నమస్కారం...ఇన్వెస్ట్మెంట్ ఒప్షన్స్ పార్ట్ 2 కు స్వాగతం...
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...ఇది ఎక్కువగా TAX PAYERS కు ఉపయోగపడేది గా చెప్పబడింది...ఇందులో రిస్క్ తక్కువ... మరి లాభం కూడా తక్కువ... కానీ FIXED DEPOSITS లాగానే ఖచ్చితమైన INCOME గ్యారంటీ... కాకపోతే డబ్బు మధ్యలో వచ్చే సమస్య లేదు... ఏడవ సంవత్సరం వరకూ ఆగాల్సిందే... అడ్వాన్సు గా కావాలంటే LOAN OPTIONS ఉండి ఉండవచ్చు..
కంపెని FIXED DEPOSITS , BONDS : ఈ మధ్య ఛాలా కంపెనీ ఎఫ్.డి.లు, వస్తున్నాయి... ఒక కనిష్ట మొత్తాన్ని పెట్టుబడి గా పెడితే, పరిమిత కాలానికి, సంవత్సరానికి 10 నుండి 15 శాతం దాక వడ్డీ వచ్చే అవకాసం కల్పిస్తాయి... ఇది కూడా కాల పరిమితి పూర్తి అయ్యేవరకు తీసుకునే వీలు ఉండదు...
INSURANCE : నిజానికి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు... పైన పేర్కొన్న వాటిలో నాకు అనుభవం ఉన్నవి ఏమీ లేవు.. సాధారణం గా చాల మందికి అనుభవం ఉండదు కూడా... కానీ ఇన్సూరెన్స్ గురించి అనుభవం లేని వాళ్ళు చాల తక్కువ.. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మన జీవితం లో భాగం అయిపొయింది... దీని వలన లాభ నష్టాలు ఎంత మేరకు ఉన్నా, ప్రతి మనిషికీ ఇది అవసరం... దీని గురించి చెప్పాలంటే వ్యాసం లా కాకుండా నా అనుభవాలను రంగరించి చెప్పాలని ఉంది... మీ అనుమతి ఉన్నా, లేకపోయినా... నా సోది భరించాల్సిందే...
1992 తరువాతి నుండి, నా ఉద్యోగ పర్వం ఆరంభం అయ్యింది... ఆ సమయం, ప్రభుత్వ ఉద్యోగాలే పరమావధి గా చదువు కునే ఆలోచన నుండి, యువత ప్రయివేటు ఉద్యోగాలు, స్వంతంగా జీవనోపాధి కల్పించు కోవడం దిశగా ఆలోచనలు చేసి, ఆచరణ ప్రయత్నాలు చేస్తున్న కాలం... అప్పుడు ఎల్.ఐ.సి. లో TEMPORARY టైపిస్ట్ గా జాయిన్ అయ్యాను నేను... బుద్ధిగా ప్రయత్నం చేస్తే, అదే పెర్మనెంట్ అయ్యి ఉండేది... కాని మనకు అంత సీన్ ఎక్కడిది? ఇంతకీ విషయం నా ఉద్యోగం కాదు... ఆ సమయం లో ఎల్.ఐ.సి. నష్టాల్లో ఉందని, దాన్ని ప్రయివేట్ పరం చేస్తారని, ప్రభుత్వం సాధ్యమైనంత మందికి వి.ఆర్.ఎస్. తీసుకోవడానికి ప్రోత్సహిస్తుందని, ఊహాగానాలు జరుగుతున్నా కాలం... ఇన్సూరెన్స్ అంటే కేవలం, కుటుంబ సంక్షేమం కోసం మాత్రమె అని, ఎజంట్స్ జనాల చేత పాలసీలను చేయిస్తున్న కాలం.. ఇప్పటికీ కుటుంబ సంక్షేమం కోసమే ఇన్సూరెన్స్ ... అనేదాన్ని కాదనను... కానీ, అందుకన్న ఎక్కువగా TAX exemption కోసం ప్రస్తుతం పాలసీలు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం... ఇంతకీ, ఒక్క ఎల్.ఐ.సి. నే నష్టం వస్తుందని, భావిస్తున్న కాలం నుండి, ఇప్పుడు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఎన్ని రకాల పాలసీలు... అంతేనా... సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, అన్నింటికీ పనికి వచ్చే విధమైన పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి... అయితే, యూనిట్ లింక్డ్ పథకాలు ... (షేర్ మార్కెట్ మంచి ఊపులో ఉన్నప్పుడు పుట్టుకొచ్చాయి..ఇవి...) ఇప్పుడు చాల కంపెనీల ఏజంట్ లు ... మూడు సంవత్సరాలు అరవై వేలు కట్టండి... పదిహేను సంవత్సరాల లోపు అరవై లక్షలు అవుతాయి... అంటూ మభ్య పెట్టి మన చేత డబ్బు కట్టించుకోవడం మనకు తెలుసు... ఈ లక్షల మాట పక్కన పెడితే, మన పాలసీ మెచ్యురిటి సమయానికి ఆ పాలసీ నెట్ అసెట్ వేల్యూ ప్రకారం మనకు కేటాయించిన యూనిట్ల విలువను నిర్ధారించి మనకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది... కానీ, ఇక్కడే అసలు విషయం ఉంది... మనం అనుకుంటాం, మనం ఇరవై వేలు కట్టం, మనకు ఒక్కో యూనిట్ పది రూపాయల చొప్పున రెండు వేల యూనిట్లు కేటాయిస్తారని... కానీ, మనం కట్టిన ఇరవై వేలలో, దాదాపు సగం ఫండ్ ఆలోకేషన్ చార్జ్ లని, తీసుకుంటారు... మనకు కేటాయించే యూనిట్లు కేవలం పది వేల ఖరీదు వై ఉంటాయి.. ఈ చార్జీలు ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కోలా ఉండవచ్చు... కాబట్టి యులిప్ పాలసీ లను ఎంచుకొనే ముందు... ఈ విషయాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం...
ఇప్పటికి ఇది ఎక్కువ..
bye
మురళి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి