30, మే 2011, సోమవారం

దూద్ పీనే క ఉమర్ నహీ..

నేనూ, నా ఫ్రెండ్ ఒకడు కలసి ఒక సినిమా కి వెళ్ళాం... పేరు గుర్తు లేదు కానీ, అది బాబీ డియోల్, రాణి ముఖర్జీ హీరో, హీరొయిన్ గా ఉన్న హిందీ సినిమా అది... హీరో చూస్తుండగా హీరొయిన్ స్మోక్ చేస్తూ ఉంటుంది... హీరో అడుగు తాడు...
" అరె... తు సిగరెట్ పీతా హై క్యా" (నువ్వు సిగరెట్ తాగుతావా?)
అపుడు హీరొయిన్ అన్సర్ " నహీ తో మేరా ఉమర్ దూద్ పీనే కా హై క్యా..." (పాలు తాగే వయస్సు కాదు కదా నాది..)
అపుడు నా ఫ్రెండ్ కామెంట్... "దూద్ పీనే కా ఉమర్ నహీ... దూద్ దేనే కా..." (పాలు తాగే వయస్సు కాదమ్మా... పాలు ఇచ్చే వయస్సు..."

29, మే 2011, ఆదివారం

బంగారు కోడి పెట్ట... గుడ్డు పెట్టె..

ఇది ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిన జోక్... ఇది ఇద్దరు మాజీ ముఖ్య మంత్రుల కు సంబంధించిన జోక్... ఒకరు హైటెక్ చంద్ర బాబు గారు... ఇంకొకరు కీ.శే. జల యజ్ఞం రాజశేఖర రెడ్డి గారు..
చంద్ర బాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు పక్క పక్కనే ఉన్న ఇళ్ళలో ఉంటున్నా రంట. చంద్ర బాబు గారు ఒక కోడి పెట్టాను పెంచుతున్నారు.. అది తినడానికి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది కదా.. ఒక రోజు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోకి పోయి, దొరికింది తింటూ పనిలో పనిగా గుడ్డు పెట్టేసింది... పక్కింటి నుండి చంద్ర బాబు నాయుడు గారు ఇది చూసి రాజ శేఖర రెడ్డి గారింటికి పోయి గుడ్డు తీసుకో బోతే, అప్పుడే అక్కడకు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు "అయ్యా.. చంద్ర బాబు నాయుడు గారూ... మీరేం చేస్తున్నారో తెలుసుకో వచ్చా?" అని ప్రశ్నించారు.. వెంటనే చంద్రబాబు నాయుడు గారు... " ఏమండీ... రాజశేఖర రెడ్డి గారూ... మా కోడి మీ ఇంటి వైపు వచ్చేసింది... తినడం పూర్తి అయి వెనక్కు వస్తూ, వస్తూ, ఒక గుడ్డు పెట్టేసింది... అది తీసుకు పోవాలని వచ్చాను... తీసుకు పోతున్నాను అని మనవి చేస్తున్నాను..."
"ఏమండీ.. చంద్ర బాబు నాయుడు.. గారూ... ఇది యెంత మాత్రం సారి కాదు... మా ఇంట్లో ఉన్న వస్తువు నాది అవుతుంది కానీ... మీది ఎలా అవుతుందయ్యా..."
"కానీ కోడి.... నాది కదా...."
"కోడి మీదైనా... నా తిండి తిన్నకనే గుడ్డు పెట్టింది కదా.... కాబట్టి ఆ గుడ్డు అక్కడ వదిలి వెళ్ళండి..."
"ఇదేమి న్యాయమయ్య రాజశేఖర రెడ్డి... నా టైం లో ఆర్ధిక సంస్కరణలు ... ప్రవేశ పెడితే ... అవి ఫలితాన్ని నీ కలం లో ఇవ్వడం ప్రారంభించ డం తో, అన్నీ ఉచితంగా ఇచ్చేస్తూ, అంట నీ గొప్పతనమే అని చెప్పుకున్నావు... నేనేమీ మాట్లాడ లేదు... నేను... ఈ సేవ... స్టార్ట్ చేస్తే... దాన్ని రాజీవ్ ఇంటర్నెట్ అని నీ సొంతం చేసుకున్నావు... నేను హై-టెక్ బస్సు అంటే... పేరు మార్చి సూపర్ లగ్జరీ అని నీ సొంత ముద్ర వేసుకున్నావు... ఇప్పుడు నా కోడి గుడ్డు పెడితే నీది అంటూ... దీనినీ సొంతం చేసుకున్తున్నావు... ఇది అన్యాయం కాదా అని ప్రస్నిస్తున్నాను..."
"సరేనయ్య చంద్రబాబూ... నీకూ, నాకూ, గొడవెందుకు కానీ.. ఒక పందెం వేసుకుందాం.. అది గెలిస్తే గుడ్డు నీది... ఓడితే నాది..."
"సరే... రాజశేఖర రెడ్డీ, నేను దీనికి సిద్ధమే..."
"నేను నిన్ను ఒక గుద్దు గుద్డుతాను ... ఆ దెబ్బ తట్టుకుకుని నీవు నిలబడ గలగాలి... తరువాత నువ్వు గుద్దు.. నువ్వు తట్టుకుని నిలబడ గలిగితే గుడ్డు నీది... నేను తట్టుకుని నిలబడ గలిగితే గుడ్డు నాది... ఓ.కే.నా...?"
"సరే..." అంటూ చంద్ర బాబు గారు పటిష్టంగా నిలుచున్నారు... గెలుపు నాదే అనే ధీమాతో...
రాజశేఖర రెడ్డి గారు... బలమంతా ఉపయోగించి గట్టిగా చంద్రబాబు నాయుడు గార్ని గుద్దారు...
ఒక్క క్షణం చంద్ర బాబు గారి కి కళ్ళు బైర్లు కమ్మాయి... చెవుల్లో హోరు... చాల సేపు ఆగలేదు... ఎముకలు విరిగి పోయాయేమో అన్నంత ఫీలింగ్ కలిగింది... అయినా గుడ్డును దక్కించుకోవాలనే పట్టుదల తో... తట్టుకుని నిలబడ్డారు... చంద్ర బాబు గారి అవస్తాను గమనిస్తూనే ఉన్నారు... రాజశేఖర రెడ్డి గారు... పళ్లన్నీ బయట పెట్టి... నవ్వుతూ అడిగారు.. "ఏమయ్య చంద్ర బాబూ... ఆర్...యు.. ఓకే...?"
తేరుకున్న చంద్ర బాబు... వెంటనే "ఇప్పుడు నా వంతు... రెడీ యేన... రెడ్డి గారూ...." అంటూ ముందుకు వచ్చారు...
వెంటనే రాజశేఖర రెడ్డి గారు... "ఒద్దులే బాబు... నువ్వే గెలిచావు... గుడ్డు నువ్వే ఉంచుకో..." అంటూ చల్లగా జారుకున్నారు...

22, మే 2011, ఆదివారం

సరదాగా కాసేపు...

నేను చదివిన, నాకు నచ్చిన కొన్ని జోక్స్...
మరో చరిత్ర (ఇది ఒక విషాద ప్రేమ గాధ)
అనగనగా ఒక ఊరిలో ఒక కోడి, దోమ ఒకదానితో ఒకటి ప్రేమలో పడ్డాయి... రెండూ కలసి ఒక ఇంగ్లిష్ సినిమాకి వెళ్ళాయి... అందులో హీరో హీరోయిన్ ల రొమాంటిక్ సీన్ చూసి మూడ్ వచ్చి ఒకదాని నొకటి ముద్దు పెట్టుకొన్నాయి...
తరువాతి సీన్ లో ... పాపం రెండూ చచ్చి పోయాయి... కోడి డెంగ్యువచ్చి చనిపోతే, దోమ బర్డ్ ఫ్లూ తో చని పోయింది...
రెండు నిముషాలు మవునం పాటిద్దామా...
ఇంకో చరిత్ర (ఇది ఓక విచిత్ర ప్రేమ గాధ)
ఒక పిచ్చాసుపత్రి ని సందర్శిస్తూ ఒక మంత్రి "రాధ" రాధ..." అంటూ గంతులేస్తున్న ఒక వ్యక్తిని గురించి అడిగాడు డాక్టర్ ను ఆసక్తిగా.. "ఏమైంది ఇతనికి... ఎవరా రాధ"
డాక్టర్ చెప్పాడు..."రాధ అనే అమ్మాయిని ఇతను ప్రేమించాడు సర్... ఆమెతో పెళ్లి కాక పోవడంతో ఇలా పిచ్చి వాడయ్యాడు..."
కాస్త దూరం పోయాక మరో వ్యక్తీ "రాధ... హు.. రాధ... హు..."అంటూ సూన్యం లోకి చూస్తూ గొణుగుతున్నాడు... వెంటనే మంత్రి డాక్టర్ వైపుకి తిరిగి అడిగాడు...."ఇతను కూడా ఆ రాధ అనే అమ్మాయినే ప్రేమించాడ?'
"లేదు సర్" చెప్పాడు డాక్టర్...
"ఇతను ఆ రాధను పెళ్లి చేసుకున్నాడు..."
రాణి గారను కున్నా! (ఇదో మల్లాది మార్కు జోకు)
ఓక రాజు గారికి ఆస్తానం లోని విదూష కుని మీద ఎందుకో కానీ గోప్ప్హ కోపం వచ్చేసింది..అలవాటు ప్రకారం మరణ దండన విధించారు... విదూషకుడు లెగ్స్ అండ్ ఫింగెర్స్ పడి (ఐ మీన్ కాళ్ళా, వెళ్ళ) బ్రతిమాలినా రాజు గారు కరగలేదు... కాని ఓక ఛాన్స్ ఇచ్చారు.. "సరే... నీకు ఓక అవకాశం.. నువ్వు ఓక పని చేయాలి... అందు వాళ్ళ నాకు విపరీతమైన కోపం మరియూ ఆశ్చర్యం ఒకేసారి రావాలి... ఎందుకు ఈ పని చేసావని అడిగితె వచ్చే సమాధానం ఇంకా కోపం మరియూ ఆశ్చర్యం కలిగించేది ఉండాలి..."
వెంటనే విదూషకుడు రాజు గారి నడుం మీద గట్టిగా గిల్లాడు...
సడన్ గా విదూషకుని పనికి రాజు గారు ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు... తేరుకొని కోపంగా ప్రశ్నించారు... "ఎందుకు చేసావీ పని... రాజు అయిన నాతో..."
వెంటనే విదూషకుడు అమాయకంగా మొహం పెట్టి అన్నాడు...
"క్షమించండి... మహారాజా... మీరనుకోలేదు...." .... "రాణి గారనుకొన్నా"
తిక్క కుదిరింది...
అప్పారావు హడావుడి గా వచ్చి సుబ్బారావు తో అంటున్నాడు..."ఒరేయ్... ఆ మధ్య మన శీను గాడు... గోదాట్లో పడి న ఓక అమ్మాయిని రక్షించాడు...తెలుసు కదా..."
"ఆ.. తెలుసు ... అయితే..." అడిగాడు సుబ్బా రావు..
"అందుకు కృతజ్ఞత గా మనోడ్ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోండి రా..."
వెంటనే సుబ్బా రావు అన్నాడు..."తిక్క కుదిరింది వెధవకి... ఇంకెప్పుడూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడు..."
సిటి బస్సు... రద్దీలో మిస్సు...
మాలతి అప్పుడే వచ్చిన సిటి బస్సు ఎక్కింది... మామూలుగానే బాగా రద్దీ గా ఉంది ... ఆడా, మగా, ముసలీ, ముతకా, చిన్న, చితకా.. అనే తేడ లేకుండా... అంతా ఒకరినొకరు హత్తుకొని మరీ తమ తమ గమ్య స్తానానికి బస్సు ఎప్పుడు చేరుతుందా అని ఎదురు చూస్తూ ప్రయాణం చేసేస్తున్నారు... మాలతి చచ్చీ, చెడి, లోపలకు దూరి నిలుచుంది... ఇంతలో కాండుక్టర్ దగ్గరకు రావడం తో అతి కష్టం మీద ఒక చేతిని కిందకు చేర్చి, హ్యాండ్ బాగ్ జిప్ తెరిచి... చిల్లర కోసం తడిమింది... అందులో ఒక్క పైసా కూడా తగలక పోవడం తో... వెంటనే జిప్ మూసేసి... జనరల్ గా పర్సు దాచే ప్రదేశం లో ట్రై చేసింది... కానీ అక్కడ పర్సు లేదు... మళ్ళీ క్రిందకు చెయ్యి పోనిచ్చి బాగ్ జిప్ తెరిచి లోపల చెయ్యి పెట్టి వెదికింది...
ఇలా రెండు మూడు సార్లు ట్రై చేసింది... కానీ డబ్బులు తగల లేదు... ఇంతలో పక్కన ఉన్న వ్యక్తీ కలుగ జేసుకుంటూ అన్నాడు...
"మేడం... కావాలంటే... మీ టికెట్ డబ్బులు నేనిస్తాను..."
"అంతే కానీ, ఇలా మీరు మాటి మాటికీ నా ఫాంట్ జిప్ ఓపెన్ చేసి కెలకడం ఏమీ బాగు లేదు..."

ప్రస్తుతానికి సెలవ్...
ఇంకా ఉన్నాయి.. గుర్తు తెచ్చుకోవాలి...

మురళి.












20, మే 2011, శుక్రవారం

14, మే 2011, శనివారం

కొద్దిగా బిజి...

అందుకే ఏమీ పోస్ట్ చేయలేక పోతున్నాను... ఈ మధ్య చాలానే సంఘటనలు జరిగాయి.... పుట్టపర్తి బాబా చనిపోవడం, ఎన్నికలు, జగన్ గెలుపు, షేర్ మార్కెట్ కూలిపోవడం మళ్ళీ అందుకోవడం, ఇలా... చాలానే... జరిగాయి... కానీ ఇంట్లో తేజస్విని లేదు... వేసవి సెలవులు కదా... హైదరాబాద్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది... ఇంట్లో ఒంటరిని... ఏమీ తోచదు... బ్లాగ్ లో కి రావాలన్నా మూడ్ లేదు... అదీ కాక పనికిమాలిన రొటీన్ జాబు ఒకటి ఏడ్చింది కదా...
ఈ రోజు కాటన్ దొర పుట్టిన రోజు... వెళ్లి విగ్రహం దగ్గర హ్యాపీ బర్త్ డే చెప్పేసాను... ఆడిట్ జరగా బోతోంది ఆఫీసు లో .... పని ఉంది... ప్రస్తుతానికి బ్లాగ్ మిత్రులకి నా సోది నుండి రిలాక్స్...
బై...
మురళి.