26, నవంబర్ 2011, శనివారం

GENERAL KNOWLEDGE

ఇది మా తేజస్విని లేటెస్ట్ జోక్... మన దృష్టిలో జోక్ కావచ్చు... కానీ చిన్న పిల్లల దృష్టిలో అది నాలెడ్జ్ .... ఒక యురేకా... ఒక డిస్కవరీ..
నాకూ అనిపిస్తుంది... మనం పాప అని.. బాబు అని.. పిల్లలకు చెప్పేస్తాం... కానీ వారిలో పాపకు, బాబుకూ, తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తుందా రాదా అని.. అమ్మకూ, నాన్నకూ తేడా ఏమిటీ అని...
మా తేజమ్మకు మొత్తానికి ఒక డౌట్ వచ్చింది.. రావడమే లేటు.. అడిగేసింది...
"నాన్నా..నీకు బుల్ల (మర్మాంగం) ఎలా ఉంటుంది? ... నా లాగాన? అమ్మ లాగానా? నాన్నమ్మ లాగన..."
దీనికి సమాధానం ఎలా చెప్పాలి... అని ఆలోచించాను నేను...స్కూల్ కు వెళుతుంది కదా.. అందుకని ఆ రూట్ లోనే అడిగాను... "మీ స్కూల్ లో బోయ్స్ ఉంటారా?" నా ప్రశ్న... "ఉంటారు " పాప సమాధానం...
"వాళ్ళకు బుల్ల ఎలా ఉంటుంది?"  ఏదో వారిలా ఉంటుంది అని చెప్పాలని అడిగానలా...
అందుకు మా పాప సమాధానం  "వన్ లా ఉంటుంది..."
ఇటువంటి కంపేరిజన్ ని ఊహించని నేను... ఒక్క క్షణం బిత్తర పోయినా.. మరు క్షణం పక్కుమని నవ్వేసి సమాధానం చెప్పాను అలానే ఉంటుందని...
బై....


20, నవంబర్ 2011, ఆదివారం

INVESTMENT OPTIONS-2

నమస్కారం...ఇన్వెస్ట్మెంట్ ఒప్షన్స్ పార్ట్ 2 కు స్వాగతం...

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...ఇది ఎక్కువగా TAX PAYERS కు ఉపయోగపడేది గా చెప్పబడింది...ఇందులో రిస్క్ తక్కువ... మరి లాభం కూడా తక్కువ... కానీ FIXED DEPOSITS లాగానే ఖచ్చితమైన INCOME గ్యారంటీ... కాకపోతే డబ్బు మధ్యలో వచ్చే సమస్య లేదు... ఏడవ సంవత్సరం వరకూ ఆగాల్సిందే... అడ్వాన్సు గా కావాలంటే LOAN OPTIONS ఉండి ఉండవచ్చు.. 

కంపెని FIXED DEPOSITS , BONDS : ఈ మధ్య ఛాలా కంపెనీ ఎఫ్.డి.లు, వస్తున్నాయి... ఒక కనిష్ట మొత్తాన్ని పెట్టుబడి గా పెడితే, పరిమిత కాలానికి, సంవత్సరానికి 10 నుండి 15 శాతం దాక వడ్డీ వచ్చే అవకాసం కల్పిస్తాయి... ఇది కూడా కాల పరిమితి పూర్తి అయ్యేవరకు తీసుకునే వీలు ఉండదు...
INSURANCE : నిజానికి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు... పైన పేర్కొన్న వాటిలో నాకు అనుభవం ఉన్నవి ఏమీ లేవు.. సాధారణం గా చాల మందికి అనుభవం ఉండదు కూడా... కానీ ఇన్సూరెన్స్ గురించి అనుభవం లేని వాళ్ళు చాల తక్కువ.. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మన జీవితం లో భాగం అయిపొయింది... దీని వలన లాభ నష్టాలు ఎంత మేరకు ఉన్నా, ప్రతి మనిషికీ ఇది అవసరం... దీని గురించి చెప్పాలంటే వ్యాసం లా కాకుండా నా అనుభవాలను రంగరించి చెప్పాలని ఉంది... మీ అనుమతి ఉన్నా, లేకపోయినా... నా సోది భరించాల్సిందే...
1992 తరువాతి నుండి, నా ఉద్యోగ పర్వం ఆరంభం అయ్యింది... ఆ సమయం, ప్రభుత్వ ఉద్యోగాలే పరమావధి గా చదువు కునే ఆలోచన నుండి, యువత ప్రయివేటు ఉద్యోగాలు, స్వంతంగా జీవనోపాధి కల్పించు కోవడం దిశగా ఆలోచనలు చేసి, ఆచరణ ప్రయత్నాలు చేస్తున్న కాలం... అప్పుడు ఎల్.ఐ.సి. లో TEMPORARY టైపిస్ట్ గా జాయిన్ అయ్యాను నేను... బుద్ధిగా ప్రయత్నం చేస్తే, అదే పెర్మనెంట్ అయ్యి ఉండేది... కాని మనకు అంత సీన్ ఎక్కడిది? ఇంతకీ విషయం నా ఉద్యోగం కాదు... ఆ సమయం లో ఎల్.ఐ.సి. నష్టాల్లో ఉందని, దాన్ని ప్రయివేట్ పరం చేస్తారని, ప్రభుత్వం సాధ్యమైనంత మందికి వి.ఆర్.ఎస్. తీసుకోవడానికి ప్రోత్సహిస్తుందని, ఊహాగానాలు జరుగుతున్నా కాలం... ఇన్సూరెన్స్ అంటే కేవలం, కుటుంబ సంక్షేమం కోసం మాత్రమె అని, ఎజంట్స్ జనాల చేత పాలసీలను చేయిస్తున్న కాలం.. ఇప్పటికీ కుటుంబ సంక్షేమం కోసమే ఇన్సూరెన్స్ ... అనేదాన్ని కాదనను... కానీ, అందుకన్న ఎక్కువగా TAX exemption కోసం ప్రస్తుతం పాలసీలు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం... ఇంతకీ, ఒక్క ఎల్.ఐ.సి. నే నష్టం వస్తుందని, భావిస్తున్న కాలం నుండి, ఇప్పుడు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఎన్ని రకాల పాలసీలు... అంతేనా... సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, అన్నింటికీ పనికి వచ్చే విధమైన పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి... అయితే, యూనిట్ లింక్డ్ పథకాలు ... (షేర్ మార్కెట్ మంచి ఊపులో ఉన్నప్పుడు పుట్టుకొచ్చాయి..ఇవి...) ఇప్పుడు చాల కంపెనీల ఏజంట్ లు  ... మూడు సంవత్సరాలు అరవై వేలు కట్టండి... పదిహేను సంవత్సరాల లోపు అరవై లక్షలు అవుతాయి...  అంటూ మభ్య పెట్టి మన చేత డబ్బు కట్టించుకోవడం మనకు తెలుసు... ఈ లక్షల మాట పక్కన పెడితే, మన పాలసీ మెచ్యురిటి సమయానికి ఆ పాలసీ నెట్ అసెట్ వేల్యూ ప్రకారం మనకు కేటాయించిన యూనిట్ల విలువను నిర్ధారించి మనకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది... కానీ, ఇక్కడే అసలు విషయం ఉంది... మనం అనుకుంటాం, మనం ఇరవై వేలు కట్టం, మనకు ఒక్కో యూనిట్ పది రూపాయల చొప్పున రెండు వేల యూనిట్లు కేటాయిస్తారని... కానీ, మనం కట్టిన ఇరవై వేలలో, దాదాపు సగం ఫండ్ ఆలోకేషన్ చార్జ్ లని, తీసుకుంటారు... మనకు కేటాయించే యూనిట్లు కేవలం పది వేల ఖరీదు వై ఉంటాయి.. ఈ చార్జీలు ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కోలా ఉండవచ్చు... కాబట్టి యులిప్ పాలసీ లను ఎంచుకొనే ముందు... ఈ విషయాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం...

ఇప్పటికి ఇది ఎక్కువ.. 
bye 

మురళి.

1, నవంబర్ 2011, మంగళవారం

INVESTMENT OPTIONS

కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవారు తమ నెల జీతంలో కనీసం పది శాతం చొప్పున పొదుపు చేస్తుండాలని చాల మంది అంటూ ఉంటారు... ఆర్ధిక నిపుణుల సలహా ఇది.. నిజంగా నిజం కూడా... ఈ కాలం లో ఈ ప్రయివేటు ఉద్యోగాలకు వచ్చే జీతాలు, ఇంట్లో ఖర్చులూ ఎప్పుడూ TALLY కావు.. ఎప్పుడూ జాతకంలో ఆదాయం పది.. వ్యయం ఇరవై.. అని చూపుతూనే ఉంటుంది... మరి ఇటువంటి "తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు.. గొర్రె తోక బెత్తెడు.. లాంటి జీతాలతో కూడిన జీవితానికి పది శాతం పొదుపు ఎలా సాధ్యం అవుతుంది? ... ఇది నిజమే... కానీ.. యెంత జీతం వస్తే మనకు సరిపోతుంది? నెలకు లక్ష వచ్చినా దానికి తగ్గ ఖర్చులు సిద్ధం గా ఉంటాయి... కాబట్టి పొదుపు చేయడం అలవాటు చేసుకోలేక పోతే... రేపటికి ఏమీ మిగలదు... మరి ఒక డబ్బాలో వేసి పెడితే డబ్బు పెరగదు కదా..  పోలమో, స్థలమో, ఇల్లో, బ్యాంకో, బంగారమో, చిట్ రూపం గానో, ఏదో ఒక రూపం లోకి  డబ్బును మార్చాలి... కానీ, వంద రూపాయలకు ఇల్లో, స్తలమో, బంగారమో రాదు కదా.. అందు వలన ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను ఖచ్చితంగా ఆశ్రయించాల్సిందే...
అసలు డబ్బును ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ఏ మార్గాలు ఉన్నాయో ... యెంత కాలానికి ఏ ఆప్షన్ మంచిదో మనీ కంట్రోల్ డాట్ కాం లో INVESTMENT OPTIONS లో వివరించడం జరిగింది... ఇది జస్ట్ బేసిక్ KNOWLEDGE లాంటిది.. ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన కు, ఒక చిన్న దారి చూపిస్తుంది ఇది... ఈ విషయాలు చాల మందికి తెలిసినవే.. కనుక ఈ విషయాలు తెలియని వారి కోసం అని గ్రహించ గలరు...
INVESTMENT OPTIONS 
1 Savings బ్యాంకు ఎకౌంటు: ఈ కాలం లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనీసం ఒక బ్యాంకు లో సేవింగ్స్ ఎకౌంటు కలిగి ఉండాలి... అసలు బ్యాంకు లో ఎకౌంటు లేని వారు ఈ కాలం లో అరుదనే చెప్పాలి.. డబ్బును ఎప్పుడైనా వేయడం లేదా తీయడం వీలయ్యే ఖాతా ఇది.. ఈ ఖాతాలో డబ్బు సంవత్సరానికి ప్రస్తుత లెక్కల ప్రకారం నూటికి నాలుగు శాతం వడ్డీ ని అందిస్తుంది... ప్రస్తుతం రోజువారీ వడ్డీ లెక్కించే విధానం అమలులో ఉంది కాబట్టి వంద రూపాయలు మన ఎకౌంటు లో ఉంటె రోజుకు ఒక పైసా వడ్డీ మనకు వచ్చేస్తుందన్న మాట..  
2 మనీ మార్కెట్ ఫండ్స్ (లిక్విడ్ ఫండ్స్): ఇది సేవింగ్స్ బ్యాంకు కన్నా కాస్త ఎక్కువ, fixed deposits కన్నా తక్కువ ఆదాయాన్ని ఇచ్చే MUTUAL ఫండ్స్ ... 
౩. BANK FIXED DEPOSITS  : పైన చెప్పిన వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వచ్చే ఆప్షన్ ఇది.. ప్రస్తుతం RECURRING DEPOSITS మొదలైన ఆప్షన్ ద్వారా 7 % నుండి, 9 % వరకు వడ్డీ పొందే అవకాశం ఉన్న ఆప్షన్ ఇది..
పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీం.. : బ్యాంకు Fixed Deposits తో పోలిస్తే కాస్త ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉన్న ఆప్షన్ ఇది.. అయితే బ్యాంకు లో కూడా, రికరింగ్ డిపాజిట్ లో తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది.. పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ లో కూడా అంతే... పోస్ట్ ఆఫీసు Fixed డిపాజిట్ లో కిసాన్ వికాస్ పత్రం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాంటి వాటికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది... కాబట్టి పన్ను పోటు లేకుండా ఉండాలనుకునే వారు బ్యాంక్స్ కన్నా పోస్ట్ ఆఫీసు FD లనే ఆశ్రయిస్తారు...

ఇంకా మరికొన్ని... మరో సారి...

మీ.
మురళి.