింగ్స్...

సాధారణంగా సంబరాలను జరుపుకోవడాన్ని "అంబరాన్ని అంటే సంబరాలు" అంటూ ఉంటాం..

ఈ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటే సంబరాలుగా జరుపుకోవడం సాధ్యం కాదు...

ఎందుకంటె అంబర మంతా.. నిత్యావసర వస్తువుల ధరల తోనూ,

వివిధ కారణాల వల్ల బలవన్మరణం పొందిన వారి ఆత్మల తోనూ,

నిండి పోయింది...

ఈ మధ్య ప్రయోగించిన రాకెట్ ఆకాశం దాటి పైకి పోకుండా...

ఇవన్నీ అడ్డు కున్నాయి...

రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటే దానికి ఇంధనంగా ధరలను వాడితే

సౌర మండలాన్నే కాదు.. గెలక్షి ని కూడా దాటి పయనిస్తుంది ....

మరి సంబరాలను పాతాళం లో జరుపుకొందామా...

మనం భారత పౌరులం... ఆశ జీవులం...

గతం ఎంత భయంకర మైన అనుభవాలను ఇచ్చినప్పటికీ

వర్తమానం చీకట్లతో నిండి పోయినప్పటికీ,

భవిష్యత్ గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తాం..

అందుకే అందరికీ

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి