ఇది షేర్ మార్కెట్ లో కొత్తగా ప్రవేశించే ప్రతి ఒక్కరికీ అనుభవమయ్యే విషయాలు... (అంటే నాకు జరిగిన అనుభవాలు అందరికీ జరుగుతాయని రూల్ లేదు... కాని కొంతమంది కయినా జరుగుతూ ఉంటాయని నా అనుభవం ... నేర్పిన పాఠం).
మొదటిది ఎంత గొప్ప షేర్ బ్రోకర్ కయినా షేర్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు... అందు వలన వాళ్ళు కొనమని చెప్పే స్టాక్స్ వాళ్ళు చెప్పిన టైం లోగ పెరగడానికి ఛాన్స్ ఇరవై శాతం కంటే తక్కువ... వాళ్ళు ఒక స్టాక్ కొనమని చెప్పే టైం కి ఆ స్టాక్ రేట్ వాళ్ళు చెప్పిన దాని కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది... ఎప్పుడు తగ్గుతుందా... అప్పుడు కొందామని ఎదురు చూసే కొద్దీ పెరిగి పోతూ ఉంటుంది... పెరుగు తుంది కదా అని కొంటె... కొన్న మరు క్షణం నుండి తగ్గడం ప్రారంభం అవుతుంది... పెరుగుతుంది లే అని ఉంచుకొని ఉంచితే తగ్గుతూనే ఉంటుంది... ఎక్కువ స్టాక్ అ మీద ప్రయోగం చేయడం కంటే... ఏదో ఒక స్టాక్ ని నమ్ముకొని, తగ్గినప్పుడు కొనడం, పెరిగి నప్పుడు అమ్మడం చేయడం సరి అయినదని అప్పుడప్పుడు అనిపిస్తుంది... కాని కావలసిన ధర వచ్చే వరకూ ఎదురు చూసే ఓపిక ఉంటేనే ఈ షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి... ఈ మధ్య బ్యాంకు స్టాక్ లకు సంబంధించిన స్టేట్ మెంట్ ఒకటి గమనించాను... రిస్క్ చేయలేని నా లాంటి వాళ్ళు, ఈ బ్యాంక్స్ స్టాక్ ల పై ప్రయోగం చేయడం మేలు... క్రింద రెడిఫ్ఫ్ కు సంబంధించిన ఒక వెబ్ సైట్ ఇచ్చాను... దాని క్రింద బ్యాంక్స్ పేర్లు ఇచ్చాను... ఎవరికైన ఉపయోగపడు తుందేమో చూసుకోండి...
http://money.rediff.com
బెస్ట్ అఫ్ లక్...
మురళి.
(గమనిక... ఇన్ని కబుర్లు చెబుతున్నావు, షేర్ మార్కెట్ లో ఎంత సంపాదించా వేమిటి అని నన్ను దయ చేసి అడుగ వద్దు... రక రకాల అనుభవాలను బ్లాగ్ మిత్రులతో పంచుకోవాలనే ఈ సోది రాస్తున్నాను... అంతే... నేను సంపాదించింది... ధనరూపేనా శూన్యం... అనుభవ రూపేణా అనంతం...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి